
‘ఆడై’లో అమలాపాల్, అమలాపాల్
ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది ‘ఆడై’ అనే తమిళ సినిమా టీజర్. అందులో అమలాపాల్ నగ్నంగా కనిపించడమే అందుకు కారణం. ఆమె గట్స్‌కి ప్రేక్షకులు షాక్ అయ్యారు. అది కేవలం సినిమాలో ఓ సన్నివేశం అని ఊహించారు. కానీ సినిమాలో కొంత పోర్షన్ వరకూ అమలాపాల్ ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా కనిపిస్తారని సమాచారం. రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘ఆడై’. అంటే ‘బట్టలు’ అని అర్థం. ఈ సినిమాలో నగ్నంగా కనిపించే సన్నివేశాలను 20 రోజులపాటు షూట్ చేశారట చిత్రబృందం.
చిత్రానికి ఇవే ఎంతో కీలకంగా నిలవబోతున్నాయని సమాచారం. ఈ ఇరవై రోజులూ చాలా తక్కువమంది చిత్రబృందంతో జాగ్రత్తగా చిత్రీకరణ జరిపారట. కథలో ఎంత బలం ఉంటే అమలాపాల్ ఈ సాహసం చేయడానికి అంగీకరించారో ఊహించుకోవచ్చు. మరోవైపు ఈ సన్నివేశాలకు సెన్సార్ బృందం అంగీకారం తెలపకపోవచ్చని, నగ్నసన్నివేశాలను బ్లర్ చేయడమో, కట్ చేయడమో జరిగే అవకాశం ఉందని తమిళ పరిశ్రమలో చర్చ మొదలైంది. మరి.. బట్టలు కత్తెరకు గురవుతాయా? వేచి చూడాలి. ‘ఆడై’ లె లుగులో ‘ఆమె’ పేరుతో రిలీజ్ కానుంది.