
తూర్పుగోదావరి, కడియం : అంతకుమించి.. సినిమా ఘన విజయం సాధిస్తుందని, వచ్చేనెలలో విడుదలకు సిద్ధమైందని హీరో సతీష్ జై తెలిపారు. సంక్రాంతి వేడుకలకు స్వగ్రామమైన కడియం మండలం దామిరెడ్డిపల్లికి విచ్చేసిన సతీష్, ఆదివారం పల్ల వెంకన్న నర్సరీలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. రేష్మి కథానాయికగా ఈ చిత్రంలో నటిస్తోందని, రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కిందని వివరించారు. జానీ దర్శకత్వంలో సునీల్‌కృష్ణ అద్భుతమైన సంగీతాన్నందించారన్నారు.
బాలారెడ్డి కెమెరామెన్‌గా ఉన్న ఈ సినిమాలో సూర్య, మధునందన్, అజయ్‌ఘోష్, రవిప్రకాష్ ఇతర తారాగణమన్నారు. గతంలో చార్మి హీరోయిన్‌గా విడుదలైన రొమాన్స్ విత్ ఫైనాన్స్ సినిమాలో కూడా సతీష్ హీరోగా నటించారు. బాల్యస్నేహితులు, బంధువుల మధ్య పచ్చని వాతావరణంలో ఈ సంక్రాంతి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. సమావేశంలో ఐఎన్‌ఏ అధ్యక్షులు పల్ల సుబ్రహ్మణ్యం, నర్సరీ రైతులు సత్తిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment