∙భీమినేని, వివేక్, ‘అల్లరి’ నరేశ్, భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి, టీజీ విశ్వప్రసాద్, సునీల్, అనిల్ సుంకర
‘‘సిల్లీ ఫెలోస్’ సినిమాలో భారీ ఫైట్స్, ఎమోషన్స్ ఉన్నాయని మేం చెప్పడం లేదు. టెన్షన్స్ మరచి పోయి ఆడియన్స్ హాయిగా నవ్వుకునే చిత్రం చేశాం’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, సునీల్, చిత్రా శుక్లా, పూర్ణ, నందినీరాయ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 7న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్ టాక్‌తో ముందుకు వెళ్తోందని చిత్రబృందం చెబుతోంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో చిత్రబృందానికి షీల్డ్స్ అందజేశారు చిత్ర నిర్మాతలు. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘ఇంతకు ముందు క్లాస్, మాస్ ఆడియన్స్‌ను మెప్పించే చిత్రాల్లో భాగమయ్యాను. ‘కితకితలు, బెండు అప్పారావు’ వంటి సినిమాలు చేశాను. ఎప్పటినుంచో పిల్లలకి కనెక్ట్ అయ్యే సినిమా చేయాలని ఉండేది. అది ఇప్పుడు తీరింది. అలాగే రెండు గంటలపాటు ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యాం. సునీల్‌గారు మంచి పాత్ర చేశారు. ‘సుడిగాడు’ తర్వాత చాలా సినిమాలు అనుకున్నాం. ఫైనల్‌గా భీమినేనిగారితో ఈ సినిమా కుదిరింది. ఎంతగానో సహకరించిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నరేశ్‌గారితో నాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది.
‘సుడిగాడు’ చిత్రంతో మంచి హిట్ సాధించాం. ఆ స్థాయిలో ‘సిల్లీ ఫెలోస్’ కూడా సక్సెస్ కావాలనుకున్నాం. క్లైమాక్స్‌లోని హాస్య సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పిల్లలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాకు సునీల్‌గారి పాత్ర బిగ్ ఎస్సెట్. ప్రొడ్యూసర్స్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు భీమినేని శ్రీనివాసరావు. ‘‘ఈ సినిమాలో నటించడం బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఫుల్‌మీల్స్ చేసినట్లు ఉంది. నరేశ్‌గారు బాగా కోపరేట్ చేశారు. సెట్‌లో భీమినేనిగారి ఓపికకు జోహార్లు. ఈ సినిమా నిర్మాతలందరూ పాజిటివ్ పర్సన్స్. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి’’ అన్నారు సునీల్. ‘‘ఈ సినిమా తీయడం కోసం చాలా మంది ట్రై చేశారు. ఫైనల్‌గా ఈ నిర్మాతల చేతికి వచ్చింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సక్సెస్ ఈ సినిమాతో రావడం హ్యాపీ. ఇద్దరి హీరోలను (నరేశ్, సునీల్) ఒకే చోట చూడటం హ్యాపీగా ఉంది’ అన్నారు అనిల్ సుంకర. ‘‘ఇంతకుముందు ‘నేనే రాజు నేనే మంత్రి, ఎమ్మేల్యే’ అనే రెండు సినిమాలు చేశాం. పొలిటికల్ అండ్ సిరీయస్ సినిమాలు తీస్తున్నారు ఏంటీ? అని సన్నిహితులు అడిగారు. అప్పుడు ఓ మంచి కామెడీ సినిమా తీయాలనుకుని ‘సిల్లీ ఫెలోస్’ తీశాం. సినిమాలో లాజిక్ కాదు మ్యాజిక్ వర్కౌట్ అయింది’’ అన్నారు కిరణ్ రెడ్డి. నిర్మాతలు భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల, విశ్వప్రసాద్ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment