Mental Police
-
అప్పటికీ అభ్యంతరం పెడితే టైటిల్ మార్చుతాం..
హైదరాబాద్ : 'మెంటల్ పోలీస్' సినిమా టైటిల్ మార్చాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘాల నుంచి వినతులు వచ్చాయని ఆ చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. రెండు రాష్ట్రాల పోలీస్ సంఘాల నేతలకు సినిమా చూపిస్తామని, అప్పటికీ టైటిల్ మార్చాలంటే మార్పు చేస్తామని వారు బుధవారమిక్కడ వెల్లడించారు. శ్రీకాంత్ హీరోగా మెంటల్ పోలీస్ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా సినిమా పేరు ఉందంటూ ఆ చిత్ర నిర్మాత, దర్శకులతోపాటు హీరో శ్రీకాంత్‌కు పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. సమాజంలో పోలీసులకున్న గౌరవ మర్యాదలను కించపరిచేలా సినిమా పేరు పెట్టారని, దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. మరోవైపు మెంటల్ పోలీస్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసు అధికారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా శ్రీకాంత్, అక్ష జంటగా కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో వీవీఏఎన్ ప్రసాద్ దాసరి, వీవీ దుర్గాప్రసాద్ అనగాని ఈ చిత్రాన్ని నిర్మించారు. -
కథ మీద దృష్టి పెట్టడం లేదు : దాసరి నారాయణరావు
‘‘ఈరోజుల్లో సినిమాలు తీసేందుకు, దాని పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. విదేశాల్లో పాటలు, సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం పెడుతున్న శ్రద్ధ కథకు ప్రాధాన్యత ఇవ్వడంలో పెట్టడం లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. బాగా ఆడితే పెద్దది, ఆడకపోతే చిన్న సినిమా. రెండు లక్షలు పెట్టి తీసిన ‘స్వర్గం- నరకం’, ‘తాత-మనవడు’ చిన్న చిత్రాలైనా ఏడాది పాటు ఆడాయి. శ్రీకాంత్ నటించిన ‘టై’ సినిమా బాగున్నా సరిగ్గా ఆడలేదు. సినిమా బాగుందని జనాల్లోకి వెళ్లే లోపు థియేటర్ల నుంచి తీసేస్తున్నారు. అదే కథను బాలీవుడ్లో తీస్తే వంద కోట్లు కలెక్ట్ చేసేది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. శ్రీకాంత్, అక్ష జంటగా కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో వివిఎఎన్ ప్రసాద్ దాసరి, వివి దుర్గాప్రసాద్ అనగాని నిర్మించిన చిత్రం ‘మెంటల్ పోలీస్’. ఈ చిత్రం ట్రైలర్‌ను దాసరి విడుదల చేశారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ- ‘‘ఎవరికీ లొంగని పవర్ఫుల్ పోలీసాఫీసర్ కథే ఈ చిత్రం. క్యారెక్టర్ పరంగా ఆ టైటిల్ పెట్టాం. దీనిపై పోలీసు శాఖ నుంచి అభ్యంతరాలొస్తున్నాయి. వారిని కలిసి ఈ టైటిల్ ఎందుకు పెట్టామో వివరిస్తాం. అయినా వినకపోతే టైటిల్ మారుస్తాం’’ అన్నారు. -
సినిమా చూస్తే పోలీసులే మెచ్చుకుంటారు: హీరో శ్రీకాంత్
తిరుమల : ‘మెంటల్ పోలీస్’ చిత్రం పోలీసులు, పోలీసు విభాగం గొప్పతనాన్ని తెలియజేసే సినిమా అని హీరో శ్రీకాంత్ అన్నారు. ఉగాది పర్వదినం సందర్బంగా శుక్రవారం సతీమణి ఊహ, కుమారుడు రోషన్, కుమార్తె మేధతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను నటించిన మెంటల్ పోలీస్ చిత్రంపై పోలీసు సంఘాలు ఇచ్చిన నోటీసులకు ఆయన వివరణ ఇచ్చారు. తనకు పోలీసులన్నా, పోలీసు విభాగం అన్నా ఎంతో గౌరవమని, వారిని కించపరిచే పని ఏ సందర్భంలోనూ చేయనన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత పోలీసులు మెచ్చుకుంటారన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదే సందర్భంగా తన కుమారుడు రోషన్ నటిస్తున్న చిత్రం జూన్, జూలైలో విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. హీరో నాగార్జున నిర్మించే చిత్రంలో తన కుమారుడు నటిస్తున్నాడని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
'మెంటల్ పోలీస్' నిర్మాతకు లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ‘మెంటల్ పోలీస్’ పేరుతో సినిమా నిర్మించినందుకు నిర్మాత, దర్శకులతోపాటు అందులో నటించిన హీరో శ్రీకాంత్‌కు పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపింది. సమాజంలో పోలీసులకున్న గౌరవ మర్యాదలను కించపరిచేలా సినిమా పేరు పెట్టారని, దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కరణ్‌కుమార్ సింగ్, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. -
హీరో శ్రీకాంత్‌కు లీగల్ నోటీసులు
హైదరాబాద్: పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా మెంటల్ పోలీస్ పేరుతో సినిమా నిర్మించినందుకు నిర్మాత, దర్శకులతో పాటు అందులో నటించిన హీరో శ్రీకాంత్‌కు కూడా పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపించింది. సమాజంలో పోలీసులకున్న గౌరవ మర్యాదలను కించపరిచేలా ఈ సినిమాకు పేరు పెట్టారని... వెంటనే ఆపేరును తొలగించాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కరణ్‌కుమార్ సింగ్, సీనియర్ ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఇతనికి మెంటల్!
పోలీస్ ఆఫీసర్‌గా ‘ఖడ్గం’, ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రాల్లో శ్రీకాంత్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు. అంత అద్భుతంగా నటించారాయన. ఇప్పుడు మరోసారి పోలీస్ అధికారిగా ‘మెంటల్ పోలీస్’ చిత్రంలో నటిస్తున్నారు. కరణం పి.బాబ్జీ(శ్రీను) దర్శకత్వంలో వివిఎస్ఎన్వి ప్రసాద్, వివి దుర్గాప్రసాద్ అనగాని ఈ చిత్రం నిర్మిస్తున్నారు. దర్శకుడు వి. సముద్ర, శ్రీకాంత్ ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘కథ విన్నప్పుడు మంచి హిట్టు అవుతుందని అనుకున్నాను. నాపై నమ్మకంతో దర్శకుడు నా కోసమే రాసుకున్న కథ ఇది’’ అన్నారు. ‘‘శ్రీకాంత్‌గారు చేస్తానంటేనే ఈ సబ్జెక్ట్‌తో ముందుకొచ్చా’’ అని దర్శకుడు పేర్కొన్నారు. ‘‘మాకిది తొలి చిత్రమైనా సహకరిస్తున్న అందరికీ థ్యాంక్స్ ’’ అని నిర్మాతలు తెలిపారు. సమర్పణ: దాసరి అరుణాదేవి, అనగాని ఫిలింస్. -
బోల్డంత తిక్క
‘‘ఈ పోలీస్ చాలా తేడా. అతని స్కీమ్స్ వెరైటీగా ఉంటాయి. బోల్డంత తిక్క కూడా ఉంది. ఇతనికి ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడో తెలియాలంటే ‘మెంటల్ పోలీస్’ చూడాల్సిందే’’ అంటున్నారు శ్రీకాంత్. ఆయన హీరోగా వీవీఎస్ఎన్వి ప్రసాద్, వీవీ దుర్గాప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణం పి. బాబ్జీ దర్శకుడు. అక్ష కథానాయిక. ‘ఖడ్గం’, ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రాల స్థాయిలో శ్రీకాంత్‌కు మంచి పేరు వస్తుందని దర్శకుడు చెప్పారు. ఈ నెలలోనే ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. -
ఈ పోలీస్ చాలా మెంటల్!
అతను ఓ మంచి పోలీస్. అన్యాయాలను, అక్రమాలను సహించలేడు. వాటిపై తిరగబడతాడు. అతని నిజాయతీని ‘మెంటల్’ అని కొందరు అంటారు. ఈ పోలీస్ చుట్టూ తిరిగే కథతో సాగే చిత్రం ‘మెంటల్ పోలీస్’. అనగాని ఫిలిమ్స్, సుబ్రమణ్యేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏవీవీ దుర్గాప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణం పి. బాబ్జీ నిర్మాత. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఈ కథకు టైటిల్ బాగా యాప్ట్ అయింది. ‘ఆపరేషన్ దుర్యోధన’ కన్నా ఈ చిత్రంలో నాది మంచి పాత్ర’’ అని చెప్పారు. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందనీ, అన్ని వర్గాల వారికీ నచ్చుతుందనీ దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరుపుతున్నామని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి. సత్యనారాయణ.