
అలీగఢ్ : పదే పది నిమిషాల్లో వైశాలి స్టేషన్లో ఉండాలి అంటూ అలీగఢ్ ఎంపీ సతీష్ గౌతమ్ రైల్వే అధికారులపై చిందులు తొక్కారు. వైశాలి ఎక్స్‌ప్రెస్‌లో బీజేపీ రీజనల్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్నారని, దాంట్లో ఆయన ఇక్కడికి వస్తున్నారని పది నిమిషాల్లో వైశాలి ఎక్స్‌ప్రెస్ ఇక్కడ ఉండాలంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. రాజధాని రైలు తర్వాత వైశాలి ఎక్స్‌ప్రెస్ వస్తుందని రైల్వే అధికారు చెప్పిన దాన్ని ఆపేసి వైశాలిని వచ్చేటట్లు చేయాలని ఆదేశించారు. ఇంతకు ముందు ఎంపీ సతీష్ గౌతమ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మహమ్మద్ అలీ జిన్నా చిత్రపటాన్ని తొలగించాలని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment