sathish
-
అరుదైన ఆహ్వానం: 12 ఏళ్లు.. 15 లైబ్రరీలు..
ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నఇరవై మందిలో విద్యార్థులు ఆరుగురు. వారిలో అమ్మాయి ఒకే ఒక్కరు. ఆ సరస్వతి పుత్రిక పేరు ఆకర్షణ. లైబ్రరీలు స్థాపిస్తూ సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేస్తున్న ఆమె అక్షరసేవకు జాతీయ స్థాయిలో అందిన గుర్తింపు ఇది. ‘‘హైదరాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్‌మాస్టర్ నుంచి 12వ తేదీన నాన్నకు ఫోన్ వచ్చింది. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా 15వ తేదీన ఢిల్లీలో జరిగే వేడుకలకు హాజరుకావలసిందిగా మీ అమ్మాయి ఆకర్షణకు ఆహ్వానం వచ్చిందని చెబుతూ అభినందనలు తెలియచేశారు’’ అంటూ తాను లైబ్రరీ వ్యవస్థాపకురాలిగా మారిన వివరాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు ఆకర్షణ సతీష్.కోవిడ్ వచ్చినప్పుడు..‘‘హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాన్న సతీశ్ క్యాన్సర్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ ఉద్యోగి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. పుస్తక పఠనం నా హాబీ కావడంతో వెయ్యికి పైగా పుస్తకాలతో ఇంట్లోనే నాకు సొంత లైబ్రరీ ఉంది. ఇతరుల కోసం లైబ్రరీ స్థాపించాలనే ఆలోచన కోవిడ్ సమయంలో వచ్చింది.తొలి లైబ్రరీ క్యాన్సర్ హాస్పిటల్లో..నాన్న ఉద్యోగరీత్యా క్యాన్సర్ హాస్పిటళ్లకు టచ్‌లో ఉంటారు. కోవిడ్ సమయంలో ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్లు ‘కోవిడ్ కారణంగా వంటవాళ్లు డ్యూటీకి రావడం లేదు. పేషెంట్లకు ఆహారం అందించడానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసి పెట్టవలసింది’గా కోరడంతో నాన్న వాళ్ల కోసం రోజూ భోజనం వండించి తీసుకెళ్లి ఇచ్చేవారు. నాకు స్కూల్ లేకపోవడంతో రోజూ నాన్నతోపాటు హాస్పిటల్‌కి వెళ్లేదాన్ని. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లలో నా ఏజ్ గ్రూప్ వాళ్లతో స్నేహం ఏర్పడింది. వాళ్లు కొంతమంది చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చిపెట్టమని అడిగారు. రోజూ నా పుస్తకాలు కొన్ని తీసుకెళ్లి ఇస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత గారు... ‘హాస్పిటల్‌కి చికిత్స కోసం ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తుంటారు. హాస్పిటల్లోనే లైబ్రరీ ఉంటే బావుంటుంది’ అన్నారు. వారి ఆలోచనే నా లైబ్రరీ ఉద్యమానికి నాంది. నా పుస్తకాలతోపాటు మా స్కూల్, అపార్ట్మెంట్ స్నేహితుల నుంచి సేకరించిన వెయ్యికి పైగా పుస్తకాలతో తొలి లైబ్రరీ అలా మొదలైంది. ఇప్పటికి 9,836 పుస్తకాలతో 15 లైబ్రరీలు ఏర్పాటు చేయగలిగాను.పదకొండు వేల పుస్తకాలు..నాలుగేళ్లలో పదకొండు వేల పుస్తకాలు సేకరించాను. అందులో రెండు వేల పుస్తకాలు ప్రధాని నరేంద్రమోదీగారిచ్చారు. ఈ ఏడాది మార్చి 18న కోయంబత్తూరులో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఆయన 25 లైబ్రరీలు స్థాపించమని, 25 లైబ్రరీ స్థాపనకు స్వయంగా హాజరవుతానని చె΄్పారు. భారత రాష్ట్రపతి గత ఏడాది శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశాను.అప్పుడామె ‘ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది, పుస్తక పఠనాన్ని ్రపోత్సహించడానికి దోహదం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించ’మని చెప్పి ఆమే స్వయంగా 74 పుస్తకాలిచ్చారు. ఈ ఏడాది ఢిల్లీ, కర్తవ్య పథ్‌లో జరిగిన 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఇదే ఏడాది స్వాతంత్య్రదినోత్సవం వేడుకలకు కూడా హాజరయ్యే అవకాశం కలగడం సంతోషంగా ఉంది’’ అంటూ 25 లైబ్రరీల లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పింది ఆకర్షణ సతీశ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సీఎం జగన్‌పై దాడి: సతీష్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ విధింపు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఏ1గా ఉన్న సతీష్‌ను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించ్చింది.ఈ నేపథ్యంలో సతీష్‌ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. కాగా, న్యాయవాది సమక్షంలో సతీష్‌ను విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో, ఈనెల 25, 26, 27 తేదీల్లో సతీష్‌ను పోలీసులు విచారించనున్నారు. ఇక, సీఎం జగన్‌పై సతీష్ రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై సతీష్ హత్యాయత్నానికి తెగబడ్డాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది.రిమాండ్ రిపోర్టు ఇలా.. సీఎం జగన్‌పై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కోసం నిందితులు పక్కాగా స్కెచ్ గీసుకున్నారన్న విషయం తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పాటు కాల్‌డేటా, సిసిటివి ఫుటేజ్‌లు అన్నీ పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్లు నిర్ధారించారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.17వ తేదీన A1నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో.. నిందితుడు సతీష్ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎంను చంపాలనే కుట్రతోనే సీఎం తల భాగంపై దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.కుట్ర ఎలా జరిగిందంటే?ముఖ్యమంత్రిపై దాడి చేయాలని ముందస్తు పథకం వేసుకున్నారు.ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు ఏ1 సతీష్‌ను ప్రేరేపించాడు.ఈ కేసులో ఏ2 ఆదేశాలతో సీఎం జగన్‌ను హత్య చేయడానికి సతీష్ సిద్ధమయ్యాడుసింగ్ నగర్ ప్రాంతంలో వివేకా నంద స్కూల్ దగ్గర నిందితుడు వెయిట్ చేశాడుసీఎం జగన్ వచ్చే వరకు ఎదురు చూశాడుదాడికి పదునుగా ఉన్న రాళ్లను ముందే సేకరించాడుప్యాంటు జేబులో రాళ్లను పెట్టుకుని నిందితుడు వచ్చాడునిందితుడి కాల్ డేటాలో కీలకమైన అంశాలు దొరికాయిసీసీటీవీ ఆధారంగా కేసుకు సంబంధించి చాలా విషయాలు లభించాయిప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం క్లియర్‌గా ఉందిఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించాంసాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేశాం17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశారు. -
ఆధార్‌కార్డు మార్చే విషయంపై.. వివాహిత తీవ్ర నిర్ణయం!
నిజామాబాద్: భర్త వేధింపులతోనే వివాహిత నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధాకర్ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేటకు చెందిన శిరీష(25), సతీశ్ దంపతులు. వీరికి ఏడాది బాబు యోగేశ్ ఉన్నాడు. తరచూ భర్త వేధింపులతో పాటు ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పు విషయమై వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మానసిక వేదనకు గురైన శిరీష బుధవారం తల్లిగారింటికి వెళ్తున్నాని చెప్పి కుమారుడు యోగేశ్‌తో కలిసి బస్సులో వెళ్లింది. మార్గమధ్యలో బస్సు దిగిన శిరీష నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపంలో ఉన్న చెట్టు కింద కుమారుడు యోగేశ్‌ను కూర్చోబెట్టి తాను కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ప్రొద్దుటూరులో దారుణం.. ఒకరు మృతి
-
స్నేహితుడి మరణం.. బోరున ఏడ్చేసిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్లో దర్శకనటుడు సతీష్ కౌశిక్(67) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన మిత్రుడు, మరో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. సతీశ్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో సతీశ్ పార్థివదేహం వద్ద అనుపమ్ ఖేర్ బోరున విలపించారు. స్నేహితుని మరణాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. సతీశ్ మృతిపట్ల అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ..' మేమిద్దరం మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లం. సొంతంగా పేరు తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాం. ముంబై నగరం మాకు అవకాశం ఇచ్చింది. దాన్ని సాధించాం. కానీ ఇది జీర్ణించుకోవటం చాలా కష్టం. అతను చాలా చమత్కారి. ప్రతి విషయాన్ని తేలికగా అర్థం చేసుకునేవాడు. ఎలా జీవించాలనేది ప్రజలు అతని నుంచి నేర్చుకుంటారు. మమ్మల్ని అకాలంగా విడిచి వెళ్లాడనే పశ్చాత్తాపం నాకు ఎప్పటికీ ఉంటుంది.' అంటూ ఎమోషనలయ్యారు. అదేవిధంగా సతీశ్ కౌశిక్‌తో తనకు 45 నుంచి అనుబంధమని అనుపమ్ ఖేర్ తెలిపారు. కాగా.. 13 ఏప్రిల్ 1956లో హర్యానాలో పుట్టి, పెరిగిన సతీష్ కౌశిక్.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే అనుపమ్ ఖేర్‌తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. 1983లో వచ్చిన జానే భీ దో యారోన్ చిత్రానికి ఆయన సంభాషణలు అందించారు.. కమెడియన్‌గా, స్క్రీన్ రైటర్‌గా, దర్శకనిర్మాతగానూ ఆయన బాలీవుడ్లో రాణించారు. Anupam Kher Looses A True Friend 💔#AnupamKher #RipLegend #ShatishKaushik #ripshatishkaushik pic.twitter.com/wzbnQ0dR3Z — Yogeshnegi45 (@Yogeshnegi451) March 9, 2023 -
Sunny Leone: సన్నీలియోన్ చాలా సహకరించింది
శృంగార తార సన్నిలియోన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ఓ మై ఘోస్ట్. వీఏయూ మీడియా అధినేత వీరశక్తి, వైట్‌హార్స్ స్టూడియోస్ అధినేత ఆల్.శశికుమార్ కలిసి నిర్మించిన చిత్రం ఇది. యువన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు సతీష్, దర్శగుప్తా, యోగిబాబు, మొటై రాజేంద్రన్, జీపీ ముత్తు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం చెన్నైలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసంది. సన్నిలియోన్ మాట్లాడుతూ ఓ మై ఘోస్ట్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తనను క్వీన్‌గా మార్చిన యూనిట్ సభ్యులకు, తన టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. చిత్రం లవ్, యాక్షన్, కామెడీ, గ్లామర్ తదితర అంశాలతో ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. దక్షిణాది చిత్రాల్లో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇక్కడి ప్రజల్లో ప్రేమాభిమానాలు ఎక్కువ అన్నారు. ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు యువన్ సహకరించడంతో తమిళ భాష సమస్య అనిపించలేదన్నారు. చిత్ర దర్శకుడు యువన్ మాట్లాడుతూ.. ఈ కథను తయారు చేస్తున్నప్పుడు సన్నిలియోన్ పాత్రను బ్రాకెట్లో పెట్టినట్లు తెలిపారు. ఆ పాత్రకు సన్నిలియోన్ లాంటి నటి అయితే బాగుంటుందని నిర్మాతతో చెప్పగా అలాంటి నటి ఎందుకు ఆమెనే నటించమని అడుగుదాం అన్నారని, దీంతో ఆమెను కలిసి కథ చెప్పగానే బాగుంది చేద్దామని చెప్పారన్నారు. ఆ తరువాత ఆమె ఎంతగానో సహకరించారని తెలిపారు. చిత్రం బాగా వచ్చిందని, ప్రేక్షకులు కొన్న టికెట్‌కు కచ్చితంగా తగిన వినోదాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
నిత్య పెళ్లికొడుకు అరెస్టు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని..
