
అల్లరి నరేష్, సునీల్
వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డ యంగ్ హీరో నరేష్, ప్రస్తుతం జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. తనకు చివరి హిట్ సుడిగాడు సినిమాను అందించిన భీమినేని శ్రీనివాస్ దర‍్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నరేష్. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్ తో పాటు మరో కామెడీ హీరో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.
ఇద్దరు టాప్ కామెడీ స్టార్‌లు నటిస్తుండటంతో సినిమాలో వినోదానికి డోకా లేదని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా సినిమాకు సిల్లీ ఫెలోస్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. దాదాపుగా ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇద్దరు హీరోలతో పాటు దర్శకుడు భీమినేని కెరీర్‌కు కూడా ఈ సినిమా విజయం ఎంతో కీలకం.
Comments
Please login to add a commentAdd a comment