సీఆర్‌పీఎఫ్‌ తాత్కాలిక డీజీగా సుదీప్‌ లక్డాకియా | CRPF temporary DG Sudip lakdakiya | Sakshi
Sakshi News home page

సీఆర్‌పీఎఫ్‌ తాత్కాలిక డీజీగా సుదీప్‌ లక్డాకియా

Published Wed, Mar 1 2017 2:11 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

CRPF temporary DG Sudip lakdakiya

న్యూఢిల్లీ: సీఆర్‌పీఎఫ్‌ అదనపు డీజీగా పనిచేస్తున్న సుదీప్‌ లక్డాకియాకు డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ హోం శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది.  ఆయన బుధవారం(నేడు) బాధ్యతలు చేపట్టనున్నారు. 1984 బ్యాచ్‌ తెలంగాణ కేడర్‌కు చెందిన లక్డాకియా, ప్రస్తుతం సెంట్రల్‌ జోన్ లోని పారామిలటరీ బలగాలకు నేతృత్వం వహిస్తున్నారు.

గతంలో ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్‌ ప్రొటెక్షన్  గ్రూప్‌(ఎస్పీజీ)లో లక్డాకియా పనిచేశారు. హోంమంత్రిత్వ శాఖ, ప్రధాని నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ కమిటీ(ఏసీసీ) తదుపరి డీజీని నియమించేవరకు లక్డాకియా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. గతేడాది   డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన దుర్గాప్రసాద్‌ (1981 బ్యాచ్, తెలంగాణ కేడర్‌) సోమవారం పదవీ విరమణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement