సామాన్యుడు నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా సరే డబ్బుంటే ఇల్లు లేదా నగలు కొనుక్కోవాలని చూస్తాడు. ఎందుకంటే భవిష్యత్తు కోసం భరోసా అని చెబుతాడు. కానీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రం అసలు సొంతిల్లు ఎందుకు కొనుక్కోవాలి అని వింత లాజిక్ చెబుతున్నాడు. కావాలంటే అద్దె ఇంట్లోనే ఉంటానని ఖరాఖండీగా చెబుతున్నాడు.
ఖేర్ ఏమన్నాడంటే?
'సొంతంగా ఇల్లు కొనకూడదని ఫిక్సయ్యా. అందుకే ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. అయినా ఎవరి కోసం ఇల్లు కొనాలి? ఆ ఇంటికి ఖర్చు పెట్టే డబ్బుని ప్రతినెలా బ్యాంకులో దాచుకుని, కొంత డబ్బుతో ప్రతినెలా అద్దెకడితే సరిపోతుందిగా! భవిష్యత్తులో ఆస్తుల పంపకంలో పిల్లల మధ్య గొడవలు రావొచ్చు. అందుకే ఆస్తులు కొనే డబ్బుని దాచిపెట్టి, దానినే సమంగా పంచితే సరిపోతుంది. అప్పుడు ఏం ఇబ్బంది ఉండదు'
(ఇదీ చదవండి: కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)
'మంచి సినిమాలు చేస్తున్న టైంలో తనకోసం ఓ ఇల్లు కొనివ్వమని అమ్మ కోరింది. దీంతో ఓ హౌస్ కొనిచ్చాను. నాన్న ఉన్నప్పుడు మేం అక్కడే ఉండేవాళ్లం. ఆ చనిపోయిన తర్వాత సిమ్లాలో ఉన్నది తక్కువే. అందుకే ఆమె అక్కడ ఇల్లు కావాలని కోరింది. సింగిల్ బెడ్రూమ్ చాలాని చెప్పింది గానీ 8 బెడ్రూమ్స్ ఉన్న ఇంటిని బహుమతిగా ఇచ్చాను. నా భార్యకు ఇలా ఎందుకు ఇచ్చానో చాలారోజుల తర్వాత అర్థమైంది' అని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చాడు.
హిందీ సినిమాల్లో సహాయ పాత్రలు, లీడ్ రోల్స్.. ఇలా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అనుపమ్ ఖేర్.. తెలుగు నుంచి వచ్చిన కార్తికేయ 2, టైగర్ నాగేశ్వరరావు లాంటి పాన్ ఇండియా మూవీస్‌లోనూ కనిపించారు. అయితే అనుపమ్ చెప్పిన లాజిక్ ఆయన లాంటి స్టార్ యాక్టర్స్‌కి వర్కౌట్ కావొచ్చేమో గానీ సామాన్యులకు అవుతుందా అనేది పెద్ద ప్రశ్న.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment