lorry strick
-
20 నుంచి ఆలిండియా లారీల నిరవధిక బంద్
గంభీరావుపేట(సిరిసిల్ల): జాతీయ, రాష్ట్రస్థాయి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20 నుంచి ఆలిండియా లారీల నిరవధిక బంద్ చేపట్టనున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ తెలిపారు. గంభీరావుపేట మండలం లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం బంద్కు సంబంధించిన ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పరిమిట్ విధానం అమలు చేయాలని కోరారు. యాక్సిడెంట్, ఓవర్లోడ్ కేసులలో డ్రైవర్ల లైసెన్స్ రద్దు విధానాన్ని విరమించుకోవాలని, లారీలపై ఓవర్లోడ్ నిషేధించాలని, జిల్లాకొక డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్హతతో సంబంధం లేకుండా సామర్థ్యం పరీక్షించి డ్రైవింగ్ లైసెన్స్లు మంజూరు చేయాలని కోరారు. మండలశాఖ అధ్యక్షుడు పిట్ల వెంకటి, నాయకులు నర్సింలు, శేఖర్, ఓనర్లు చంద్రారెడ్డి, నాగయ్య పాల్గొన్నారు. -
‘లారీ యూనియన్ల డిమాండ్లు నెరవేర్చాలి’
న్యూఢిల్లీ: లారీల సమ్మె అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో లేవనెత్తారు. బుధవారం రాజ్యసభలో ఈ మేరకు ఒక ప్రస్తావన చేస్తూ అత్యవసర వస్తువులను రవాణా చేస్తున్న లారీలను దేశ వ్యాప్తంగా నిలిపి వేస్తామని లారీ ఓనర్లు గత 5 రోజులుగా ప్రటిస్తున్నారని, ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందుల పాలవుతారని ఆయన చెప్పారు. సమ్మె సందర్భంగా కేవలం ఏపీలోనే దాదాపుగా 3 లక్షల లారీలను నడపడం లేదన్నారు. వాస్తవానికి లారీ ఓనర్ల సంఘాల ప్రతినిధులు కేంద్ర మంత్రిని కలుసుకున్నారని, వారి డిమాండ్లను కేంద్ర మంత్రి పరిష్కరించలేకపోవడంతో సమ్మె కొనసాగుతోందన్నారు.లారీ ఓనర్ల సంఘాలు డిమాండ్లను ప్రస్తావిస్తూ 50 శాతం బీమా పెంపును తగ్గించాలని, 15 సంవత్సరాలకు మించిన వాహనాలను నడపరాదన్న నిబంధనను 20 సంవత్సరాలకు పెంచాలని, నిరవధికంగా టోలు వసూలు చేయరాదని లారీ ఓనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని విజయసాయి రెడ్డి చెప్పారు. లారీ ఓనర్ల సమ్మె ప్రభావం దేశ వ్యాప్తంగా రైతాంగంపై పడుతోందని, ఆహార ధాన్యాలను రవాణా చేయలేకపోతున్నారని విజయసాయి రెడ్డి చెప్పారు. ఒక పక్క రైతులకు కనీస మద్దతు ధర లభించక పోగా మరో పక్క అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. లారీ ఓనర్ల సంç œూల వాస్తవ డిమాండ్ల పరిష్కారం కాకపోతే వారు సమ్మె విరమించుకోలేరని విజయసాయి రెడ్డి చెప్పారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణమే లారీ ఓనర్ల డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
‘లారీ యూనియన్ల డిమాండ్లు నెరవేర్చాలి’