ఎవరీ అందగత్తె? | First Look of Vijay Sethupathi as Transgender in Super Deluxe Tamil Movie is Going Viral | Sakshi
Sakshi News home page

ఎవరీ అందగత్తె?

Published Thu, Sep 14 2017 4:51 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

ఎవరీ అందగత్తె?

ఎవరీ అందగత్తె?

తమిళసినిమా: ఈ ఫొటోలో యవ్వనవతిగా కనిపిస్తున్న అందగత్తె ఎవరో చెప్పగలరా? చిన్న క్లూ ఇస్తున్నాం. ఆమె మగువ వేషంలో ఉన్న మగాడు. రూప కళ కూడా నానాటికి ఆధునీకతను సంతరించుకుంటోందనడానికిదో మచ్చుతునక. చిత్రాల్లో కథానాయకులు సందర్భాన్ని బట్టి అమ్మాయిల రూపంలోకి మారిపోతుంటారు. అలా ఆడవేషంలో రజనీకాంత్, కమలహాసన్‌ నుంచి ఈ తరం వారిలోనూ చాలా మంది నటించి అలరించారు.

ముఖ్యంగా కమలహాసన్‌ అవ్వైషణ్ముకి, ప్రశాంత్‌ ఆన్‌అళగన్‌ చిత్రాల్లో ఆడవారికి ఏ మాత్రం తీసిపోని విధంగా అవతారమెత్తి, హావభావాలను పలికించి మెప్పించారు. ఇటీవల నటుడు శివకార్తికేయన్‌ కూడా రెమో చిత్రంలో అందమైన నర్సుగా మురిపించి విజయాన్ని అందుకున్నారు. మరి ఈ తాజా సుందరి ఎవరో గ్రహించారా? ఎస్‌. పై ఫొటోలో అందగత్తెలా కనిపిస్తున్నది నటుడు విజయ్‌సేతుపతినే. ఈయనిప్పుడు మంచి రైజింగ్‌లో ఉన్నారు.

విజయ్‌సేతుపతి కాల్‌షీట్స్‌ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారనే చెప్పవచ్చు. ఇంతకు ముందు అరణ్యకాండం వంటి విమర్శకులను సైతం మెప్పించిన చిత్రాన్ని తెరపై ఆవిష్కరించిన కుమారరాజా తాజాగా విజయ్‌సేతుపతి కథానాయకుడిగా చిత్రం చేయబోతున్నారు. ఇందులో ఆయన హిజ్రాగా నటించనున్నారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా చిత్ర యూనిట్‌ అందమైన అమ్మాయి రూపంలో ఉన్న విజయ్‌సేతుపతి ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఈ పాత్ర పేరు శిల్ప అట.

మరి ఈ శిల్ప పాత్ర అమ్మాయా? లేక ఇప్పటికే ప్రచారంలో ఉన్న హిజ్రానా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇందులో నటి సమంత కథానాయకిగా నటించనున్నారు. నదియా, దర్శకుడు మిష్కిన్, గాయత్రి, భాగవతి ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సూపర్‌డీలక్స్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి నలన్‌కుమారస్వామి, నలన్‌శంకర్, మిష్కిన్, కుమారరాజా నలుగురు దర్శకులు కథను తయారు చేశారు. దీనికి యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని, ఛాయాగ్రహణం, పీఎస్‌.వినోద్, నీరవ్‌షా అందించనున్నారు. ఈ చిత్రాన్ని టైలర్‌సుడన్, కినో ఫిస్ట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement