
చలపతి పువ్వల, విశ్వ కార్తికేయ, ఎమ్. సుధాకర్‌రెడ్డి
విశ్వ కార్తికేయ, దీపా ఉమావతి జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళాపోషకులు’. ఎమ్. సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను సీనియర్ జర్నలిస్ట్ ప్రభు విడుదల చేశారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ చిత్రంలో బాల నటుడిగా నటించిన విశ్వ కార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమా అయినా బాగా నటించాడు. ప్రేమ కథతో పాటు కుటుంబ ఆంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘ప్రస్తుతం మా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది’’ అన్నారు ఎమ్. సుధాకర్ రెడ్డి. ‘‘మేమందరం ఎంతో ఇష్టంగా కష్టపడి చేసిన ‘కళాపోషకులు’ చిత్రానికి ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు విశ్వ కార్తికేయ.
Comments
Please login to add a commentAdd a comment