ఈ పోలీస్ చాలా మెంటల్! | Srikanth At Mental Police movie | Sakshi
Sakshi News home page

ఈ పోలీస్ చాలా మెంటల్!

Published Wed, Mar 18 2015 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

ఈ పోలీస్ చాలా మెంటల్!

ఈ పోలీస్ చాలా మెంటల్!

అతను ఓ మంచి పోలీస్. అన్యాయాలను, అక్రమాలను సహించలేడు. వాటిపై తిరగబడతాడు. అతని నిజాయతీని ‘మెంటల్’ అని కొందరు అంటారు. ఈ పోలీస్ చుట్టూ తిరిగే కథతో సాగే చిత్రం ‘మెంటల్ పోలీస్’. అనగాని ఫిలిమ్స్, సుబ్రమణ్యేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏవీవీ దుర్గాప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణం పి. బాబ్జీ నిర్మాత. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఈ కథకు టైటిల్ బాగా యాప్ట్ అయింది. ‘ఆపరేషన్ దుర్యోధన’ కన్నా ఈ చిత్రంలో నాది మంచి పాత్ర’’ అని చెప్పారు. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందనీ, అన్ని వర్గాల వారికీ నచ్చుతుందనీ దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరుపుతున్నామని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి. సత్యనారాయణ.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement