
భూముల్లోకి ప్రవేశిస్తున్న రైతులను అడ్డుకుంటున్న పోలీసులు
సాక్షి, విజయనగరం : జిల్లాలోని పూసపాటిరేగ మండలం కొవ్వాడలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీకి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చెందిన ఎస్‌వీఎల్ లైఫ్ సైన్స్ కంపెనీ భూములను తమకి అప్పగించాలని పోరాడుతున్న దళితులు ఇవాళ మరోసారి భూముల్లోకి చొచ్చుకెళ్ళే ప్రయత్నం చేశారు.
దీంతో కొవ్వాడలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినందునే తాము భూముల్లో వస్తున్నామని రైతులు చెబుతుండగా.. పోలీసులు మాత్రం వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రైతులకు మద్దతుగా నిలిచిన కొంతమంది వామపక్ష నేతలను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చెందిన భూముల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవ్వాడ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment