
'మెంటల్ పోలీస్' నిర్మాతకు లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ‘మెంటల్ పోలీస్’ పేరుతో సినిమా నిర్మించినందుకు నిర్మాత, దర్శకులతోపాటు అందులో నటించిన హీరో శ్రీకాంత్‌కు పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపింది. సమాజంలో పోలీసులకున్న గౌరవ మర్యాదలను కించపరిచేలా సినిమా పేరు పెట్టారని, దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కరణ్‌కుమార్ సింగ్, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.