పెద్దపాడు మండలం పూనుకొల్లు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి మృతిచెందారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం రేమల్లి గ్రామంలో పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటనలో బడుగు సాయి దుర్గా ప్రసాద్(20), కొనకళ్ల రామకృష్ణ (24) మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.