Boxing coach
-
ఒలింపిక్స్ విలేజ్‌లో తీవ్ర విషాదం.. ఆ దేశ బాక్సింగ్ కోచ్ మృతి
ప్యారిస్ ఒలింపిక్స్ విలేజ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమోవా బాక్సింగ్ కోచ్ లియోనల్ ఎలికా ఫతుపైటో(60)గుండెపోటుతో మరణించాడు. శుక్రవారం జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల అనంతరం లియోనల్ ఎలికా తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. అనంతరం ఆస్పత్రికి తరిలించి చికిత్స అందించినప్పటకి ఎలికా కన్నుమూశాడు. విషయాన్ని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) శనివారం ధ్రువీకరించింది. అతడి మృతి పట్ల ఐబీఏ సంతాపం వ్యక్తం చేసింది."లియోనెల్ ఎలికా ఫతుపైటో మృతి మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాము. లియోనెల్ ఓపెనింగ్ సెర్మనీ తర్వాత తీవ్ర ఆస్వస్థత గురయ్యాడు. వైద్యులు ఆత్యవసర చికిత్స అందించినప్పటకి ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. అతడిది సహజ మరణమే. ఈ విషయాన్ని స్ధానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం సైతం ధ్రువీకరించింది. లియోనెల్ తన పట్టుదల, అంకిత భావంతో ఎంతో మంది బాక్సర్లకు ఆదర్శంగా నిలిచాడు" అని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా బాక్సింగ్‌లో సమోవా నుంచి ఏకైక బాక్సర్ అటో ప్లోడ్జికి-ఫావో గాలీ హెవీ వెయిట్ కేటగిరీలో పోటీ పడుతున్నాడు. -
భారత బాక్సింగ్ జట్టు కోచ్‌గా దుర్గాప్రసాద్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన జి. దుర్గాప్రసాద్ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు ఆయన కోచ్‌గా ఎంపికయ్యారు. దక్షిణ మధ్య రైల్వేలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌లో ఈనెల 23 వరకు జరిగే సిమోన్ ట్రెస్టిన్ స్మారక బాక్సింగ్ టోర్నీలో ఐదుగురు సభ్యులతో కూడిన భారత జట్టు పాల్గొంటుంది. నీరజ్, లాల్ దిన్ మావియా, థామస్ మేతీ, ఆశిష్ కుమార్, రేయాల్ పూరీ ఈ టోర్నీలో తలపడనున్నారు. -
బాక్సింగ్ శిక్షణకు మేటి
చదువు అంతంత మాత్రమే... పేదరికం అతన్ని చదువుల తల్లికి దూరం చేసింది. అదే సమయంలో జీవితంలో నిలదొక్కుకునేందుకు పడిన తపన... యుద్ధ క్రీడల్లో నిష్ణాతుడిగా మార్చింది. కరాటేతో మొదలైన ప్రస్థానం వివిధ క్రీడలతో కొనసాగుతూ... బాక్సింగ్ వరకు చేరుకుంది. తన అనుభవాలను పది మందికి పంచుతూ వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శ్రమిస్తున్నాడు. ఈ సుధీర్ఘ ప్రస్థానంలో ఎదురైన ఆటుపోట్లకు వెరవకుండా జిల్లాలో బాక్సింగ్ క్రీడాభివద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. పాలకులు, అధికారులు గుర్తించని అభివన ద్రోణాచార్యుడిగా మిగిలిన అతనే మహేష్ కుమార్ ఉరఫ్ మహేష్. బాక్సింగ్‌లాంటి యుద్ధ కళను అభ్యసించడం సామాన్యులకు అందని ద్రాక్షే. ఖర్చుతో కూడుకున్న ఈ క్రీడను అభ్యసించేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అంతేకాక ప్రత్యర్థి ముష్టిఘాతాలను తట్టుకోలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుండడంతో బాక్సింగ్ క్రీడ అంటే చాలా మంది భయపడుతుంటారు. ఇలాంటి తరుణంలో సాధారణ యుద్ధ విద్యలకంటే వ్యక్తిగత ఆత్మరక్షణకు బాక్సింగ్ చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని మహేష్ గుర్తించాడు. అప్పటి వరకు కరాటేకే పరిమితమైన అతను బాక్సింగ్ నేర్చుకునేందుకు ఈ క్రీడలో ద్రోణాచార్య అవార్డు పొందిన విశాఖపట్నంలోని వెంకటేశ్వరరావు వద్దకు చేరుకున్నాడు. అక్కడే ఈ క్రీడను అభ్యసించాడు. ఉచిత శిక్షణతో.. విశాఖ పట్నం నుంచి తిరిగి వచ్చిన మహేష్... 