బడుగులందరికీ దివ్య దర్శనం | badugulaku divya darsanam | Sakshi
Sakshi News home page

బడుగులందరికీ దివ్య దర్శనం

Published Sun, Sep 25 2016 10:21 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

badugulaku divya darsanam

– దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ దుర్గాప్రసాద్‌
దెందులూరు : బడుగు, బలహీనవర్గాల్లో ఆధ్యాత్మిక అభివృద్ధి, శ్రీవారి సన్నిధి సులభతరమయ్యేలా రాష్ట్రప్రభుత్వం, దేవాదాయశాఖ చర్యలు తీసుకుందని జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సీహెచ్‌.దుర్గాప్రసాద్‌ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దివ్యదర్శనం పథకాన్ని జిల్లావ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకంలో రామాలయాల ఆధునికీకరణ, నిర్మాణం, భజన మండళ్లకు శిక్షణ తరగతులు ప్రతి దేవాలయంలో దూప, దీప నైవేథ్యాల పర్యవేక్షణతో పాటు పేద బడుగు, బలహీనవర్గాల వారందరికీ కుటుంబంలో ఐదుగురికి వారానికి ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి, విజయవాడ, నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుపతి, కాణిపాకం, రాయచోటి, అహోబిలం పుణ్యక్షేత్రాలకు దేవాదాయశాఖ నిధులతో తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందుకు గాను జిల్లాలోని దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు, ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆధ్యాత్మిక సేవలను అందుకోవాలని ఆయన కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement