kovvada
-
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సహాయమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. కొవ్వాడతోపాటు మహారాష్ట్రలోని జైత్పూర్, గుజరాత్‌లోని ఛాయ, మిథి విర్ది, పశ్చిమ బెంగాల్‌లోని హరిపూర్, మధ్యప్రదేశ్‌లోని భీమ్‌పూర్‌లలో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు వివరించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కొవ్వాడలో 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశంలో ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పాదన కోసం కర్ణాటక, çహరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 10 అణు రియాక్టర్లలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆర్థిక, పాలనాపరమైన ఆమోదం ఇచ్చినట్లు తెలిపారు. సమూహం పద్ధతిలో నెలకొల్పే ఈ పది రియాక్టర్ల నిర్మాణం 2031 నాటికి పూర్తవుతుందని చెప్పారు. వీటి నిర్మాణం పూర్తయితే అదనంగా మరో ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సౌర, పవన విద్యుత్ రంగాలకు వెదర్ డేటా ఇటీవల కాలంలో సౌర, పవన విద్యుత్ రంగాల్లో వాతావరణ సమాచారం వినియోగం విపరీతంగా పెరిగినందున ఆ రంగానికి వెదర్ డేటా కీలకంగా మారిందని సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియొరాలజీ (ఐఐటీఎం), ఇండియన్ మెటియొరాలజికల్ డిపార్ట్మెంట్ రూపొందించే వాతావరణ సమాచారాన్ని సౌర, పవన విద్యుత్ రంగాలతోపాటు అనేక రంగాలు వినియోగించుకుంటున్నాయని చెప్పారు. ఈ సంస్థలన్నీ పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధనరంగం వినియోగం కోసం వాతావరణం గురించి ముందస్తు సమాచారం అందించే కేంద్రాలు ఏర్పాటుచేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రసహాయ మంత్రి చెప్పారు. విదేశీ జైళ్లలో 3,335 మంది మత్స్యకారులు విదేశీ జైళ్లలో 3,335 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి మురళీధరన్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2017లో 1,087 మంది, 2018లో 446 మంది, 2019లో 504 మంది, 2020లో 779 మంది మత్స్యకారులు బందీలయ్యారని చెప్పారు. సకాలంలో పాస్‌పోర్టుల డెలివరీకి ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్‌లో పాస్‌పోర్టులను సకాలంలో డెలివరీ చేయడం తమ ప్రాధాన్యత అని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ తెలిపారు. ఇందుకోసం సెలవుల్లో పనిచేయడం ద్వారా ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, తిరుపతి నగరాల్లో నాలుగు పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలున్నాయని చెప్పారు. ఇవి విశాఖపట్నం, విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల పరిధిలో ఉన్నాయన్నారు. విశాఖపట్నం రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఇటీవల ఆర్‌పీవోను నియమించినట్లు చెప్పారు. విశాఖపట్నం ఆర్పీవోలో మంజూరైన పోస్టుల సంఖ్య 48 కాగా, వాస్తవసంఖ్య 42గా ఉందని తెలిపారు. విశాఖపట్నం ఆర్పీవోలో ప్రస్తుతం 1,926 పాస్‌పోర్ట్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 1,283 గత ఏడురోజుల్లో వచ్చాయని వివరించారు. -
అమెరికా సహకారంతో కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం నెలకొల్పాలని ప్రతిపాదించినట్లు పీఎంవో కార్యాలయ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిస్తూ.. మొత్తం ఆరు రియాక్టర్లతో 1,208 మెగావాట్ల సామర్థ్యంతో ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశీయంగా తయారయ్యే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ (పీహెచ్‌డబ్ల్యూఆర్)ను ఈ అణువిద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం 18 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అణువిద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా మరో ఆరు