ఎంఆర్ రాధ మనవడు మృతి | Watery grave for M R Radha's grandson | Sakshi
Sakshi News home page

ఎంఆర్ రాధ మనవడు మృతి

Published Sun, May 10 2015 3:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

ఎంఆర్ రాధ మనవడు మృతి

ఎంఆర్ రాధ మనవడు మృతి

దివంగత ప్రఖ్యాత నటుడు ఎం ఆర్ రాధ మనవడు, నటుడు ఎం ఆర్ ఆర్ వాసు కొడుకు సతీష్ (44) శుక్రవారం రాత్రి మృతి చెందారు.

తమిళసినిమా: దివంగత ప్రఖ్యాత నటుడు ఎం ఆర్ రాధ మనవడు, నటుడు ఎం ఆర్ ఆర్ వాసు కొడుకు సతీష్ (44) శుక్రవారం రాత్రి మృతి చెందారు. సతీష్ రంగస్థల నటుడు. ఎం ఆర్ రాదకు నటుడిగా ఖ్యాతిని ఆర్జించి పెట్టిన రక్తకన్నీర్ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మించడానికి సతీష్ సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక దక్షిణ మాంబలం గోల్డెన్ కాలనీలో నివసిస్తున్న సతీష్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మిత్రులు శరవణన్ , బాబులతో కలసి తాను నిర్మించనున్న చిత్రానికి లొకేషన్స్ చూడడానికి వెళ్లారు. కుండ్రత్తూరు సమీపంలోని పూందండలం, కృష్ణనగర్‌లో గల బంగ్లాను తిలకించడానికి వెళ్లారు.
 
  అక్కడే ఆరుగంటల ప్రాంతంలో స్విమ్మింగ్‌పూల్‌లో చాలా సేపు గడిపారు. కాగా అనూహ్యంగా ఆయనకు శ్వాస కోశ సమస్య ఊపిరాడక నీళ్లల్లో మునిగిపోయారు. వెంటనే అక్కడే ఉన్న మిత్రులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం మాంగాడులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సతీష్‌ను బతికించడానికి శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందారు. కుండ్రత్తూరు పోలీసులు కేసువిచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement