‘అరగంటలోనే ఎళ్లిపోతం.. కైలాసానికి’ | Silly Fellows Movie Motion Poster | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 23 2018 11:34 AM | Last Updated on Thu, Aug 23 2018 11:37 AM

Silly Fellows Movie Motion Poster - Sakshi

వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డ యంగ్ హీరో అల్లరి నరేష్‌, ప్రస్తుతం జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. తనకు చివరి హిట్‌ సుడిగాడు సినిమాను అందించిన భీమినేని శ్రీనివాస్‌ దర‍్శకత్వంలో సిల్లీ ఫెలోస్‌ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు‌. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్‌ తో పాటు మరో కామెడీ హీరో సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌.

అల్లరి నరేష్‌ మార్క్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ రిలీజ్ అయ్యింది. బైక్‌ పైన వెళుతున్న నరేష్‌, సునీల్ మధ్య జరిగే సంభాషణతో ఈ టీజర్‌ను డిజైన్‌ చేశారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement