
ప్రచార పోస్టర్లను విడుదల చేస్తున్న నాయకులు
గంభీరావుపేట(సిరిసిల్ల): జాతీయ, రాష్ట్రస్థాయి డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20 నుంచి ఆలిండియా లారీల నిరవధిక బంద్ చేపట్టనున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ తెలిపారు. గంభీరావుపేట మండలం లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం బంద్‌కు సంబంధించిన ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పరిమిట్ విధానం అమలు చేయాలని కోరారు. యాక్సిడెంట్, ఓవర్‌లోడ్ కేసులలో డ్రైవర్‌ల లైసెన్స్ రద్దు విధానాన్ని విరమించుకోవాలని, లారీలపై ఓవర్‌లోడ్ నిషేధించాలని, జిల్లాకొక డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్హతతో సంబంధం లేకుండా సామర్థ్యం పరీక్షించి డ్రైవింగ్ లైసెన్స్‌లు మంజూరు చేయాలని కోరారు. మండలశాఖ అధ్యక్షుడు పిట్ల వెంకటి, నాయకులు నర్సింలు, శేఖర్, ఓనర్‌లు చంద్రారెడ్డి, నాగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment