
సెయిలర్ దొడ్డి సతీష్
గాజువాక : హైజాకర్లు నౌకను విడిచిపెట్టారన్న సమాచారంతో కూర్మన్నపాలేనికి చెందిన ఉక్కు ఉద్యోగి దొడ్డి కృష్ణాజీ ఇల్లు అవధుల్లేని ఆనందోత్సాహాలతో నిండిపోయింది. నౌకలో తమ కుమారుడు కూడా ఉండడంతో ఇన్నాళ్లు ఉత్కంఠకు గురైన ఆ కుటుంబం ఉద్వేగానికి గురైంది. తాజా వార్తతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. బంధువులు ఆ కుటుంబాన్ని పరామర్శలతో ముంచెత్తారు. ‘సాక్షి’తో కృష్ణాజీ మాట్లాడారు.
కృష్ణాజీ రెండో కుమారుడు సతీష్ 2009 నుంచి సెయిలర్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తు తం ఆయన థర్డ్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయనకు 2014లో పెళ్లవగా, భార్య, ఏడాదిన్నర బాబు ఉన్నారు. గతేడాది నవంబర్ 1న నౌకలో విధులకు వెళ్లా డు. డిసెంబర్ 31, జనవరి 1న ఈ–మెయిల్‌ద్వారా సంభాషించాడు. సౌత్ ఆఫ్రికాలోని బెనిన్ తీరం నుంచి బయల్దేరుతున్నానని చెప్పిన అతడి నుంచి ఆ తరువాత మరెలాం టి సమాచారం రాలేదు.
22మంది సిబ్బందితో ఉన్న ఎమ్‌టీ మెరైన్ ఎక్స్‌ప్రెస్ అనే నౌకను ఈనెల 1న హైజాకర్లు అపహరించుకుపోయారు. అందు లో సతీష్ కూడా ఉన్నాడు. దీంతో ఆ కుటుం బం విలవిల్లాడింది. ఐదు రోజులపాటు ఆందోళన చెందారు. ఆఖరికి మంగళవారం ఉదయం హైజాకర్లు నౌకను విడుదల చేశారన్న సమాచారంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. తమ కుమారుడు ఇంటికెప్పుడొస్తాడోనని ఆశగా ఎదురుచూస్తోంది. కాగా, తమకు విశాఖ ఎంపీ చాలా సహాయం చేశారని కృష్ణా జీ చెప్పారు. ‘విషయం తెలి సిన వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఎంపీని కలిశాం, ఆయ న వెంటనే విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారు. మొత్తం ప్రా సెస్ ఆయనే చేశారు. ఆయకు మేం జీవితాంతం రుణపడి ఉంటా’మని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment