sudigadu
-
నేను బతికే ఉన్నా : హీరోయిన్
అహ్మదాబాద్ : సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లో అల్లరి నరేశ్‌తో జతకట్టిన అందాల భామ మోనాల్ గజ్జర్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మోనాల్ తన స్నేహితుడు డాక్టర్ రోహిత్ పుట్టిన రోజు వేడుక కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అహ్మదాబాద్ నుంచి ఉదయ్‌పుర్ వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ఉదయ్‌పుర్ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా పాడైపోయింది. దీంతో మోనాల్ మృతిచెందినట్టు వార్తలు రావడంతో ఆమె బుధవారం ఫేస్ బుక్ లైవ్‌కి వచ్చారు. తాను మరణించానని కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. తనతో పాటూ అందరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారని పేర్కొన్నారు. తన మెడ బెణకడంతో నొప్పి ఉందని, అందుకే బెల్ట్ ధరించినట్టు తెలిపారు. మోనాల్ చివరగా గుజరాతీ చిత్రం రేవాలో నటించారు. ప్రస్తుతం ఆమె గుజరాతీ చిత్రం ఫ్యామిలీ సర్కస్‌లో నటిస్తున్నారు. తెలుగుతో పాటూ గుజరాతీ, హింది, తమిళ్, మళయాల చిత్రాల్లో మోనాల్ నటించారు. -
ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాను
-
‘సిల్లీ ఫెలోస్’గా అల్లరి నరేష్, సునీల్
వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డ యంగ్ హీరో నరేష్, ప్రస్తుతం జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. తనకు చివరి హిట్ సుడిగాడు సినిమాను అందించిన భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నరేష్. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్ తో పాటు మరో కామెడీ హీరో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇద్దరు టాప్ కామెడీ స్టార్లు నటిస్తుండటంతో సినిమాలో వినోదానికి డోకా లేదని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా సినిమాకు సిల్లీ ఫెలోస్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. దాదాపుగా ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇద్దరు హీరోలతో పాటు దర్శకుడు భీమినేని కెరీర్‌కు కూడా ఈ సినిమా విజయం ఎంతో కీలకం. -
సెట్స్ మీదకు అల్లరోడు
కొంతకాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ సాధించటంలో ఫెయిల్ అవుతున్న యంగ్ హీరో అల్లరి నరేష్, తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించాడు. ఇటీవల సక్సెస్ కోసం చేసిన ప్రయోగాలన్ని ఫెయిల్ అవ్వటంతో కొత్త సినిమాను తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్లోనే చేసేందుకు నిర్ణయించుకున్నాడు. తనకు సుడిగాడు లాంటి సూపర్ హిట్ అందించిన భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో నరేష్ కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు(శనివారం) లాంచనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో మరో కామెడీ హీరో సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. శ్రీ వసంత్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
కామెడీకే ఓటేసిన అల్లరోడు
ఇటీవల వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో పడ్డ అల్లరి నరేష్ సుడిగాడు సినిమాతో చివరిసారిగా సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత నరేష్ చేసిన రొటీన్ కామెడీ ఎంటర్ టైనర్లతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు కూడా నిరాశపరిచాయి. దీంతో మరోసారి తనకు పట్టున్న కామెడీ జానర్ లోనే సక్సెస్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు అల్లరోడు. తనకు చివరి సక్సెస్ అందించిన భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సుడిగాడు సినిమా తరహాలోనే తదుపరి చిత్రాన్ని రీమేక్ గానే తెరకెక్కించనున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ కామెడి చిత్రాన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
బంజారాహిల్స్‌లో సూదిగాడి కలకలం
సిరంజితో చిన్నారిపై దాడి చేసిన సైకో సురేశ్ హైదరాబాద్: బంజారాహిల్స్‌లో సూదిగాడు కలక లం రేపాడు. ఆదివారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారికి సిరంజి గుచ్చి పరారవుతుండగా స్థానికులు అప్రమత్తమై సూదిగాడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించా రు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్ లో నివసించే పాండురంగారావు, శ్రావణి దంపతుల చిన్నారి గ్రేష్మ కావ్యశ్రీ ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే సమయంలో ఓ యువకుడు చేతిలో సూది పట్టుకొని ఆడుకుంటున్న చిన్నారి తొడకు పొడిచి పారిపోయాడు. దీంతో కావ్య కిందపడిపోయింది. పాప ఏడుపు విని లోపలి నుంచి తల్లి శ్రావ ణి, పాండురంగారావు బయటకు రాగా విషయం చెప్పింది. వెంటనే పారిపోతున్న యువకుడిని స్థాని కుల సహకారంతో పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా నిందితుడి పేరు జి. సురేశ్‌గా తేలింది. స్థానికంగా నలుగురు స్నేహితులతో కలసి అద్దెగదిలో నివసిస్తూ హిమాయత్‌నగర్‌లోని అవిదా మీడియా సొల్యూషన్స్‌లో ప్రోగ్రాం డెవలపర్‌గా పని చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు సురేశ్ గదిలో తనిఖీలు చేయగా... ల్యాప్‌టాప్‌తోపాటు కొన్ని మందులు, సిరంజిలు లభించాయి. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఘటనాస్థలానికి బస్తీ యావత్తు తరలి వచ్చి ఆందోళన నిర్వహించింది. పట్టపగలే సూదిగాడు చిన్నారిని సిరంజితో పొడిచి పరారు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నిందితుడిని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా కావ్యకు నిలోఫర్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. -
లిప్ట్ అడిగి మరీ ఇంజక్షన్ ఇచ్చాడు..
-
లిప్ట్ అడిగి మరీ ఇంజక్షన్ ఇచ్చాడు..
భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లాలో 'ఇంజక్షన్ సైకో' కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా మరో వ్యక్తికి ఇంజక్షన్ ఇచ్చి పరారైన ఘటన భీమవరం మండలం కొవ్వాడలో సోమవారం చోటు చేసుకుంది. మంచికి పోతే చెడు ఎదురైనట్లు...లిప్ట్ ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తి ఇంజక్షన్ పాలైయ్యాడు. జిల్లాలో ప్రజల కంటిపై కునుకు లేకుండా పోలీసులకు సవాల్‌గా మారిన సూదిగాడు ఇప్పటికీ దొరక్కుండా మిస్టరీగా మారాడు. సిరంజితో పొడిచి మహిళలను బెంబేలెత్తిస్తున్న ఇతగాడు తాజాగా పురుషులకు చెమటలు పట్టిస్తున్నాడు. ఆదివారం రాత్రి పెంటపాడు గేటు సెంటర్ వద్ద...ఇంటికి వెళుతున్న వడ్రంగి మేస్త్రిని.. బైక్ వచ్చిన యువకులు సూదులతో రెండుచోట్ల గుచ్చి పోరిపోయిన విషయం తెలిసిందే. -
ఒకడు క్లాస్.. ఒకడు మాస్
‘సుడిగాడు’ తర్వాత మళ్లీ అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇ.సత్తిబాబు దర్శకుడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అంబికా కృష్ణ సంయుక్త సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అంబికా రాజా నిర్మాత. ఈ చిత్రంలో కథానాయికగా ఇషా చావ్లాను ఎంపిక చేశారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది ఈ చిత్రం గురించి అంబికా కృష్ణ చెబుతూ-‘‘తమిళంలో విజయం సాధించిన ‘కలగలుపు’ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే హక్కులు కొన్నాం. మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం రీమేక్ అవుతోంది. మాతృకలో అంజలి పోషించిన పాత్రకు ఇందులో ఇషా చావ్లాను ఎంపిక చేశాం. మరో నాయికగా స్వాతి దీక్షిత్ నటిస్తుంది. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అన్నారు. అనుభవం ఉన్న నటీనటులు, ప్రతిభ ఉన్న సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న చిత్రమిదని నిర్మాత చెప్పారు. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని అంబికా రామచంద్రరావు తెలిపారు. ఇందులో నరేష్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని, ఓ పాత్ర మాస్‌గా, ఓ పాత్ర క్లాస్‌గా ఉంటుందని, నాగార్జునకు ‘హలోబ్రదర్’ ఎంత పేరు తెచ్చిందో, ఈ చిత్రం నరేష్‌కి అంతటి పేరు తెస్తుందని సత్తిబాబు నమ్మకం వ్యక్తం చేశారు.