శృంగార తార సన్నిలియోన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ఓ మై ఘోస్ట్. వీఏయూ మీడియా అధినేత వీరశక్తి, వైట్‌హార్స్ స్టూడియోస్ అధినేత ఆల్.శశికుమార్ కలిసి నిర్మించిన చిత్రం ఇది. యువన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు సతీష్, దర్శగుప్తా, యోగిబాబు, మొటై రాజేంద్రన్, జీపీ ముత్తు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.
ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం చెన్నైలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసంది. సన్నిలియోన్ మాట్లాడుతూ ఓ మై ఘోస్ట్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తనను క్వీన్‌గా మార్చిన యూనిట్ సభ్యులకు, తన టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. చిత్రం లవ్, యాక్షన్, కామెడీ, గ్లామర్ తదితర అంశాలతో ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు. దక్షిణాది చిత్రాల్లో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు.
ఇక్కడి ప్రజల్లో ప్రేమాభిమానాలు ఎక్కువ అన్నారు. ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు యువన్ సహకరించడంతో తమిళ భాష సమస్య అనిపించలేదన్నారు. చిత్ర దర్శకుడు యువన్ మాట్లాడుతూ.. ఈ కథను తయారు చేస్తున్నప్పుడు సన్నిలియోన్ పాత్రను బ్రాకెట్‌లో పెట్టినట్లు తెలిపారు. ఆ పాత్రకు సన్నిలియోన్ లాంటి నటి అయితే బాగుంటుందని నిర్మాతతో చెప్పగా అలాంటి నటి ఎందుకు ఆమెనే నటించమని అడుగుదాం అన్నారని, దీంతో ఆమెను కలిసి కథ చెప్పగానే బాగుంది చేద్దామని చెప్పారన్నారు. ఆ తరువాత ఆమె ఎంతగానో సహకరించారని తెలిపారు. చిత్రం బాగా వచ్చిందని, ప్రేక్షకులు కొన్న టికెట్‌కు కచ్చితంగా తగిన వినోదాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment