బిగ్‌బాస్ షోను అభిమానించేవాళ్లు, ఆరాధించేవాళ్లతోపాటు అసహ్యించుకునేవాళ్లు కూడా ఉన్నారు. అంతే కాదు, అసహ్యించుకుంటూనే షోను చూసి ఎంజాయ్ చేసేవాళ్లు కూడా ఉన్నారు.. అది వేరే విషయం. ఇకపోతే షో మొదలు కావడానికి కొన్ని నెలల ముందు నుంచే ఫలానావారు పార్టిసిపేట్ చేయనున్నారంటూ పలువురి పేర్లు బయటకు వస్తుంటాయి. అలా ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు వినిపించే అతి కొద్ది మంది పేర్లలో యాంకర్ రష్మీ కూడా ఉంటుంది. ప్రతి సారి బిగ్‌బాస్ షోలో యాంకర్ రష్మీ ఉండబోతుందట అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది.
తీరా చూస్తే ఆమె షోలో ఉండదు. తాజాగా బిగ్‌బాస్ 7వ సీజన్‌లో రష్మీ భాగమైందంటూ ప్రచారం ఊపందుకుంది. దీనిపై యాంకర్ స్పందిస్తూ అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో క్లారిటీ ఇచ్చేసింది. కాగా గతంలోనూ ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు రష్మీ స్పందిస్తూ ప్రతి సీజన్‌కు తనను పిలుస్తారని, కానీ ఇతర టీవీ షోలు ఉన్నందున బిగ్‌బాస్‌కు వెళ్లలేను అని చెప్పింది. కుటుంబం, స్నేహితులు, పెంపుడు కుక్కను విడిచి ఉండలేనని, అయినా ఆ షోకి సరిపోయే వ్యక్తిని తాను కాదని పేర్కొంది.
చదవండి: నాతో మజాక్‌లొద్దు: వెంకీ మామ వార్నింగ్
చులకనగా చూశారు, వారం రోజులు తిండి పెట్టలేదు: జగ్గూ భాయ్
Comments
Please login to add a commentAdd a comment