
యాంకర్ రష్మీ గౌతమ్ (Anchor Rashmi Gautam), దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) ప్రేమలో పడ్డారు. రష్మీ అయితే ఓ అడుగు ముందుకేసి తనతో కలిసి డ్యుయెట్ కూడా పాడేసింది. కాకపోతే అది కలలో! ఇదంతా రీల్ లైఫ్‌లో జరిగింది. వీరిద్దరి ప్రేమకహానీకి సంబంధించిన సన్నివేశం క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రష్మీ గౌతమ్ యాంకర్ అవడానికి ముందు సీరియల్స్ చేసింది. యువ సీరియల్ (Yuva Serial)లో ప్రధాన పాత్రలో నటించింది. ఇదే ధారావాహికలో రాజమౌళి కూడా అతిథి పాత్ర చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన క్లిప్‌ను నెట్టింట వదిలారు.
రాజమౌళితో డ్యుయెట్
అందులో ఏముందంటే.. రష్మీ తన స్నేహితురాలితో కలిసి ఓ కెఫెలో కూర్చుంది. ఇంతలో రాజమౌళి అక్కడకు వస్తాడు. అది చూసిన రష్మీ ఫ్రెండ్.. ఇన్నిరోజులు నీకు ఫోన్ చేస్తోంది రాజమౌళియా? అని అడుగుతుంది. అటు రష్మీ మాత్రం తనతో ఇన్నాళ్లూ కబుర్లాడింది రాజమౌళి అని తెలిసేసరికి గాల్లో తేలుతుంది. జింతాత జితా జితా పాటకు తనతో కలిసి స్టెప్పులేస్తున్నట్లు కలగంటుంది. వెంటనే తేరుకుని తన ఫ్రెండ్‌ను అక్కడినుంచి పంపించేస్తుంది.

(చదవండి: సింపుల్‌గా ఈ టిప్స్ పాటించి బరువు తగ్గాను: హన్సిక)
అంకుల్ అయ్యుంటే..
ఇంతలో జక్కన్న.. రష్మీ దగ్గరకు వస్తాడు. ఆమె సంతోషంతో.. నేనిదంతా నమ్మలేకపోతున్నాను. ఇన్నిరోజులు నాతో మాట్లాడుతుంది మీరా? అని అడుగుతుంది. అందుకు జక్కన్న రోజులు కాదు గంటలు.. అరగంటకోసారైనా మాట్లాడాలిగా అని డైలాగ్ వదులుతాడు. నేను అంకుల్ అయ్యుంటే ఏం చేసేవాడివని ప్రశ్నించగా పర్లేదు, నేను ఆంటీనయ్యేదాన్ని అని రష్మీ రిప్లై ఇచ్చింది. త్వరగా వెళ్లిపోవాలని రాజమౌళి అంటే అప్పుడే వెళ్లాలా అని అతడి చేయి నిమురుతుంది.
రాజమౌళికి ప్రపోజ్ చేసిన రష్మీ
ఏంటో చెప్పమని ఆరా తీస్తే రష్మి కనురెప్పలు టపాటపా కొడుతుంది. అది అర్థం చేసుకోలేని రాజమౌళి కళ్లు మండుతున్నాయా? అని అడుగుతాడు. దీంతో హీరోయిన్ కోపంతో ఊగిపోతూ షటప్.. దానర్థం ఐ లవ్యూ... నీక్కూడా తెలీదా? అని అరిచేస్తుంది. ఇది చూసిన జనాలు ఇదెప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి కళాకారుడే.. రష్మిది చిన్న వయసు కాదన్నమాట.. ఇదెక్కడి కాంబినేషన్‌రా మావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కింగ్ నాగార్జున.. 2007లో యువ సీరియల్ నిర్మించారు. ఇందులో రష్మీ ప్రధాన పాత్రలో నటించింది.
Whatttt!!! Rajamouli and rashmi ideppudu jarigindi 😭 pic.twitter.com/nHM2LwyuCI
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 18, 2025
చదవండి: ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్ సిరీస్.. వెలుగులోకి భారీ స్కామ్
Comments
Please login to add a commentAdd a comment