సాక్షి, చెన్నై(అన్నానగర్): ఒకరికి తెలియకుండా మరొకరిని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలోని బోధికులం గ్రామానికి చెందిన సతీష్ (38) కట్టెల వ్యాపారి. అదే గ్రామానికి చెందిన రేఖను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఆమె నుంచి విడిపోయి లతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత మురుగలక్ష్మితో పరిచయం ఏర్పడి ఆమెను వివాహమాడాడు. అరుప్పుకోటైలో ఆమెతో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో మేకలు మేపుతున్న 17 ఏళ్ల యువతితో సతీష్‌కి పరిచయం ఏర్పడింది. మాయమాటలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో తన కూతురు కనిపించడం లేదని బాలిక తండ్రి అరుప్పుకోటై తాలూకా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఉళుందూరుపేటలోని సోదరి ఇంట్లో ఉన్న బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను రక్షించి విరుదునగర్‌లోని ఆశ్రమంలో ఉంచారు. సతీష్ అరుప్పుకోటై సమీపంలోని పాలవనత్తం ప్రాంతంలో తలదాచుకున్నట్లు బుధవారం సమాచారం అందడంతో పోలీసులు పోక్సో చట్టం కింద సతీష్‌ను అరెస్టు చేశారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. భర్త పలుమార్లు హెచ్చరించినా..) -
స్మార్ట్ ఫిల్మ్; ఉమెన్ @ 40
మానసిక కల్లోలం, డిప్రెషన్, నిద్రలేమి, జ్ఞాపకశక్తి సమస్యలు.. 40 ఏళ్లు దాటిన చాలా మంది మహిళలు ఈ లక్షణాలన్నీ లేదా వీటిలో ఏదో ఒకదానిని అనుభవిస్తుంటారు. మెనోపాజ్‌కి కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నందువల్లనో, ప్రీ మెనోపాజ్ దశను అధిగమించలేకనో నాలుగుపదులు దాటిన వారి జీవితం కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. ఈ సమస్యలనే ఇతివృత్తంగా తీసుకొని గి@40 (ఉమన్ ఎట్ ఫార్టీ) పేరుతో 12 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌ను తీశారు స్మితా సతీష్. స్మితా సతీష్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త, మోటివేషనల్ ట్రైనర్. గతంలో స్మిత జువైనల్ జస్టిస్ బోర్డ్‌లో సభ్యురాలుగా ఉన్నారు. కేరళలోని త్రిసూర్‌లో ఉంటారు ఈమె. 43 ఏళ్ల స్మిత తన వ్యక్తిగత జీవితంలో చూసినవి, తనను కలిసిన కొంత మంది మహిళల సమస్యలను ఉదాహరణగా తీసుకుని 40 ఏళ్లు దాటిన గృహిణి పరిస్థితులతోబాటు, వారికి కుటుంబ మద్దతు ఎంత వరకు అవసరమో గి@40 షార్ట్ ఫిల్మ్‌లో కళ్లకు కడుతుంది. హాట్ ఫ్లాష్ ఈ ఏడాది మొదట్లో ‘హాట్ ఫ్లాష్’ అనే పేరుతో షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు స్మిత. ముందస్తు మెనోపాజ్ లక్షణాలలో ఒకటైన హాట్ ఫ్లాష్‌తో (అకస్మాత్తుగా వేడిగా అనిపించడం, తీవ్రమైన చమట పట్టడం) ఉన్న నలభై ఏళ్ల గృహిణి గురించి వివరించారు. ఉన్నట్టుండి చిరాకుగా మారడం, కోపం తెచ్చుకోవడం లేదా కారణం లేకుండా ఏడవడం, అందరూ తనను నిర్లక్ష్యం చేస్తున్నట్టు భావించడం .. ఇవన్నీ డాక్టర్, సైకాలజిస్ట్ సహాయంతో అధిగమించడం వరకు పాత్ర భావోద్వేగ ఎత్తుపల్లాల గుండా వెళుతుంది. ‘శరీరం మార్పులకు లోనవుతుంటుంది. రుతుక్రమంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో నలభై దాటిన వారి ప్రతి చర్యలను గమనించిన తర్వాత ఏదైనా చేయాలనుకున్నాను. అలా ఈ లఘు చిత్రాన్ని తీశాను’ అంటారామె. ఈ ఫిల్మ్‌కి స్మిత ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, ఇతర నటీనటులు వివిధ రంగాలలో ఉన్నవారు మొదటిసారి నటించారు. మహిళలకు అవగాహన తప్పనిసరి నలభై ఏళ్ల దాటిన మహిళల రోజువారీ సాధారణ లక్షణాలను హైలైట్ చేయడానికి ఆమె వివిధ పాత్రల ద్వారా మన ముందుకు తీసుకువచ్చారు. ‘మీరు బాగున్నారా?’ అనే ప్రశ్న సాధారణంగా మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ, సమస్య ఏంటంటే, ఈ దశలో ఉన్న మహిళలు తాము ఎందుకు కష్టంగా ఉన్నారో వారికై వారే అర్థం చేసుకోలేరు. కుటుంబ సభ్యులకు కూడా ఈ మహిళల మానసిక కల్లోలం, ప్రవర్తనలో మార్పుల గురించి ఏ మాత్రం తెలియదు’ అంటారు స్మిత. అలాంటి మహిళలకు అవగాహన కల్పించేందుకు ఈ ఫిల్మ్ సాయపడుతుంది. ‘చాలామంది ప్రసూతి వైరాగ్యం అంటే ప్రసవానంతరం డిప్రెషన్ గురించి ఇప్పుడిప్పుడే చర్చిస్తున్నారు. అలాగే, ప్రీ మెనోపాజ్ లేదా మెనోపాజ్ గురించి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పనిసరి పరిస్థితులలో అవసరం అనుకుంటే వైద్యులు కొన్నిసార్లు హార్మోన్ల చికిత్సను సూచిస్తారు. (క్లిక్ చేయండి: తొమ్మిది నెలల్లో 40 కేజీల బరువు తగ్గి...) ఈ వయసులో ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల వారి ప్రపంచం అందంగా మారుతుంది. అభిరుచులను పెంచుకోవడానికి, సృజనాత్మకమైన పనులు చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. కుటుంబం, స్నేహితులు వారికి అండగా ఉండాలి. వారి సమస్యలు అందరి చెవికెక్కాలి’ అనే విషయాన్ని స్మిత తన ఫిల్మ్ ద్వారా వివరించారు. డబ్ల్యూ ఎట్ ఫార్టీ ఫిల్మ్ నలభై ఏళ్ల వయసు దాటిన మహిళలకు చక్కటి సూచికలా ఉపయోగపడుతుంది. (క్లిక్ చేయండి: ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి) -
సార్.. వాడ్ని బండరాయితో బాదిన...
మొయినాబాద్: ‘సార్.. వాడి తలపై బండరాయితో బాదిన.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నడు’అని ఓ బాలుడు డయల్ 100కు ఫోన్ చేశాడు. స్పందించిన పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలొదిలాడు. మద్యం మత్తులో జరిగిన గొడవే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్ గ్రామానికి చెందిన దుబ్బ సతీశ్ (26) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఫుల్లుగా మద్యం సేవించి తూలుకుంటూ మండల కేంద్రంలోని పోచమ్మ గుడి వద్ద నుంచి వెళ్తున్నాడు. అదే సమయంలో పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఓ బాలుడు అతని స్నేహితులు నలుగురు ఫొటోలు దిగేందుకు అటువైపు వచ్చారు. గుడి దగ్గర బాలుడి స్నేహితుడికి చెందిన బైక్ ఆపారు. దానిపై బాలుడు కూర్చొని ఉండగా మత్తులో ఉన్న సతీశ్ తన బైక్‌పై ఎందుకు కూర్చున్నావని బాలుడిని ప్రశ్నించాడు. ‘బైక్ నీదికాదు మా స్నేహితుడిది’అంటూ బాలుడు అతన్ని తోసేశాడు. కిందపడిన సతీశ్ లేచి కొట్టే ప్రయత్నం చేయడంతో, సదరు బాలుడు పక్కనే ఉన్న బండరాయిని తీసుకుని అతని తలపై మోదాడు. దీంతో సతీశ్ తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే బాలుడు తన స్నేహితులతో కలసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, సాయంత్రం ఆరు గంటల సమయంలో ఘటన జరగడం, అప్పటికే చీకటి పడటంతో అటువైపు ఎవరూ వెళ్లి చూడలేదు. రాత్రి 10 గంటల సమయంలో బాలుడు మళ్లీ ఘటనా స్థలానికి వచ్చాడు. అప్పటికీ సతీశ్ కొన ఊపిరితో ఉండటంతో 100కు డయల్ చేశాడు. తాను బండరాయితో ఒకరిని కొట్టానని, అతనింకా కొనఊపిరితో ఉన్నాడని సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సతీశ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు, అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..
మైసూరు: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని విరక్తి చెందిన ప్రేమికులు ఉరి వేసుకుని తనువు చాలించారు. ఈ విషాద ఘటన మైసూరులో జరిగింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మలాపుర గ్రామానికి చెందిన బీజీ సతీశ్ (21), వరలక్ష్మి (20) అనే ఇద్దరు మృతులు. వీరు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్‌తో పెళ్లికి వరలక్ష్మి కుటుంబం అంగీకరించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాతనే తమ కూతురును ఇచ్చి పెళ్లి చేస్తామని తెలిపారు. బీఏ చదివిన సతీశ్ పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. యువతి నర్సింగ్ చదువుతోంది. కాగా, సతీశ్ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, మొదట ఉద్యోగం తెచ్చుకో అని ప్రియురాలి తండ్రి సిద్ధలింగ తేల్చి చెప్పడంతో ప్రేమ జంట మనస్తాపానికి గురైంది. మైసూరుకు వచ్చిన జంట మంగళవారం సాయంత్రం లాడ్జ్‌లో రూం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బంది కిటికీ నుంచి చూడగా గదిలో కొక్కీకి ఉరి వేసుకుని చనిపోయి ఉన్నారు. లాడ్జ్ యజమాని లష్కర్ ఏరియా పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (జైళ్లో నేత్ర.. నిర్మానుష్య బంగ్లాలో చోరీ) నదిలో దూకిన మరో ప్రేమజంట మైసూరు: తమ ప్రేమను ఇంట్లో పెద్దవాళ్లు అంగీకరించలేదని ప్రేమజంట కపిలా నదిలోకి దూకింది. నంజనగూడు తాలూకా ముడికట్టె వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా సోమవారపేట గ్రామ నివాసి అభి (19), చామరాజనగరకు చెందిన 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. బాలిక కాలేజీలో చదువుకుంటుండగా, అభి పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. వీరి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. బుద్ధిగా ఉండాలని మందలించారు. దీంతో యువ జంట ఆవేదనకు గురై కపిలా నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. నదిలో తెప్పలు నడుపుతున్నవారు ప్రేమ జంటను రక్షించడంతో గండం తప్పింది. ఇద్దరిని నంజనగూడు ఆస్పత్రిలో చేర్పించారు. పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. -
తల్లి ద్వారా కడుపులో బిడ్డకు కోవిడ్?
సాక్షి, హైదరాబాద్: కరోనా ఏడాదిగా మనిషికి ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంది. వ్యాధి లక్షణాలు మొదలుకొని వైరస్ వ్యాప్తి వరకూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ మహమ్మారి తల్లి నుంచి గర్భస్థ శిశువుకూ సోకుతుందని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఘంటా సతీశ్. లిటిల్‌స్టార్స్ పిల్లల ఆస్పత్రిలో పని చేస్తున్న ఆయన ఇటీవలే ఇలాంటి ఓ కేసును గుర్తించడమే కాకుండా.. కరోనాతో పుట్టిన పసిబిడ్డకు విజయవంతంగా చికిత్స అందించారు కూడా. ఇలా తల్లి మాయ ద్వారా బిడ్డకు వ్యాధి వ్యాపించడాన్ని కోవిడ్ 19 నియోనాటల్ మిస్–సి అని పిలుస్తారు. ఆసక్తికరమైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నెలలు నిండిన శిశువుల్లోనే యాంటీబాడీలు.. కోవిడ్–19 గురించి తెలిసినప్పటి నుంచి వైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఈ వ్యాధి తల్లి నుంచి గర్భంలో ఉన్న బిడ్డకు సోకే అవకాశం లేదు. కానీ గతేడాదిగా కోవిడ్‌తో బాధపడుతున్న గర్భిణులకు వైద్య సాయం అందిస్తున్న డాక్టర్ ఘంటా సతీశ్ మాత్రం ఈ అంశంతో ఏకీభవించలేదు. పుట్టిన బిడ్డల్లో కోవిడ్ లక్షణాలు ఉన్నా.. శరీరంలో యాంటీబాడీలు లేకపోవడాన్ని కొందరిలో గుర్తించారు. కొంతకాలం కింద కొంచెం అటు ఇటుగా జరిగిన నాలుగు కాన్పులతో ఈ అంశంపై ఆయన కొంత స్పష్టత సాధించగలిగారు. పుట్టిన నలుగురు పిల్లల్లో ఒకరు పూర్తిగా నెలలు నిండిన తర్వాత బయటికి రాగా.. మిగిలిన వారిని 32 వారాల్లోపే బయటకు తీశారు. నెలలు నిండిన తర్వాత పుట్టిన బిడ్డలో మాత్రమే యాంటీబాడీలు ఉండటాన్ని గుర్తించిన సతీశ్.. ఇది కచ్చితంగా తల్లి నుంచి గర్భంలోని బిడ్డకు వైరస్ సోకడం వల్ల మాత్రమే సాధ్యమైందన్న నిర్ధారణకు వచ్చారు. మిగిలిన ముగ్గురు బిడ్డల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ‘గర్భస్థ శిశువులకు తల్లి నుంచి ఉమ్మ నీరు దాటుకుని మరీ యాంటీబాడీలు చేరాలంటే కనీసం 32 వారాలు పూర్తయి ఉండాలి. నలుగురు పిల్లల్లో ఒక్కరు మాత్రమే ఈ స్థాయికి చేరుకున్నారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు 32 వారాలు పూర్తి కాకముందే పుట్టగా.. మిగిలిన ఇద్దరు 28, 31 వారాల తర్వాత పుట్టిన వారు’అని డాక్టర్ సతీశ్ వివరించారు. చికిత్స పద్ధతులు మారాలి గర్భంలో ఉన్న పిల్లలకు తల్లి ద్వారా కోవిడ్ సోకిన కేసులు ఇటీవల చాలా అరుదుగా కనిపిస్తున్నాయని డాక్టర్ ఘంటా సతీశ్ తెలిపారు. అంతర్జాతీయ జర్నల్స్‌తో ఈ విషయమై ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఈ పరిశోధన ద్వారా కోవిడ్ సోకిన గర్భిణుల విషయంలో తీసుకునే జాగ్రతలు, అనుసరించాల్సిన వైద్య పద్ధతుల్లో మార్పులు జరగొచ్చని, తద్వారా తల్లి, పిల్లలు ఇద్దరికీ మేలు జరుగుతుందని వివరించారు. -
తాగిన మైకంలో...
విజయ్, మమత, రిషీ, బేబీ సుహాన, సతీష్, లడ్డు, తేజశ్విని ముఖ్య పాత్రల్లో రాజా విక్రమ నరేంద్ర తెరకెక్కించిన చిత్రం ‘అమృత నిలయం’. ఆర్.పి. సమర్పణలో రామమోహన్ నాగుల, ప్రవీణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా పాటలను విడుదల చేశారు. రాజా విక్రమ నరేంద్ర మాట్లాడుతూ– ‘‘తాగిన మైకంలో యువత చేసే పొరపాట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లోని ఓ అంధుడి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించాం. మా సినిమా ద్వారా మంచి సందేశం ఇస్తున్నాం. ‘అపరాజిత సేవా సమితి’లోని అనాథ బాలికల చేత ఫస్ట్ లుక్, ఆడియో విడుదల చేయించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రధాన కథ అనాథగా మారిన అంధుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ‘అపరాజిత సేవా సమితి’లోని అనాథ పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కల్పించాం. మా బ్యానర్ నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇకపైనా చేస్తాం’’ అన్నారు రామమోహన్ నాగుల, ప్రవీణ్ కుమార్. -
సప్లమెంటరీలో పాస్.. మూడు ఉద్యోగాలు సాధించాడు
పాలకుర్తి: కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని నిరూపించారు పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీష్. ఇంటర్మీడియట్, డిగ్రీలో ఫెయిల్ అయినా ధైర్యం కోల్పోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగారు.. ప్రభుత్వ ఉద్యోగంలోనైతే ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్ణయించుకుని కష్టపడి చదివారు.. తద్వారా ఒకటి కాదు రెండు కాదు మూడు ఉద్యోగాలకు ఎంపికైన ఆయన చివరకు ఎస్సై పోస్టును ఎంచుకుని కొనసాగుతున్నారు. మధ్య తరగతి రైతు కుటుంబం ప్రస్తుత భద్రాద్రి జిల్లా పినపాక మండలంలోని ఏడూర్ల బయ్యారం గ్రామానికి చెందిన మధ్య తరగతి రైతు కుటుంబంలో సతీష్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులైన గండ్రాతి వెంకటరమణ – సమ్మయ్యకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమారులు వ్యవసాయం చేస్తుండగా.. చిన్న కుమారుడైన సతీష్‌ను చదివించి ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక. అయితే, 10వ తరగతిలో సాధారణ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఆయన ఇంటర్లో చేరాడు. ఇంటర్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలయ్యాడు. అయినా తల్లిదండ్రులు చదువు కొనసాగించాలని ప్రోత్సహించడంతో సప్లమెంటరీ పరీక్షలు రాసి పాసయ్యాక డిగ్రీలో చేరాడు. అయితే, డిగ్రీలో కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలయ్యాడు. చివరకు మూడో సంవత్సరంలో అన్ని పరీక్షలు రాసి సాధారణ మార్కులతో గట్టెక్కాడు. ప్రభుత్వ ఉద్యోగం దొరికితే... ఒకసారి ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ కోసం సతీష్ వీఆర్వో వద్దకు వెళ్లాడు. అయితే, ఆ పని చేయకపోవడమే కాకుండా జులుం ప్రదర్శించడంతో సతీష్ ఆవేదన చెందాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తనకు ఎదురుపడిన వీఆర్వో మాదిరిగా కాకుండా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఊరికి దూరంగా హైదరాబాద్ వెళ్లాడు. ఒకసారి ఎస్ఐ ఉద్యోగానికి పరీక్ష రాస్తే అవకాశం దక్కలేదు. అయినా నిరుత్సాహానికి గురికాకుండా పోటీ పరీక్షలకు అవసరమైన సబ్జెక్టులపై పట్టు సాధించేలా చదివాడు. అలా రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంతో పాటు డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఇందులో డిప్యూటీ జైలర్ ఉద్యోగాన్ని ఎంచుకోగా ఖమ్మంలో పోస్టింగ్ లభించింది. అయితే, ఆరు నెలల పాటు ఉద్యోగం చేశాక ప్రజలకు సేవల చేయాలంటే ఇది సరైన ఉద్యోగం కాదనుకున్న సతీష్ మళ్లీ ఎస్సై రాతపరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆయన పాలకుర్తి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, లక్ష్యాన్ని ఎంచుకోవడమే కీలకం ఇంటర్లో ఫెయిలైనప్పుడు నన్ను తల్లిదండ్రులు తిడతారనుకున్నాను. కానీ ధైర్యం చెప్పి చదువు కొనసాగించేలా ప్రోత్సహించారు. ఉద్యోగం సంపాదించాలనే తల్లిదండ్రుల కోరికతో పాటు నా లక్ష్యం సాధించాను. చదువుపై ఆసక్తిని పెంచుకుని ఆత్మవిశ్వాసంతో చదివితే ఉన్నత ఉద్యోగాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే సమయంలో లక్ష్యాన్ని ఎంచుకోవడం, దాని చేరుకునేందుకు కష్టపడడం కూడా ముఖ్యమే. – గండ్రాతి సతీష్, ఎస్ఐ, పాలకుర్తి -
‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’ టైటిల్ లోగో లాంచ్
సయిన్స్ స్టూడియోస్ బ్యానర్‌పై శివ, రక్ష, ఉమయ్ చంద్, అక్షితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం. ఈ చిత్రానికి సతీష్ బాతుల దర్శకుడు. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రాజ్ కందుకూరి చేతుల మీదుగా మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘ఈ కథ నాకు ముందే తెలుసు, సతీష్ కథ చెప్పినప్పుడే మంచి పాయింట్‌తో వీళ్ళు సినిమా తీస్తున్నారు, ఇది పెద్ద హిట్ అవుతుంది అని భావించా. ఈ రోజు పోస్టర్ చూస్తుంటే మరింత నమ్మకం కలిగింది. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమాకు వర్క్ చేయడంతో సినిమా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నా. మల్లిఖార్జున వంటి నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు రావడం ఆయనకు సినిమా పట్ల ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది’ అన్నారు. హీరో శివ మాట్లాడుతూ.. ‘సతీష్ నా దగ్గరకు ఒక మంచి కథ తో వచ్చాడు. కథ వినిన వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం భయ్యా అని చెప్పా, కథ అంత బాగుంటుంది. 36 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు. తను దర్శకుడి గా ఒక పెద్ద స్థాయిలో ఉంటాడు’ అన్నారు. సంగీత దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు సంగీతం చేస్తున్నప్పుడే మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. సినిమా సతీష్ తెరకెక్కించిన విధానం చాలా బాగుంది’ అన్నారు. నిర్మాత మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. ‘ముందుగా మా సినిమాకు ఇంత సపోర్ట్ అందించిన రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా చాలా బాగా వచ్చింది. నేను కూడా రాజ్ కందుకూరి లా నిర్మాతగా నిలబడదాం అనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదటి సినిమానే మంచి కథతో మీ ముందుకు వస్తున్నా, అందరూ మా సినిమాను సపోర్ట్ చేయండి’ అని కోరారు. -
వైఎస్ జగన్ సీఎం కావాలని..
సాక్షి, నల్గొండ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని సతీష్ అనే యువకుడు హైదరాబాద్ నుంచి విజయవాడ కనక దుర్గమ్మ గుడికి పాదయాత్రగా బయలుదేరారు. వైఎస్ జగన్ నివాసమైన లోటస్‌పాండ్ నుంచి మంగళవారం పాదయాత్రగా బయలుదేరి నార్కెట్ పల్లికి చేరుకున్నారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్న సతీష్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు ఉపయోగపడుతున్నాయని సతీష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేయడం లేదని, ఎక్కడ చూసినా అవినీతి ఎక్కువైపోయిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, పేదలకు పెన్షన్లు, ఇళ్లు వస్తాయని, అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. -
కరడుగట్టిన దొంగ కర్రి సతీష్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: జైల్లో కలుసుకున్న ముగ్గురు సభ్యుల దొంగల ముఠా ఏడు నేరాలు చేసింది. కరుడు గట్టిన దొంగ కర్రి సతీష్ ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల్లోని ఖరీదైన ప్రాంతాలను టార్గెట్‌గా చేసింది. ఈ ఏడు దొంగతనాల్లో రూ.1.05 కోట్ల సొత్తును ఎత్తుకుపోయింది. ఇంట్లోకి ప్రవేశించి కేవలం ప్లాటినం, బంగారు, వజ్రాలు పొదిగిన అత్యంత ఖరీదైన ఆభరణాలు మాత్రమే ఎత్తుకుపోవడం వీరి నైజం. మూడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఈ గ్యాంగ్‌ను హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వీరి నుంచి ప్లాటినం, బంగారంతో చేసిన నగలతో పాటు వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు, చెన్నై, నెల్లూరు పోలీసులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. సెల్‌ఫోన్‌తో చోరీలు మొదలెట్టి.. విశాఖపట్నంలోని కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్ అలియాస్ సత్తిబాబు కారు డ్రైవర్. 2005లో తొలిసారి ఓ ఇంట్లో వాహనం చోరీ చేసి అక్కడి పోలీసులకు చిక్కాడు. ఆపై విశాఖలోనే 17 చోరీలు చేయడంతో పాటు అంతర్రాష్ట్ర దొంగగా మారిపోయాడు. కాకినాడ, విజయనగరం, విజయవాడ, హైదరాబాద్, సూర్యాపేట, బెంగళూరుల్లో మొత్తం 48 చోరీలు చేశాడు. సత్తిబాబు బాధితుల్లో అత్యధికులు ప్రముఖులు, సంపన్నులే. ఇతడిపై హైదరాబాద్ పోలీసులు 2016లో పీడీ యాక్ట్ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు పంపారు. అప్పటికే జైల్లో ఉన్న నల్లగొండ వాసి నున్సావత్ నరేంద్ర నాయక్, కడపకు చెందిన పి.శ్రీనివాస్‌తో ముఠా కట్టాడు. ఆ ఇద్దరూ చిల్లర దొంగలు కావడంతో అలా చేస్తే ఉపయోగం లేదని, ‘థింక్ బిగ్’ అంటూ నూరిపోశాడు. మార్చిలో జైలు నుంచి విడుదలైన ఈ త్రయం వరుసపెట్టి చోరీలు చేసింది. ఈ ఏడాది మార్చిలో శ్రీకాకుళంలో ఓ చోరీ చేశాడు. ఆపై బెంగళూరులోను, చెన్నైలోని మూడు ప్రాంతాల్లో, ఏపీలోని నెల్లూరులో ఒకటి. నగరంలోని బంజారాహిల్స్‌లో మూడు నేరాలు చేశాడు. చెన్నైలోని నుంగంబక్కం పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే డాక్టర్ కౌశిక్ ఇంటి నుంచి రూ.50 లక్షల విలువైన సొత్తు ఎత్తుకుపోయాడు. దొరికినా నిజాలు చెప్పడు తన వెంట ఎప్పుడు స్క్రూడ్రైవర్, కటింగ్ ప్లేయర్ ఉంచుకుని తిరిగే సత్తిబాబు ఈ ఏడు నేరాల్లోనూ ఇంటి గ్రిల్స్ తొలగించో, తాళం పగులగొట్టో లోపలకు ప్రవేశించాడు. నరేంద్ర ఇతడితో పాటు లోపలకు వెళ్తుండగా.. శ్రీనివాస్ బయటుండి పరిస్థితులు గమనిస్తుంటాడు. శ్రీకాకుళం, బెంగళూరు కేసులకు సంబంధించి అక్కడ అధికారులకు దొరికినా.. బయటి కేసుల వివరాలు మాత్రం చెప్పలేదు. జైల్లోంచి బయటకు వచ్చి మళ్లీ మరో ప్రాంతంలో నేరం చేయడం మొదలెట్టాడు. ఈ ముఠా కోసం చెన్నై పోలీసులు 18 టీమ్స్ ఏర్పాటు చేసి గాలించినా ఫలితం దక్కలేదు. వీరి కదలికలపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ నార్త్‌జోన్ టీమ్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం కాపుకాసింది. మంగళవారం చోరీ సొత్తు విక్రయించడానికి ముంబై వెళ్తున్నారని తెలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పట్టుకుంది. విచారణలో తాము మరికొంత సొత్తును కడపకు చెందిన కె.సుధీర్‌కుమార్‌రెడ్డికి విక్రయించినట్లు చెప్పడంతో అతడిని కూడా పట్టుకుని రూ.1.05 కోట్ల విలువైన 1,712 గ్రాముల ప్లాటినం, బంగారం, వజ్రాలు పొదిగిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులు, నాన్–బెయిలబుల్ వారెంట్ల నేపథ్యంలో సత్తిబాబు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. సత్తిబాబు బాధితుల్లోకొందరు ప్రముఖులు ♦ విశాఖపట్నంలో కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు ఇంట్లో ♦ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డాక్టర్ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లో ♦ బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లో చోరీలు చేశారు. అక్కడి సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి యత్నించాడు. ♦ 2016లో ఏప్రిల్ 28న ఫిలింనగర్ సినార్ వ్యాలీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఎస్ శర్మ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ♦ గతేడాది పీడీ యాక్ట్‌లో అరెస్టయిన సత్తిబాబు ఈ ఏడాది సెప్టెంబర్ 14న విడుదలయ్యాడు. ఆ తెల్లవారే ఎమ్మెల్యే కాలనీలోని డాక్టర్ రామారావు ఇంట్లో విలువైన సొత్తును తస్కరించాడు. ♦ ప్రముఖ సినీనటుడు, ఏపీలోని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంట్లో చోరీకి స్కెచ్ వేశాడు. -
పాపులర్ కావాలని హీరో బాలకృష్ణ ఇంట్లో..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12 ఎమ్మెల్యే కాలనీలో జరిగిన నాలుగు దొంగతనాల్లో నిందితుడిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగ కర్రి సతీష్ అలియాస్ సత్తిబాబు, అలియాస్ బుజ్జిని బెంగళూరు సదాశివనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న కర్రి సతీష్ గత నెల ఎమ్మెల్యే కాలనీలో డాక్టర్ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లో చోరీలకు పాల్పడి బెంగళూరుకు ఉడాయించాడు. సీసీ ఫుటేజ్‌లు, దొంగతనాల తీరును బట్టి చోరీలన్నీ కర్రి సతీష్ చేసినవిగానే ధృవీకరించిన బంజారాహిల్స్ క్రైం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. వైజాగ్‌లోని అతడి నివాసంతో పాటు బంధుమిత్రుల ఇళ్లపై నిఘా వేసి ఇటీవల బెంగళూరుకు మకాం మార్చినట్లు గుర్తించారు. నిందితుడి ఆచూకీ తెలుసుకున్న బంజారాహిల్స్ క్రైం ఇన్స్పెక్టర్ కె.రవికుమార్, డిటెక్టివ్ ఎస్ఐ పల్సా నాగరాజుగౌడ్ బెంగళూరుకు వెళ్లి ఈ గజదొంగను పట్టుకునేందుకు సిద్ధమవుతుండగానే అక్కడి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అందింది. ఎమ్మెల్యే కాలనీలో చోరీల అనంతరం సతీష్ నేరుగా బెంగళూరుకు వెళ్లాడు. ఈ నెల 9న బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు, అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి యత్నించాడు. అక్కడ విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కారు తాళం చెవులు దొంగిలించి పార్కింగ్ చేసి ఉన్న కారుతో ఉడాయించాడు. అనంతరం కారు నంబర్ తొలగించి బోగస్ నంబర్ ప్లేట్ తగిలించాడు. ఈ నెల 18న సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఇంట్లో ఆయన సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు. గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్ పెట్రోలింగ్ పోలీసులు అతడిని గుర్తించి లోపలికి వెళ్లి చూడగా ముసుగు ధరించిన దొంగ కనిపించాడు. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు తప్పించుకొని పారిపోతున్న సతీష్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసు విచారణలో గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లలో 12 దొంగ తనాలు చేసినట్లు నిర్ధారణ అయింది. గత నెలలోనే ఎమ్మెల్యే కాలనీలో నాలుగు దొంగతనాలు చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరింత సమాచారం రాబట్టేందుకు బెంగళూరు పోలీసులు గురువారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ‘హిల్స్’ పరిధిలోనే 12 కేసులు నిందితుడు సతీష్‌పై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లలో 12 కేసులు ఉండటం గమనార్హం. 2016లో ఏప్రిల్ 28న ఫిలింనగర్ సినార్ వ్యాలీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఎస్ శర్మ ఇంట్లో కిలో బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న సతీష్‌ను బంజారాహిల్స్ పోలీసులు పట్టుకొని విచారించగా ఈ రెండు పోలీస్స్టేషన్ల పరిధిలో 12 దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించి, 2016, డిసెంబర్ 2న అతడిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. సెప్టెంబర్ 14న సతీష్ జైలు నుంచి విడుదలైన అతను ఆ తెల్లవారే ఎమ్మెల్యే కాలనీలోని డాక్టర్ రామారావు ఇంట్లో రూ.కోటి విలువైన సొత్తును తస్కరించడమేగాక, వరుస దొంగతనాలు చేసి ఇక్కడి నుంచి జారుకున్నాడు. ఎట్టకేలకు బెంగళూరు పోలీసులకు చిక్కడంతో బంజారాహిల్స్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. హీరో బాలకృష్ణ ఇల్లు టార్గెట్ తనకు జూబ్లీహిల్స్‌లో నివసించే సినీ హీరో నంద మూరి బాలకృష్ణ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు సతీష్ బెంగళూ రు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బాల కృష్ణ ఇంట్లో దొంగతనం చేస్తే పాపులర్ అవుతాన ని చెప్పడం గమనార్హం. దీంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. ఒకవేళ బెంగళూరు పోలీసులకు దొరికి ఉండకపోతే వచ్చే నెలలో సతీష్ మళ్లీ జూబ్లీహిల్స్‌పై కన్నేసేవాడని ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకృష్ణ ఇంట్లో చోరీకి యత్నించేవాడని పోలీసులు పేర్కొన్నారు. -
నా సంతకం ఫోర్జరీ చేసాడు: హీరో
సాక్షి, హైదరాబాద్: తన సంతకంతో పాటు క్యాషియర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా నకిలీ రబ్బరు స్టాంప్‌లు తయారు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించిన గౌరీకృష్ణ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘అంతకుమించి’ సినిమా హీరో, నిర్మాత సతీష్ జై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: సినీ హీరోపై నిర్మాత ఫిర్యాదు!) ఇటీవల విడుదలైన ఈ సినిమాకు తానే నిర్మాతనంటూ హీరో సతీష్ జై తనకు రూ.50 లక్షలు ఎగ్గొట్టాడంటూ గౌరీకృష్ణ పోలీసులు, మీడియా, కోర్టును, చిత్ర పరిశ్రమను తప్పుదోవ పట్టించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సినిమాకు గౌరీకృష్ణ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, తానే రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపాడు. తప్పుడు ప్రకటనలతో డిస్ట్రిబ్యూటర్లను తీవ్రంగా నష్టపరిచిన అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుస్టేషన్ ముందే నిప్పంటించుకున్నాడు
హైదరాబాద్: తల్లిదండ్రులు, సోదరుడిపై తన మామ కేసు పెట్టినందుకు కోపంతో ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే పోలీసులు మంటలు ఆర్పి, అతడిని ఆస్పత్రికి తరలించారు. బీహెచ్ఈఎల్ సమీపంలోని బీరంగూడకు చెందిన సతీశ్(24) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది ఏప్రిల్ 7న బంజారాహిల్స్ రోడ్ నెం.5లోని దేవరకొండ బస్తీకి చెందిన శివానితో అతడికి వివాహం జరిగింది. ఇటీవల అత్తమామలకు, శివానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఈనెల 12న సతీశ్ తల్లి సీతాదేవి, తండ్రి మనోజ్‌కుమార్, సోదరుడు సాయికుమార్ దేవరకొండ బస్తీలోని శివాని ఇంటికి వచ్చారు. చెప్పకుండా పుట్టింటికి ఎందుకు వచ్చావంటూ గొడవ పడ్డారు. అక్కడే ఉన్న శివాని తల్లిదండ్రులు షగుప్తా, మనోజ్‌కుమార్‌లపై దుర్భాషలాడారు. దీంతో శివాని తండ్రి ఈ నెల 13న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న సతీశ్.. తీవ్ర ఆగ్రహంతో మామకు ఫోన్ చేసి వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అల్లుడు తనను బెదిరిస్తున్న విషయాన్ని ఆయన పోలీసులకు చెప్పడంతో వారు సతీశ్‌కు ఫోన్ చేశారు. కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పి స్టేషన్‌కు రమ్మన్నారు. మట్టి పోసి మంటలు ఆర్పిన పోలీసులు... బుధవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన సతీశ్.. మరోసారి మామకు ఫోన్ చేశాడు. కేసు వెనక్కి తీసుకోకుంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఆయన సరిగా స్పందించకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకున్నాడు. మామను దుర్భాషలాడుతూ అగ్గిపుల్ల గీసి అంటించుకున్నాడు. ఒక్కసారిగా ఎగసిపడిన మంటల్లో చిక్కుకుని అటూ ఇటూ పరుగులు పెడుతున్న సతీశ్‌ను.. అక్కడే ఉన్న పోలీసులు కాపాడారు. అతడి మీద మట్టి పోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి డీఆర్డీఏ అపోలోకు తరలించారు. ప్రస్తుతం సతీశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. -
ఆన్ స్క్రీన్.. ఆన్ సెట్స్
ఏడాది తిరగక ముందే తమిళ హీరో శివకార్తీకేయన్‌తో హీరోయిన్ నయనతార మళ్లీ జోడీ కట్టారు. గతేడాది ‘వేలైక్కారన్’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజేష్ దర్వకత్వంలో ఈ జంట నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. రాధిక, సతీష్, యోగిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా మొదలైన 25 రోజుల తర్వాత సెట్లో జాయిన్ అయ్యారు నయనతార. యాక్షన్ ఎలిమెంట్స్‌తో కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ రేపు స్క్రీన్‌కి రానుంది. అలాగే శివ కార్తీకేయన్ నెక్ట్స్ రిలీజ్ ‘సీమరాజా’. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. -
లవ్లీ టీమ్‌తో...
సౌత్ లాంగ్వేజెస్‌లోనే కాదు హిందీ భాషలోనూ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు అలనాటి కథానాయిక రాధిక. 1980లలో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. రీసెంట్గా తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో తల్లి పాత్రలో కనిపించారామె. ఇప్పుడు శివకార్తీకేయన్ హీరోగా రాజేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ తమిళ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు రాధిక. ‘లవ్లీ టీమ్‌తో జాయిన్ అయ్యాను’ అని ఆమె షూటింగ్ స్పాట్ ఫొటోను షేర్ చేశారు. నయతనార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో హాస్యనటులు యోగిబాబు, సతీష్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. -
కొత్త చిత్రం షురూ
తెలుగు, తమిళ భాషల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు సిద్ధార్థ్. గతేడాది థ్రిల్లర్ మూవీ ‘గృహం’తో ప్రేక్షకులను భయపెట్టి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా సాయిశేఖర్ దర్శకత్వంలో సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. ఇందులో కేథరిన్ కథానాయికగా నటిస్తున్నారు. నటుడు సతీశ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆర్. రవీంద్రన్ నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కూడా హారర్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ చాలా కొత్తగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. -
ముగ్గురి ఉసురు తీసిన క్షణికావేశం
త్రిపురాంతకం: క్షణికావేశం ముగ్గురి నిండు ప్రాణాలు గాలిలో కలిపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తొలుత తన కుమార్తె, కుమారుడికి ఉరేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని మేడపిలో బుధవారం జరిగింది. ఈ సంఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన గుమ్మా రజని (26)ని గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం మక్కెళ్లపాడుకు చెందిన గుమ్మా అంజికి ఇచ్చి వివాహం చేశారు. భర్త అంజి వ్యవసాయం పనులు చేస్తుండేవాడు. ఆమెకు కుమార్తె మౌనిక (5), కుమారుడు సతీష్ (3) ఉన్నారు. కుటుంబం కలహాల నేపథ్యంలో రజని మేడపిలోని పుట్టింట్లో 20 రోజులుగా ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు రామతీర్థం వద్ద కూలి పనులకు వెళ్లారు. ఇంటి వద్ద రజని నాయనమ్మ, తాత మాత్రమే ఉన్నారు. చీకటి పడే సమయంలో తొలుత కుమార్తెకు, కుమారుడిని ఫ్యాన్ కొక్కీకి ఉరేసి చంపి ఆ తర్వాత తల్లి రజని కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు నిర్జీవంగా వేలాడుతుండటాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించడంతో పొద్దుపోయిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. ఒకేసారి తల్లి, పిల్లల ఆత్మహత్యతో బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ కమలాకర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
పది నిమిషాల్లో వైశాలి ఇక్కడుండాలి: బీజేపీ ఎంపీ
అలీగఢ్ : పదే పది నిమిషాల్లో వైశాలి స్టేషన్లో ఉండాలి అంటూ అలీగఢ్ ఎంపీ సతీష్ గౌతమ్ రైల్వే అధికారులపై చిందులు తొక్కారు. వైశాలి ఎక్స్‌ప్రెస్‌లో బీజేపీ రీజనల్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్నారని, దాంట్లో ఆయన ఇక్కడికి వస్తున్నారని పది నిమిషాల్లో వైశాలి ఎక్స్‌ప్రెస్ ఇక్కడ ఉండాలంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. రాజధాని రైలు తర్వాత వైశాలి ఎక్స్‌ప్రెస్ వస్తుందని రైల్వే అధికారు చెప్పిన దాన్ని ఆపేసి వైశాలిని వచ్చేటట్లు చేయాలని ఆదేశించారు. ఇంతకు ముందు ఎంపీ సతీష్ గౌతమ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మహమ్మద్ అలీ జిన్నా చిత్రపటాన్ని తొలగించాలని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే. -
రైల్వే అధికారులపై చిందులు తొక్కిన బీజేపీ ఎంపీ