జీతం సరిపోవటం లేదంటూ దుర్గా ప్రసాద్ అనే హోంగార్డు గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు.
తూర్పుగోదావరి(రాజమండ్రి): జీతం సరిపోవటం లేదంటూ దుర్గా ప్రసాద్ అనే హోంగార్డు గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. సూసైడ్ నోట్ రాసి మహిళలు నెత్తికి రాసుకొనే వ్యాజ్‌మోలా తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది.
ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదు, గోదావరి పుష్కరాలకు డ్యూటీ వేశారు కానీ తగిన ప్రయాణభత్యము చెల్లించటం లేదు. రెండు పూటలా తినక అయిదు రోజులయ్యింది అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. దుర్గా ప్రసాద్ ఇదేవిధంగా గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.