నిర్మాణంలో ఉన్నాయని, మరో 10 పీహెచ్‌డబ్ల్యూఆర్‌ల ఏర్పాటుకు ఆర్థిక, పాలనాపరమైన మంజూరు లభించిందని వివరించారు. ఈ మొత్తం రియాక్టర్ల ద్వారా 7 వేల మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర పథకం న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేసే ప్రాథమిక బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వలదే అయినప్పటికీ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక తోడ్పాటు ఇచ్చేందుకు కేంద్రం పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకం కింద మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం భరిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏప్రిల్ 2021 నుంచి మరో అయిదేళ్లు పొడిగించిందని తెలిపారు. ఈ పథకం కింద రూ.9 వేల కోట్లు కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 5,307 కోట్లని తెలిపారు. 1993–94లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు 8,758 కోట్లు విడుదల చేసిందని, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.199 కోట్లని చెప్పారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల పెంపు ప్రతిపాదన వచ్చింది ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదన వచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలతో కలిపి పూర్తి ప్రతిపాదనలు పంపాలని గత నవంబర్ 29న, గతనెల 3వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలను కోరామని కేంద్రమంత్రి చెప్పారు. -
కొవ్వాడలో ఉద్రిక్తత ; 144 సెక్షన్
సాక్షి, విజయనగరం : జిల్లాలోని పూసపాటిరేగ మండలం కొవ్వాడలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీకి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చెందిన ఎస్వీఎల్ లైఫ్ సైన్స్ కంపెనీ భూములను తమకి అప్పగించాలని పోరాడుతున్న దళితులు ఇవాళ మరోసారి భూముల్లోకి చొచ్చుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో కొవ్వాడలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినందునే తాము భూముల్లో వస్తున్నామని రైతులు చెబుతుండగా.. పోలీసులు మాత్రం వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రైతులకు మద్దతుగా నిలిచిన కొంతమంది వామపక్ష నేతలను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చెందిన భూముల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవ్వాడ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. -
కొవ్వాడలో ఉద్రిక్తత ; 144 సెక్షన్
-
కొవ్వాడ బాధితులకు వైఎస్ఆర్సీపీ మద్దతు
విజయనగరం: విజయనగరం జిల్లా కొవ్వాడ బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున హామీ ఇచ్చారు. శనివారం ఆయన పార్టీ శ్రేణులు, బాధితులతో కలిసి పూసపాటిరేగ మండలం కొవ్వాడ దళితుల భూముల్లో పర్యటించారు. దళితుల భూముల ఆక్రమణను టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. దళితుల పక్షపాతి అయిన వైఎస్ఆర్సీపీ న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందని, అండగా ఉంటుందని తెలిపారు. -
కొవ్వాడలో ఉద్రిక్తం
పూసపాటిరేగ(నెల్లిమర్ల): అధికారం అండతో పట్టాభూముల్ని కాజేస్తూంటే వారి కడుపు మండింది. ఎన్నో ఏళ్లుగా తాము అనుభవిస్తున్న భూముల్ని వేరొకరికి ధారాదత్తం చేయడంతో వారి రక్తం ఉడికింది. ఎలాగైనా తమ భూములు దక్కించుకోవాలని ఉద్యమానికి వారంతా సిద్ధమయ్యారు. అక్కడ వేసిన కంచెలు ధ్వంసం చేసి ఆ భూముల్లో టేకు మొక్కలు నాటారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల శాసనసభ్యుడు పతివాడ నారాయణస్వామి నాయుడు కుమారుడి బినామీ కంపెనీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 17 ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. ఆ భూముల్ని ఇదివరకే పూసపాటిరేగ మండలం కొవ్వాడ దళితులకు పట్టాలుగా అందజేయడంతో వారు ఆ భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేమని ఆందోళన చేస్తున్నారు. అయినా ఆ భూముల్లో బుధవారం రాత్రే కంపెనీ యాజమాన్యం కంచె వేయడంతో విషయం తెలుసుకున్న దళితులు గురువారం ఉదయం మూకుమ్మడిగా ఆ కంచెను ధ్వంసం చేశారు. నోటీసుల్లేకుండా లాక్కుంటారా... వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, దళిత నా యకుడు మిరప అప్పారావు ఆధ్వర్యంలో కొవ్వాడ కు చెందిన దళితులు రక్షణ కంచెను ధ్వంసం చేశా రు. ప్రభుత్వం తమకు డి–పట్టాలుగా ఆ భూములు ఇచ్చిందనీ... ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు చెందిన ఎన్సీఎల్ లేబొరేటరీకి ప్రభుత్వం ఎలా అప్పగిస్తుందని వారు ప్రశ్నించారు. అప్పటికే పూసపాటిరేగ ఎస్ఐ జి.కళాధర్ సిబ్బందితో కంచెను ధ్వంసం చేయకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహిళలతో వాగ్వివాదానికి దిగడంతో మరికొంత మంది దళితులు వేరే మార్గంలో వచ్చి మిగతా కంచెను తీసేశారు. సుమారు 17 ఎకరాల భూముల్లో తమతో పాటు తెచ్చిన టేకు మొక్కల ను నాటారు. విషయాన్ని పోలీసు ఉన్నత అధికా రులకు సమాచారం అందజేయగా డీఎస్పీలు ఎ. ఎస్.చక్రవర్తి, డి.త్రినాథరావు ఆధ్వర్యంలో వందలాది మంది ప్రత్యేక పోలీసులు సంఘటనా స్థలం లో మోహరించారు. రిజర్వు ఇన్స్పెక్టర్ రామకృష్ణ సంఘటనా స్థలంలోనే మాక్‌డ్రిల్ నిర్వహించారు. వేడెక్కిన వాతావరణం ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలతో పాటు వందలాది మంది ప్రత్యేకపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది దళితులు ఒక పక్క, పోలీసులు మరో ప్రక్క వుండటంతో వ్యూహ ప్రతి వ్యూహాలతో వాతావరణం వేడెక్కింది. పోలీసులు భారీ స్థాయిలో మోహరించిన తరువాత భోగాపురం సీఐ ఇ.నరసింహారావు రైతుసంఘం రాష్ట్రప్రధానకార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, దళిత సంఘం నాయకులను సంఘటనా స్థలంలో చర్చలకు ఆహ్వానించారు. డీఎస్పీలు ఎ.ఎస్.చక్రవర్తి, డి.త్రినాథరావు, తహసీల్దార్ ఆర్ ఎర్నాయుడు చర్చలు జరిపారు. రెవెన్యూకు సంబంధించిన విషయం కావడంతో విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో కొవ్వాడ డి–పట్టాదారులను తమదగ్గరున్న అధారాలతో చర్చలకు రావాలని ఆహ్వానించారు. చర్చలు జరిగే వరకు భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకుండా చూడాలని పోలీసులకు తెలిపారు. దళితులకే పూర్తి హక్కులు కొవ్వాడ గ్రామానికి చెందిన దళితులకు డి–పట్టాగా ఇచ్చారు. వారికే భూములపై పూర్తిహక్కులు వున్నాయి. 2013 భూసేకరణ చట్టం, షెడ్యూల్ 11 ప్రకారం దళితుల భూములు ప్రభుత్వానికి అవసరం మేరకు తీసుకున్నప్పడు ముందుగానే పట్టాదారులకు నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తరువాత పట్టాదారు అంగీకరిస్తేనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలి. అలాంటివేవీ లేకుండా దళితుల భూములను లాక్కొని అధికారపార్టీకి చెందిన శాసనసభ్యుడు బినామీ కంపెనీకి కట్టబెట్టడం దుర్మార్గం. దీనిపై ఉద్యమం తీవ్రతం చేస్తాం. తక్షణమే అధికారపార్టీ శాసనసభ్యుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. – ఎం.వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి, అమరావతి దళితుల భూములు లాక్కుంటే కేసులు పెట్టాలి కొవ్వాడ దళితులు డిపట్టా భూములపై నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేయాలి. 1960 నుంచి భూములపై హక్కులతో వున్న దళితులకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలి. ప్రభుత్వానికి డి–పట్టా భూములు అవసరమైనప్పుడు నోటీసులు ఇచ్చి పట్టా దారులకు పరిహారం చెల్లించిన తరువాతే భూములు తీసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన విరమించుకోవాలి. – తమ్మినేని సూర్యనారాయణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, విజయనగరం. -
అణు నిర్వాసితులకు నష్టపరిహారం జమ!
► బ్యాంక్ ఖాతాల సేకరణలో అధికారులు ► ఎకరాకు రూ.15 లక్షలు జమ చేసేందుకు సన్నాహాలు రణస్థలం: కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు తొలి అడుగు పడుతోంది. కొవ్వాడ నిర్వాసిత ప్రాంత ప్రజలకు నష్టపరిహారం అందించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అదివారం విలేకరులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జె.సీతారామరావు మాట్లాడారు. కొవ్వా డ అణువిద్యుత్ కేంద్రం నిర్వాసితుల నుంచి బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నామని తెలిపారు. భూములసంబంధిత పత్రాలు సక్రమంగా ఉంటే.. మరో రెండు రోజుల్లో నష్టపరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమఅవుతుందని చెప్పారు. డీ పట్టా, జిరాయితీ భూము లకు ఒకే రేటు చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు రూ.15 లక్షల చొప్పున నగదు నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. నిర్వాసితులు ఎకరాకు రూ.18 లక్షల డిమాండ్ చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి అణువిద్యుత్ అకౌంట్లో రూ. 500 కోట్లు జమైనట్లు చెప్పారు. 2016–17 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మార్చి 30వ తేదీ లోపు కొంత మేరకు పరిహారం ఫండ్ ఖర్చు చేయాలన్నారు. అలాంటి పక్షంలో మరో రూ.700 కోట్ల పరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి అకౌంట్లో జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.శ్రీరాములు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యం,గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. జీఓ విడుదల: అణువిద్యుత్ కేంద్రం పార్కు నిర్మాణంలో భాగంగా కొవ్వాడలో భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం జీఓ 1179 విడుదల చేసింది. మొత్తం 2,438 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇందులో డీ పట్టా భూములు 1,473 ఎకరాలకు సంబంధించి నిర్వాసితులకు జీఓ 1179 ద్వారా నష్టపరిహారం చెల్లించనున్నారు. అణు నిర్వాసిత భూములకు రూ.18 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. -
ఆ భారీ మొత్తం వెనుక పెద్దలెవరు?
కొవ్వాడ వద్ద నోట్ల పట్టివేత వ్యవహారంలో పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వీఆర్‌లోకి ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్ సహా ముగ్గురు కానిస్టేబుళ్లు కాకినాడ క్రైం : కాకినాడ రూరల్ కొవ్వాడ రైల్వే గేటు సమీపంలో అక్రమంగా తరలిస్తు్తన్న పెద్దనోట్ల పట్టివేత వ్యవహారంలో ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పెద్దనోట్లను కాకినాడకు చెందిన ఓ వైద్యుని ఇంటికి తరలిస్తున్నట్లు వెల్లడికావడంతో తరలిస్తు్తన్న వ్యక్తుల నుంచి పోలీసులు బేరసారాలకు దిగి రూ. 5 లక్షలు లంచం తీసుకుని,అసలైన నిందితులను విడిచిపెట్టేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అక్రమపర్వానికి సంబంధించి విశ్వసనీయంగా తెలిసిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 4న రాత్రి కాకినాడ ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం–పైన రహదార్లో వాహనాల తనిఖీ చేపట్టారు. మాచవరం నుంచి కాకినాడకు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తు్తన్న పెద్ద నోట్లను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 18 లక్షల విలువైన పెద్దనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పెద్దనోట్ల నగదు పట్టివేత, స్వాధీనంపై పోలీసులు అత్యంత గోప్యత పాటించారు. భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ నగదు స్వాధీనంపై సోమ, మంగళవారాల్లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పిన పోలీసులు అలా చేయకపోవడం ఆరోపణలకు ఊతమిచ్చింది. నగదు పట్టివేత, కేసు నమోదులో పోలీసుల వైఖరి పలు సందేహాలకు తావిచ్చింది. అక్రమ నగదు పట్టివేతపై పోలీసులపై ఆరోపణలు రావడాన్ని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ సీరియస్‌గా పరిగణించి దర్యాప్తు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నోట్ల పట్టివేత వ్యవహారంలో సిబ్బంది సొమ్ములకు ఆశపడి అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో కాకినాడ ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్ఎస్సై శంకరప్రసాద్, ముగ్గురు కానిస్టేబుళ్లు గంగాధర్, ప్రసాద్, పరశురాంరెడ్డిలను వీఆర్‌లోకి పంపుతూ ఎస్పీ రవిప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం వీరిపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న పెద్దనోట్లను ఎవరి దగ్గరకు తీసుకెళుతుండగా పట్టుకున్నారు, ఎంత మంది అక్రమ రవాణాలో పాల్గొన్నారన్నది తెలుసుకుని, పట్టుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు. -
అమెరికాకు సిరి.. ఉత్తరాంధ్రకు ఉరి
► కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం వద్దు ► సీఐటీయూ ఆధ్వర్యంలో వినూత్న నిరసన రణస్థలం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికాకు సిరులు కురిపించడానికి కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం పెట్టి ఉత్తరాంధ్రను ఉరితీస్తున్నాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, డివిజన్ కార్యదర్శి పి.తేజేశ్వరరావులు ధ్వజమెత్తారు. హిరోషిమా డే సందర్భంగా శనివారం కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉరితాళ్లతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1945లో జరిగిన అణుబాంబు విధ్వంసంతో ఇప్పటికీ హిరోషిమా కోలుకోలేదన్నారు. ఇప్పుడు కొవ్వాడలో ఆరు రియాక్టర్లు పెడుతున్నారని, ఒక్కో రియాక్టర్ ఒక్కో అణుబాంబుతో సమానమని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగాలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని దుయ్యబట్టారు. అణునిపుణులతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. రేడియోధార్మికతతో భూమి, గాలి, నీరు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు మైలపల్లి పట్టయ్య, అభిరామ్, సీహెచ్ అమ్మన్నాయుడు, కె.గురినాయుడు, సీతారాం, సంతోష్, బాలి శ్రీను తదితరులు పాలొన్నారు. -
కొవ్వాడపై వడివడిగా అడుగులు!
– ఒకవైపు నిరసనలు... మరోవైపు భూప్రకంపనలు – అయినా వెనక్కి తగ్గని సర్కారు – భూసేకరణపై అధికారులతో సమీక్ష సమావేశం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకవైపు ప్రజలు, ప్రజాసంఘాల నిరసనలు.. మరోవైపు తరచూ భూమి కంపిస్తున్నా ప్రభుత్వం మాత్రం కొవ్వాడ న్యూక్లియర్ పార్కుపై వెనకడుగు వేయట్లేదు. ఎలాగైనా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేలా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. దీనిలో భాగంగా బుధవారం కలెక్టరేట్లో రహస్య సమావేశం జరిగింది. కలెక్టరు పి.లక్ష్మీనృసింహం, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.కృష్ణభారతి, ఆర్డీవో బలివాడ దయానిధి, కొవ్వాడ భూసేకరణ అధికారి జె.సీతారామారావులతో పాటు కొవ్వాడ న్యూక్లియర్ పార్కు చీఫ్ ఇంజినీర్ వెంకటరమేష్లను కలెక్టరు చాంబరుకు పిలిచి మంతనాలు సాగించారు భూసేకరణపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. నిర్వాసితులకు ప్యాకేజీపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం, నిర్వాసితుల్లో ఒక వర్గం పూర్తిగా న్యూక్లియర్ పార్కును వ్యతిరేకించడం, ఇటీవలే సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ పర్యటన నేపథ్యంలో ఏర్పడిన సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలనే విషయమై చర్చించినట్లు తెలిసింది. రణస్థలం మండలం కొవ్వాడ పంచాయతీ పరిధిలో దాదాపు 2,100 ఎకరాల విస్తీర్ణంలో తలపెట్టిన న్యూక్లియర్ పార్కును తొలుత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే కళావెంకటరావు వ్యతిరేకించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆరు రియాక్టర్లను ఏర్పాటు చేయడంపై గుజరాత్లో వ్యతిరేకిస్తే అక్కడ విరమించుకొని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొవ్వాడలో న్యూక్లియర్ పార్కు ఏర్పాటు వల్ల భవిష్యత్తులో తలెత్తే విపత్తులపై విపక్షాలు, ప్రజాసంఘాలు శ్రీకాకుళం జిల్లా సహా ఉత్తరాంధ్రలో వరుసగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇదికూడా సర్వాత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు జిల్లాలో తరచుగా భూప్రకంపనలు రావడం కూడా కొవ్వాడలో అణువిద్యుత్తు కర్మాగారం ఏర్పాటు చేస్తే భద్రత ఎలా ఉంటుందోననే అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే కొవ్వాడలో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
అణువిద్యుత్‌తోనే భవిష్యత్
– జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ ఎచ్చెర్ల: భవిష్యత్ అవసరాలకు అణువిద్యుత్ తప్పనిసరి అని జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం నిర్మాణ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఎన్యూమరేటర్లకు చిలకపాలెంలోని శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత బొగ్గు కొరత వెంటాడుతుందని, అప్పుడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అసాధ్యం అని చెప్పారు. ఈ నేపథ్యంలో అణువిద్యుత్ ప్లాంట్లు నిర్మాణం తప్పనిసరి అన్నారు. ఈ ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం సాగుతుందన్నారు. దేశంలో మొత్తం 10 అణుప్రాజెక్టులు ఉన్నాయని, అటువంటి ప్రాజెక్టు మన జిల్లాలో నిర్మించడం జిల్లాకు జాతీయస్థాయి ప్రాధాన్యం లభించినట్లేనని తెలిపారు. ఢిల్లీ, చెన్నై వంటి నగర ప్రాంతాల సమీపంలో అణుపార్కులు ఉన్నాయని చెప్పారు. భవిష్యత్‌లో అణువిద్యుత్ ప్లాంటులు, సౌర, పవన విద్యుత్‌లకు ప్రాధాన్యం పెంచవల్సిన అవసరం ఉందన్నారు. గతంలో 1894 చట్టం ప్రకారం భూసర్వేలు చేసేవారని, 2014లో కొత్త భూ సేకరణ చట్టాలు వచ్చాయన్నారు. ఈ చట్టాలు మేరకు ప్రజల అభిప్రాయం క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లు ప్రజలను చైతన్య పర్చటం, అణువిద్యుత్ ప్రాధాన్యం వివరించటం కీలకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి.మురళీకృష్ణ, ఎచ్చెర్ల డీటీ బి.శ్రీహరిబాబు, ఆర్ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
లిప్ట్ అడిగి మరీ ఇంజక్షన్ ఇచ్చాడు..
-
లిప్ట్ అడిగి మరీ ఇంజక్షన్ ఇచ్చాడు..
భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లాలో 'ఇంజక్షన్ సైకో' కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా మరో వ్యక్తికి ఇంజక్షన్ ఇచ్చి పరారైన ఘటన భీమవరం మండలం కొవ్వాడలో సోమవారం చోటు చేసుకుంది. మంచికి పోతే చెడు ఎదురైనట్లు...లిప్ట్ ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తి ఇంజక్షన్ పాలైయ్యాడు. జిల్లాలో ప్రజల కంటిపై కునుకు లేకుండా పోలీసులకు సవాల్‌గా మారిన సూదిగాడు ఇప్పటికీ దొరక్కుండా మిస్టరీగా మారాడు. సిరంజితో పొడిచి మహిళలను బెంబేలెత్తిస్తున్న ఇతగాడు తాజాగా పురుషులకు చెమటలు పట్టిస్తున్నాడు. ఆదివారం రాత్రి పెంటపాడు గేటు సెంటర్ వద్ద...ఇంటికి వెళుతున్న వడ్రంగి మేస్త్రిని.. బైక్ వచ్చిన యువకులు సూదులతో రెండుచోట్ల గుచ్చి పోరిపోయిన విషయం తెలిసిందే. -
విధ్వంసాన్ని ఆహ్వానించడమే : మేథా పాట్కర్
శ్రీకాకుళం: అణువిద్యుత్ కేంద్రం నిర్మించడమంటే విధ్వంసాన్ని ఆహ్వానించడమేనని ప్రముఖ సామాజిక పర్యావరణవేత్త మేథా పాట్కర్ హెచ్చరించారు. రణస్థలం మండలంలోని మత్స్యకార గ్రామమైన కొవ్వాడలో కేంద్ర ప్రభుత్వం అణువిద్యుత్ కేంద్రం నిర్మించ తలపెట్టిన విషయం తెసిందే. ఈరోజు కొవ్వాడలో మేథా పాట్కర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాఉద్యమం ద్వారా అణు విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని అడ్డుకుంటామన్నారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాఅణువిద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కోటపాలెం, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన భూము లను స్వాధీనం చేసుకోవడానికి మొదటి విడతగా 481 ఎకరాలకు సంబంధించి 4(1) నోటీసులను ప్రభుత్వం జారీ చేసింది. అయితే, ఆ భూములపై ఎలాంటి అభ్యంతరాలున్నా తెలియజేయూలని రైతులను ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగా ఈ నెల 27న రామచంద్రాపురం, 29న కోటపాలెం గ్రామాల్లో అభ్యంతరాలపై గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయూ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రభుత్వ అధికారులు నోటీసులను అతికించారు. దీంతో కొవ్వాడ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా కనీసం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. గ్రామసభలకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ సభలు ఏర్పాటు చేయూలని కోరుతున్నారు. ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా నేరుగా అభ్యంతరాలపై గ్రామ సభలు పెట్టడం సరికాదని ఈ ప్రాంత మత్స్యకారులు, రైతులు, ప్రజలు, పలు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షుణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోకపోతే ఆందోళనలు, పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ప్రజా ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, మేథా పాట్కర్ వంటివారు రావడంతో అణువిద్యుత్ కేంద్రంకై భూసేకరణ గ్రామసభలను అధికారులు వాయిదా వేశారు.