సిద్ధార్థ్
తెలుగు, తమిళ భాషల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు సిద్ధార్థ్. గతేడాది థ్రిల్లర్ మూవీ ‘గృహం’తో ప్రేక్షకులను భయపెట్టి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా సాయిశేఖర్ దర్శకత్వంలో సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. ఇందులో కేథరిన్ కథానాయికగా నటిస్తున్నారు. నటుడు సతీశ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆర్. రవీంద్రన్ నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కూడా హారర్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ చాలా కొత్తగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment