నల్లజర్ల: గత కొన్ని రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను సిరంజీ సైకో హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం సాయంత్రం నల్లజర్ల మండలం పోతవరంలో ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని ఇంజక్షన్ సైకోగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలు, యువతులకు ఇంజెక్షన్లతో పొడుస్తూ ఓ సైకో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో శనివారం నుంచి బుధవారం వరకు 13 మంది మహిళలు, విద్యార్థినులపై మత్తు ఇంజెక్షన్లతో సైకో దాడి చేశాడు. ఈనెల 22న యండగండి గ్రామంలో ఇద్దరు విద్యార్థినులను గాయపర్చిన సైకో వరుసగా ఇంజక్షన్లతో దాడులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన జిల్లా పోలీస్ యంత్రాంగం అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, ప్రస్తుతం అదుపులో ఉన్న వ్యక్తి ఇంజక్షన్ సైకోనా?కాదా?అనేది తేలాల్సి ఉంది.