
భారత బాక్సింగ్ జట్టు కోచ్‌గా దుర్గాప్రసాద్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన జి. దుర్గాప్రసాద్ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు ఆయన కోచ్‌గా ఎంపికయ్యారు. దక్షిణ మధ్య రైల్వేలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌లో ఈనెల 23 వరకు జరిగే సిమోన్ ట్రెస్టిన్ స్మారక బాక్సింగ్ టోర్నీలో ఐదుగురు సభ్యులతో కూడిన భారత జట్టు పాల్గొంటుంది.
నీరజ్, లాల్ దిన్ మావియా, థామస్ మేతీ, ఆశిష్ కుమార్, రేయాల్ పూరీ ఈ టోర్నీలో తలపడనున్నారు.