2009 నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులకు బాక్సింగ్ నేర్పిస్తూ వచ్చాడు. బాక్సింగ్ పట్ల చాలామందిలో ఉన్న అపోహలను తొలగిస్తూ క్రీడాభివద్ధికి కషి చేస్తూ వచ్చాడు. ప్రధానంగా బాలికల ఆత్మరక్షణలో బాక్సింగ్ ఎంత బాగా ఉపయోపడుతుందో తెలుసుకున్న చాలా మంది అమ్మాయిలు ప్రత్యేకంగా మహేష్ వద్ద శిక్షణ పొందుతున్నారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అతను ఉచితంగానే ఈ క్రీడను నేర్పిస్తూ వస్తున్నారు. చదువు లేకపోవడం... ఆర్థికంగా ఉన్నత స్థానంలో లేకపోవడంతో జిల్లా స్థాయి అధికారుల దష్టిని మహేష్ ఆకర్షించలేకపోతున్నాడు. అయితే అతని కషిని గుర్తిస్తూ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శిగా గుర్తింపును రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ ఇచ్చింది. వందకు పైగా పతకాలు జిల్లాలో బాక్సింగ్ క్రీడ నేర్పించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వందకు పైగా పతకాలను మహేష్ శిష్యులు సాధించారు. పైకా, ఏపీ స్కూల్ గేమ్స్‌తో పాటు అసోసియేషన్ క్రీడా పోటీలకు సైతం జిల్లా నుంచి చాలా మంది క్రీడాకారులు వెళ్తున్నారు. 2011లో జిల్లాలో బాక్సింగ్ క్రీడాభివద్ధి కోసం అప్పటి డీఎస్డీవో లక్ష్మినారాయణరెడ్డి కిట్లను సమకూర్చారు. 2015లో ఆర్డీటీ సహకారంతో రాస్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఛాపింయన్ షిప్ పోటీలను నిర్వహించారు. అదే ఏడాది జిల్లా క్రీడాకారులకు బాక్సింగ్ కిట్లను ఆర్డీటీ సంస్థ అందజేసి ప్రోత్సహించింది. ప్రభుత్వ ప్రోత్సహం ఉంటే ఈ క్రీడను మరింత అభివద్ధి చేస్తామంటూ ఈ సందర్భంగా మహేష్ పేర్కొంటున్నారు. -
ఒలింపిక్స్ కు వెళ్తానని.. జైలుకు వెళ్లాడు!
న్యూఢిల్లీ: బాక్సింగ్ కోచ్ అనిల్ మాలిక్ తన మొబైల్ ఫోన్ లో ఉన్న పాత ఫొటోను చూస్తున్నారు. ఫొటో కింద కుడివైపు 2011, ఆగస్టు 28 తేదీ స్టాంపు ఉంది. పుణేలో 2011లో జరిగిన జాతీయ జూనియర్ బాక్సింగ్ టోర్నిలో విజేతలుగా నిలిచిన బాక్సర్ల ఫోటో అది. అందులో ఒక బాక్సర్ మెడలో బంగారు పతకం, ముఖంలో నవ్వుతో వెలిగిపోతున్నాడు. అతడి పేరు దీపక్ పహల్. 'జాతీయ పతకంతో అతడు సంతృప్తి చెందాలనుకోవడం లేదు. ఒలింపిక్స్ కు వెళ్లాలనేది అతడి లక్ష్యం. రియో ఒలింపిక్స్ లో కచ్చితంగా పాల్గొంటానని నాతో అతడు చెప్పాడు. 16 ఏళ్ల కుర్రవాడికి ఇది పెద్ద లక్ష్యమే అయినప్పటికీ అతడిపై నాకు నమ్మకం ఉంద'ని మాలిక్ చెప్పాడు. ఐదేళ్లు గడిచాయి. రియో ఒలింపిక్స్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కానీ ఒలింపిక్స్ వెళ్తానన్న జూనియర్ బాక్సింగ్ చాంపియన్ దీపక్ పహల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. జితేందర్ అనే గ్యాంగ్‌స్టర్ పారిపోవడానికి సహకరించాడన్న ఆరోపణలతో పహల్ ను జూలై 30 హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. జితేందర్ ను ఢిల్లీలోని రోహిణి జైలు నుంచి సోనిపట్ కోర్టుకు తీసుకెళుతుండగా ఓ ముఠా పోలీసుల కళ్లలో కారం కొట్టి అతడిని తప్పించింది. పోలీసులు అరెస్ట్ చేసిన 10 మంది ముఠాలో పహల్ కూడా ఉన్నాడు. జితేందర్ పారిపోవడానికి పహాల్ రెండు కార్లు సమకూర్చాడు. అందులో ఒక కారు చోరీ చేసిందని పోలీసులు గుర్తించారు. మంచి ప్రతిభవున్న పహల్ నేరస్తుడిగా మారడం తాను ఊహించలేదని మాలిక్ పేర్కొన్నాడు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు మహాలక్ష్మి ఎంపిక
మామిడికుదురు : ఆలిండియా బాక్సింగ్ పోటీలకు మలికిపురానికి చెందిన ఎస్.మహాలక్ష్మి ఎంపికైనట్టు బాక్సింగ్ కోచ్ బొంతు మధుకుమార్ శుక్రవారం తెలిపారు. అంతర్ కళాశాలల విశ్వవిద్యాలయాల స్థాయిలో విజయవాడ ఆర్కే ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గురువారం జరిగిన అర్హత పోటీల్లో ప్రతిభ ఆధారంగా మహాలక్ష్మిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి పిభ్రవరి 2 వరకు పంజాబ్‌లో జరిగే పోటీల్లో ఈమె పాల్గొంటుందని వెల్లడించారు. మహాలక్ష్మి స్థానిక నవయువ క్రీడా యువజన సేవా సంఘం ఆ ధ్వర్యంలో బాక్సింగ్‌లో శిక్షణ పొందిందని, ఈమె ప్రస్తు తం విజయవాడలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోందని, వివరించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి ని పలువురు అభినందించారు.