అంతకుమించి సినిమా హీరో సతీష్ జై
సాక్షి, హైదరాబాద్: తన సంతకంతో పాటు క్యాషియర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా నకిలీ రబ్బరు స్టాంప్‌లు తయారు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించిన గౌరీకృష్ణ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘అంతకుమించి’ సినిమా హీరో, నిర్మాత సతీష్ జై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: సినీ హీరోపై నిర్మాత ఫిర్యాదు!)
ఇటీవల విడుదలైన ఈ సినిమాకు తానే నిర్మాతనంటూ హీరో సతీష్ జై తనకు రూ.50 లక్షలు ఎగ్గొట్టాడంటూ గౌరీకృష్ణ పోలీసులు, మీడియా, కోర్టును, చిత్ర పరిశ్రమను తప్పుదోవ పట్టించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సినిమాకు గౌరీకృష్ణ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, తానే రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపాడు. తప్పుడు ప్రకటనలతో డిస్ట్రిబ్యూటర్లను తీవ్రంగా నష్టపరిచిన అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment