
లిప్ట్ అడిగి మరీ ఇంజక్షన్ ఇచ్చాడు..
భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లాలో 'ఇంజక్షన్ సైకో' కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా మరో వ్యక్తికి ఇంజక్షన్ ఇచ్చి పరారైన ఘటన భీమవరం మండలం కొవ్వాడలో సోమవారం చోటు చేసుకుంది. మంచికి పోతే చెడు ఎదురైనట్లు...లిప్ట్ ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తి ఇంజక్షన్ పాలైయ్యాడు.
జిల్లాలో ప్రజల కంటిపై కునుకు లేకుండా పోలీసులకు సవాల్గా మారిన సూదిగాడు ఇప్పటికీ దొరక్కుండా మిస్టరీగా మారాడు. సిరంజితో పొడిచి మహిళలను బెంబేలెత్తిస్తున్న ఇతగాడు తాజాగా పురుషులకు చెమటలు పట్టిస్తున్నాడు. ఆదివారం రాత్రి పెంటపాడు గేటు సెంటర్ వద్ద...ఇంటికి వెళుతున్న వడ్రంగి మేస్త్రిని.. బైక్ వచ్చిన యువకులు సూదులతో రెండుచోట్ల గుచ్చి పోరిపోయిన విషయం తెలిసిందే.