PC: Fox news
ప్యారిస్ ఒలింపిక్స్ విలేజ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమోవా బాక్సింగ్ కోచ్ లియోనల్ ఎలికా ఫతుపైటో(60)గుండెపోటుతో మరణించాడు. శుక్రవారం జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల అనంతరం లియోనల్ ఎలికా తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది.
అనంతరం ఆస్పత్రికి తరిలించి చికిత్స అందించినప్పటకి ఎలికా కన్నుమూశాడు. విషయాన్ని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) శనివారం ధ్రువీకరించింది. అతడి మృతి పట్ల ఐబీఏ సంతాపం వ్యక్తం చేసింది.
"లియోనెల్ ఎలికా ఫతుపైటో మృతి మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాము. లియోనెల్ ఓపెనింగ్ సెర్మనీ తర్వాత తీవ్ర ఆస్వస్థత గురయ్యాడు. వైద్యులు ఆత్యవసర చికిత్స అందించినప్పటకి ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.
అతడిది సహజ మరణమే. ఈ విషయాన్ని స్ధానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం సైతం ధ్రువీకరించింది. లియోనెల్ తన పట్టుదల, అంకిత భావంతో ఎంతో మంది బాక్సర్లకు ఆదర్శంగా నిలిచాడు" అని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా బాక్సింగ్‌లో సమోవా నుంచి ఏకైక బాక్సర్ అటో ప్లోడ్జికి-ఫావో గాలీ హెవీ వెయిట్ కేటగిరీలో పోటీ పడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment