జుంగా నిర్మాతెవరో తెలుసా..? | Saaheshyagal is going to romance with Vijayesupathi. | Sakshi
Sakshi News home page

జుంగా నిర్మాతెవరో తెలుసా..?

Published Sat, Sep 2 2017 3:45 AM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM

జుంగా నిర్మాతెవరో తెలుసా..?

జుంగా నిర్మాతెవరో తెలుసా..?

తమిళసినిమా:  వరుస విజయాలాతో దూసుకుపోతున్న యువ నటుడు విజయ్‌సేతుపతి. ఇటీవల విక్రమ్‌వేదా చిత్రంలో దాదాగా నటించి ఆ చిత్ర సంచలన విజయానికి కారణంగా నిలిచారు. ప్రస్తుతం ఏఎం.నిర్మిస్తున్న కరుప్పన్‌ చిత్రంలో గ్రామీణ యువకుడి పాత్రలో మరోసారి తన సత్తా చూపడానికి రెడీ అవుతున్నారు. తాజాగా జుంగా అనే మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

ఇంతకు ముందు ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ బాలకుమారా వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన గోకుల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.వరుస విజయాలాతో దూసుకుపోతున్న యువ నటుడు విజయ్‌సేతుపతి.బాలీవుడ్‌ బ్యూటీ సాయేషాసైగల్‌ విజయ్‌సేతుపతితో రొమాన్స్‌ చేయనుంది. మరో ముఖ్యపాత్రలో యోగిబాబు నటించనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు గోకుల్‌ తెలుపుతూ ఇది విజయ్‌సేతుపతిని యాక్షన్‌ హీరోగా చూపే కథా చిత్రం అని తెలిపారు. చిత్రం 60 శాతం ఫ్రాన్స్‌లోనూ మిగిలిన భాగాన్ని చెన్నై, తూత్తుకుడి, రామనాథపురంలోనూ చిత్రీకరించనున్నట్లు చెప్పారు.

ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ చిత్రం తరువాత విజయ్‌సేతుపతి మరో చిత్రం కలిసి చేద్దాం అని అన్నారన్నారు. ఇటీవల ఈ జుంగా కథను విజయ్‌సేతుపతికి చెప్పగా పూర్తిగా విన్న తరువాత కొంచెం మౌనం వహించి ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తానని అన్నారన్నారు. వేరే నిర్మాత రెడీగా ఉన్నారని చెప్పినా తానే చేస్తాననడంతో తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. ఎందుకంటే ఈ చిత్రం బడ్జెట్‌ రూ.కోటి దాటుతుందని అన్నారు. ఇప్పుటి వరకూ విజయ్‌సేతుపతి నటించిన చిత్రాలన్నిటికంటే భారీ బడ్జెట్‌ చిత్రంగా జుంగా ఉంటుందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఆ నెల చివరిలో ప్రారంభించనున్నట్లు దర్శకుడు గోకుల్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement