
యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండె బరువెక్కిందంటూ రష్మి సోషల్ మీడియా వేదికగా ఈ చేదు వార్తను పంచుకుంది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. తన గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా శుక్రవారం కన్నుమూసినట్లు రష్మి తన పోస్ట్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా తన గ్రాండ్ మదర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘ఈ రోజు మా గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా కన్నుమూశారు. బరువెక్కిన గుండెతో కుటుంబ సభ్యులమంత ఆమెకు చివరి సారిగా విడ్కోలు పలికాం. ఆమె ఎంతో స్ట్రాంగ్ ఉమెన్. మాపై తన ప్రభావం ఎంతో ఉంది. ఆమె దూరమైనా.. తన జ్ఞాపకాలు ఎల్లప్పుడు మాతోనే ఉంటాయి. ఓం శాంతి’ అంటూ రష్మీ రాసుకొచ్చింది. కాగా రష్మీ బుల్లితెరపై యాంకర్ సందడి చేస్తూనే వెండితెరపై నటిగా రాణిస్తోంది. ప్రస్తుతం పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. అలాగే వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా ఆమె బొమ్మ బ్లాక్‌బస్టర్ మూవీతో వెండితెరపై సందడి చేసింది.
చదవండి:
‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు
నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్‌ను తీసుకున్నారు: రకుల్
Comments
Please login to add a commentAdd a comment