
అమలా పాల్
అమలా పాల్ కొత్త చిత్రం పేరు ‘ఆడై’. అంటే బట్టలు అని అర్థం. కానీ ఈ చిత్రం టీజర్ చూస్తే అవి లేకుండానే కొన్ని సన్నివేశాల్లో ఆమె కనిపించారని తెలుస్తోంది. నగ్నసత్యాలను కొందరు దర్శకులు పట్టుబట్టలు కట్టి చెప్పదలచుకుంటారు. కొందరు నగ్నంగానే చూపించేస్తారు. దర్శకుడు రత్నకుమార్ ఏదో విషయాన్ని నగ్నంగా చెప్పదలిచారు. అందుకే తన లీడ్ యాక్టర్‌తో నగ్నంగా నటింపజేశారు. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా అంత నగ్నంగా చెప్పదలిచిన విషయం ఏంటా? అని టీజర్ చూసి ఆలోచనలో పడక మానం.
అమలాపాల్ ముఖ్యపాత్రలో రత్నకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఆడై’. ఈ చిత్రం టీజర్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందులో అమలా పాల్ నగ్నంగా కనిపించారు. ‘నీకు జరిగిన దానికి తిరిగి నువ్వేం చేస్తావో అనేదే స్వాతంత్య్రం’ అనే కొటేష¯Œ ను టీజర్‌లో చూపించాడు దర్శకుడు. సో.. తనకు జరిగిన అన్యాయంపై పగ తీర్చుకునే పాత్ర అమలా పాల్‌ది అని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని ‘ఆమె’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment