Anupam Kher Gets Emotional As His Best Friend Satish Kaushik Last Rites - Sakshi
Sakshi News home page

Anupam Kher Crying Video: స్నేహితుని మరణంతో బోరున విలపించిన అనుపమ్ ఖేర్

Mar 10 2023 6:10 PM | Updated on Mar 10 2023 7:07 PM

Anupam Kher gets emotional his best friend Satish Kaushik last rites - Sakshi

బాలీవుడ్‌లో దర్శకనటుడు సతీష్‌ కౌశిక్‌(67) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన మిత్రుడు, మరో సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. సతీశ్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో సతీశ్ పార్థివదేహం వద్ద అనుపమ్ ఖేర్ బోరున విలపించారు. స్నేహితుని మరణాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. 

సతీశ్ మృతిపట్ల అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ..' మేమిద్దరం మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లం. సొంతంగా పేరు తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాం. ముంబై నగరం మాకు అవకాశం ఇచ్చింది. దాన్ని సాధించాం. కానీ ఇది జీర్ణించుకోవటం చాలా కష్టం. అతను చాలా చమత్కారి.  ప్రతి విషయాన్ని తేలికగా అర్థం చేసుకునేవాడు.  ఎలా జీవించాలనేది ప్రజలు అతని నుంచి నేర్చుకుంటారు. మమ్మల్ని అకాలంగా విడిచి వెళ్లాడనే పశ్చాత్తాపం నాకు ఎప్పటికీ ఉంటుంది.' అంటూ ఎమోషనలయ్యారు. అదేవిధంగా సతీశ్ కౌశిక్‌తో తనకు 45 నుంచి అనుబంధమని అనుపమ్ ఖేర్ తెలిపారు.

కాగా.. 13 ఏప్రిల్‌ 1956లో హర్యానాలో పుట్టి, పెరిగిన సతీష్‌ కౌశిక్‌.. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే అనుపమ్‌ ఖేర్‌తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. 1983లో వచ్చిన జానే భీ దో యారోన్‌ చిత్రానికి ఆయన సంభాషణలు అందించారు.. కమెడియన్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, దర్శకనిర్మాతగానూ ఆయన బాలీవుడ్‌లో రాణించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement