Silly Fellows
-
అల్లరి ఫెలోస్
-
‘సిల్లీ ఫెలోస్’ మూవీ సక్సెస్ మీట్
-
టెన్షన్స్ మర్చిపోయి హాయిగా నవ్వుకుంటారు – ‘అల్లరి’ నరేశ్
‘‘సిల్లీ ఫెలోస్’ సినిమాలో భారీ ఫైట్స్, ఎమోషన్స్ ఉన్నాయని మేం చెప్పడం లేదు. టెన్షన్స్ మరచి పోయి ఆడియన్స్ హాయిగా నవ్వుకునే చిత్రం చేశాం’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, సునీల్, చిత్రా శుక్లా, పూర్ణ, నందినీరాయ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 7న విడుదలైన ఈ సినిమా సక్సెస్ఫుల్ టాక్‌తో ముందుకు వెళ్తోందని చిత్రబృందం చెబుతోంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో చిత్రబృందానికి షీల్డ్స్ అందజేశారు చిత్ర నిర్మాతలు. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘ఇంతకు ముందు క్లాస్, మాస్ ఆడియన్స్‌ను మెప్పించే చిత్రాల్లో భాగమయ్యాను. ‘కితకితలు, బెండు అప్పారావు’ వంటి సినిమాలు చేశాను. ఎప్పటినుంచో పిల్లలకి కనెక్ట్ అయ్యే సినిమా చేయాలని ఉండేది. అది ఇప్పుడు తీరింది. అలాగే రెండు గంటలపాటు ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యాం. సునీల్‌గారు మంచి పాత్ర చేశారు. ‘సుడిగాడు’ తర్వాత చాలా సినిమాలు అనుకున్నాం. ఫైనల్‌గా భీమినేనిగారితో ఈ సినిమా కుదిరింది. ఎంతగానో సహకరించిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నరేశ్‌గారితో నాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది. ‘సుడిగాడు’ చిత్రంతో మంచి హిట్ సాధించాం. ఆ స్థాయిలో ‘సిల్లీ ఫెలోస్’ కూడా సక్సెస్ కావాలనుకున్నాం. క్లైమాక్స్‌లోని హాస్య సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పిల్లలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాకు సునీల్‌గారి పాత్ర బిగ్ ఎస్సెట్. ప్రొడ్యూసర్స్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు భీమినేని శ్రీనివాసరావు. ‘‘ఈ సినిమాలో నటించడం బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఫుల్‌మీల్స్ చేసినట్లు ఉంది. నరేశ్‌గారు బాగా కోపరేట్ చేశారు. సెట్లో భీమినేనిగారి ఓపికకు జోహార్లు. ఈ సినిమా నిర్మాతలందరూ పాజిటివ్ పర్సన్స్. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి’’ అన్నారు సునీల్. ‘‘ఈ సినిమా తీయడం కోసం చాలా మంది ట్రై చేశారు. ఫైనల్‌గా ఈ నిర్మాతల చేతికి వచ్చింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సక్సెస్ ఈ సినిమాతో రావడం హ్యాపీ. ఇద్దరి హీరోలను (నరేశ్, సునీల్) ఒకే చోట చూడటం హ్యాపీగా ఉంది’ అన్నారు అనిల్ సుంకర. ‘‘ఇంతకుముందు ‘నేనే రాజు నేనే మంత్రి, ఎమ్మేల్యే’ అనే రెండు సినిమాలు చేశాం. పొలిటికల్ అండ్ సిరీయస్ సినిమాలు తీస్తున్నారు ఏంటీ? అని సన్నిహితులు అడిగారు. అప్పుడు ఓ మంచి కామెడీ సినిమా తీయాలనుకుని ‘సిల్లీ ఫెలోస్’ తీశాం. సినిమాలో లాజిక్ కాదు మ్యాజిక్ వర్కౌట్ అయింది’’ అన్నారు కిరణ్ రెడ్డి. నిర్మాతలు భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల, విశ్వప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
‘సిల్లీ ఫెలోస్’ మూవీ రివ్యూ
టైటిల్ : సిల్లీ ఫెలోస్ జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్ల, నందిని, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణముకళి సంగీతం : శ్రీ వసంత్ దర్శకత్వం : భీమినేని శ్రీనివాసరావు నిర్మాత : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో అల్లరి నరేష్, హీరోగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక తిరిగి కమెడియన్‌గా టర్న్ అయిన సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ సిల్లీ ఫెలోస్. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాస రావు మరోసారి తమిళరీమేక్తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. అల్లరి నరేష్, సునీల్ ల కెరీర్‌కు ఎంతో కీలకమైన సిల్లీ ఫెలోస్ ప్రేక్షకులను ఆకట్టుకుందా..? అల్లరి నరేష్‌కు ఆశించిన విజయం దక్కిందా..? తిరిగి కామెడీ టర్న్ తీసుకున్న సునీల్ ఆకట్టుకున్నాడా..? కథ ; వీరబాబు (అల్లరి నరేష్), సూరి బాబు (సునీల్) సత్యనారాయణపురం ఎమ్మెల్యే జాకెట్ జానకీ రాం(జయప్రకాష్ రెడ్డి) అనుచరులు. జాకెట్ ఇమేజ్ కాపాడటం కోసం వీరబాబు ఎలాంటి మోసం చేయడానికైనా రెడీ అవుతాడు. అలా ఓ కార్యక్రమంలో జాకెట్ పరువు కాపాడటం కోసం సూరిబాబు, రికార్డింగ్ డ్యాన్సులు చేసే పుష్ప(బిగ్‌బాస్ ఫేం నందిని)లకి పెళ్లి చేస్తాడు. అప్పటికే సూరిబాబుకు కృష్ణవేణి (పూర్ణ)తో పెళ్లి కుదరటంతో పుష్పను వదిలించుకునేందుకు ఎమ్మెల్యే జాకెట్‌ను ఆశ్రయించాలనుకుంటాడు. అదే సమయంలో తను ప్రేమించిన వాసంతి (చిత్ర శుక్ల) ఉద్యోగం కోసం వీరబాబు.. జాకెట్‌కు పది లక్షల రూపాయలు ఇస్తాడు. ఈ రెండు సమస్యలు పరిష్కరించాల్సిన జాకెట్, మినిస్టర్ గోవర్థన్ ను పరామర్శించడానికి హాస్పిటల్‌కు వెళ్లి తిరిగి వచ్చే దారిలో ప్రమాదానికి గురై గతం మర్చిపోతాడు. మినిస్టర్ చనిపోతూ 500 కోట్లకు సంబంధించిన రహాస్యాన్ని జాకెట్‌కు చెప్పటంతో భూతం(పోసాని కృష్ణమురళి) ఆ డబ్బు కోసం జాకెట్ వెంటపడతాడు. మరి గతం మర్చిపోయిన జాకెట్ తిరిగి కోలుకున్నాడా..? 500 కోట్లకు సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టాడా? తమ సమస్యల నుంచి వీరబాబు, సూరి బాబలు ఎలా బయటపడ్డారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; కామెడీ స్టార్‌గా మంచి ఇమేజ్ ఉన్న నరేష్ మరోసారి తన ఇమేజ్‌కు తగ్గ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే పెద్దగా కొత్తదనం చూపించకుండా రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. తనవంతుగా వీరబాబు పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్గా చిత్ర శుక్లా పరవాలేదనిపించారు. వాసంతి పాత్రలో యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో కీలక పాత్రలో కనిపించిన బిగ్‌బాస్ ఫేం నందిని రాయ్ నిరాశపరిచారు. జయ ప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర రొటీన్ పాత్రల్లో కనిపించారు. అతిథి పాత్రలో పూర్ణ తళుక్కున మెరిశారు. విశ్లేషణ ; రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరున్న దర్శకుడు భీమినేని శ్రీనివాస్ రావు మరోసారి రీమేక్ కథతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తమిళంలో విజయం సాధించిన ‘వెలైను వంధుట్ట వెల్లకారన్’ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులతో రీమేక్ చేశారు. కోలీవుడ్ లో ఈ తరహా చిత్రాలు కొత్తైనా మన దగ్గర చాలా వచ్చాయి. దీంతో మరోసారి రొటీన్ కామెడీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ ప్రధాన పాత్రల పరిచయం, మంచి కామెడీ సీన్స్ తో ఆకట్టుకున్న దర్శకుడు ద్వితీయార్థంలో ఆ స్థాయిలో అలరించలేకపోయారు. పెద్దగా కథ లేకపోవటంతో ఒకే సన్నివేశాన్ని సాగదీస్తూ టైం పాస్ చేశారు. ముఖ్యంగా జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళీల మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాల విషయంలోనూ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. శ్రీ వసంత్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రపి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; కామెడీ నరేష్, సునీల్ నటన మైనస్ పాయింట్స్ ; రొటీన్ కథా కథనం సెకండ్ హాఫ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
నవ్వుకునే చిత్రాలను ఆదరించాలి
‘‘సిల్లీ ఫెలోస్’ చిత్రంలో నాలుగైదు రోజుల పాత్ర చేశాను. భీమనేని శ్రీనివాస్‌తో 26 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. తను హార్డ్ వర్కర్ కాబట్టే సినిమాలన్నీ సూపర్ హిట్స్ అవుతున్నాయి. నరేశ్, సునీల్.. ఎవరో ఒకరుంటేనే కామెడీ పరంగా తట్టుకోవడం కష్టం. అలాంటిది ఇద్దరూ కలిసి నటించారంటే కామెడీ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. హాయిగా నవ్వుకునే సినిమాలను ఆదరించాలి’’ అని నటుడు డా. బ్రహ్మానందం అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినీరాయ్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ‘సుడిగాడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన భీమనేనిగారితో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సునీల్‌గారు, నేను ఈగోస్ లేకుండా నటించాం. ప్రేక్షకులు ‘సుడిగాడు’ రేంజ్ హిట్ అందిస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘నరేష్‌గారు, నేను అన్నదమ్ముల్లా కలిసిపోయాం. ‘తొట్టిగ్యాంగ్’ సినిమాకు ఎంత ఎంజాయ్ చేశానో ‘సిల్లీ ఫెలోస్’కి కూడా అంతే ఎంజాయ్ చేశా. ఇందులో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర చేశా’’ అన్నారు సునీల్. ‘‘సిల్లీ ఫెలోస్’ సినిమా వెనుక చాలా కష్టం ఉంది. మా కష్టాన్ని ఈరోజు తెరపై చూస్తారు. ‘సుడిగాడు’ తర్వాత నేను ఒక సినిమా చేస్తే.. నరేష్‌గారు 12 చిత్రాలు చేశారు’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘భీమనేని మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. పెద్ద హీరోలందరూ తమ సినిమాల్ని కనీసం ఒక షెడ్యూల్ అయినా ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ చేయాలని కోరుకుంటున్నా. ఇందుకు దర్శక–నిర్మాతలను, హీరోలను రిక్వెస్ట్ చేస్తున్నా’’ అన్నారు ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ. ఈ వేడుకలో డైరెక్టర్ కె.నాగేశ్వర్ రెడ్డి, నటి నందినీరాయ్ పాల్గొన్నారు. -
‘సిల్లీ ఫెల్లోస్’ ప్రీరిలీజ్ ఈవెంట్
-
డైరెక్షన్ చేస్తా
‘‘డబ్బు గురించి, సినిమాల సంఖ్య గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. క్వాలిటీగా సినిమాలు చేద్దామనుకుంటున్నా. కెరీర్ మొదట్లో విలన్ అవుదామనుకున్నా. రవిబాబుగారు నాతో ‘అల్లరి’ చేశారు. భవిష్యత్‌లో చిన్న బడ్జెట్లో సినిమా డైరెక్షన్ చేస్తా’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, సునీల్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. టీజీ విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేశ్ పంచుకున్న విశేషాలు... ► ‘సిల్లీ ఫెలోస్’ లో రాజకీయాలంటే ఆసక్తి ఉండే వీరబాబు అనే లేడీస్ టైలర్ పాత్ర చేశాను. సూరిబాబు క్యారెక్టర్లో సునీల్‌గారు కనిపిస్తారు. ‘తొట్టిగ్యాంగ్’ తర్వాత మేమిద్దరం ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్స్ చేసిన చిత్రమిది. కామెడీలో అందరూ పాత నరేశ్, పాత సునీల్‌ను మిస్ అవుతున్నామని అంటున్నారు. ఆ పాతను వెతికి మళ్లీ ఈ సినిమాలో పెట్టాం. ► ఈ సినిమాకి తొలుత ‘సుడిగాడు 2’ టైటిల్ పరిశీలనకు వచ్చింది. ఆ పేరు పెడితే ప్రేక్షకులు స్పూఫ్ కామెడీ ఆశించి వస్తారు. ఆడియన్స్‌ను మోసం చేయకూడదని ‘సిల్లీ ఫెలోస్’ ఫిక్స్ చేశాం. భీమనేనిగారికి ‘ఎస్’ సెంటిమెంట్ ఉందిగా(నవ్వుతూ). ఒకరిని అనుకరించటం నటన కాదని నా భావన. ► రియలిస్టిక్ సినిమాలపై నాకు ఆసక్తి ఉంది. కామెడీ చేసేవారు ఏమైనా చేయగలరని నా నమ్మకం. ‘లడ్డుబాబు’ చిత్రానికి ఎంతో కష్టపడ్డా. కానీ, వర్కౌట్ కాలేదు. ఇకపై నా కామెడీని, ఎమోషన్ని బ్యాలెన్స్ చేసే ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుకుంటున్నా. అన్నయ్య(ఆర్యన్ రాజేశ్) రామ్‌చరణ్ సినిమా చేస్తున్నారు. ► మహేశ్‌బాబుగారి సినిమాలో ఓ మంచి పాత్ర చేస్తున్నా. గిరి దర్శకత్వంలో నేను హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. మారుతి దర్శకత్వంలో ఈవీవీ బ్యానర్లో నేను హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. మరికొన్ని కథలు వింటున్నాను. వెబ్ సిరీస్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి వాటి పట్ల ఆసక్తి ఉంది. తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టాను. -
మంచి సినిమాలే మా టార్గెట్
‘‘హిట్స్, ఫ్లాప్స్ హీరోల చేతుల్లో ఉండవు. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. మంచి సినిమాలు నిర్మించాలన్నదే మా లక్ష్యం’’ అన్నారు నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి. ‘అల్లరి’ నరేశ్, సునీల్ ముఖ్య పాత్రల్లో భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. టీజీ విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి మాట్లాడుతూ–‘‘నేనే రాజు నేనే మంత్రి, ఎమ్మెల్యే’ సినిమాల తర్వాత మా బ్యానర్లో వస్తున్న మూడో చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. తమిళంలో హిట్ అయిన ‘విలైను వన్దుట్ట వెళైకారన్’ సినిమాకు ఇది రీమేక్. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం. లాజిగ్కు సంబంధం లేకుండా ఇందులో మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. మా బ్యానర్లో ‘సిల్లీ ఫెలోస్’ హాట్రిక్ హిట్ అవుతుంది. నరేశ్‌గారు హీరోగా, సునీల్‌గారు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. చిత్రా శుక్లా, నందినీ బాగా నటించారు. ప్రీ–క్లైమాక్స్‌లో జయప్రకాష్‌రెడ్డిగారు, పోసానిగారి కెమెడీ హిలేరియస్‌గా ఉంటుంది. భీమినేని కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్స్ లిస్ట్‌లో మా సినిమా చేరుతుందన్న నమ్మకం ఉంది. ఇద్దరు హీరోలు ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడే ఈ సినిమా స్టార్ట్ చేశాం. దీన్ని బట్టి సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా సీక్వెల్ కుదిరితే ఆనందమే. ప్రస్తుతానికైతే ఆ చర్చలు లేవు’’ అన్నారు. -
అది వాళ్లే ఊహించేసుకున్నారు
‘‘నేను హీరోగా ఉన్నప్పుడు మామూలు పాత్రలు చేద్దామని అనుకున్నాను. కానీ, ‘అతను హీరో అయిపోయాడుగా.. వేరే పాత్రలు చేయడేమో?’ అని దర్శకులే ఊహించేసుకున్నారు. అలా వేరే పాత్రలు చేయడం కుదర్లేదు. హీరోగా చేసినప్పుడు హిట్, ఫ్లాప్ కౌంట్లోకి వస్తుంది. కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే మన ట్రాక్ పండిందా? లేదా? అన్నది చాలు’’ అని సునీల్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. టీజీ విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. ఈసందర్భంగా సునీల్ పంచుకున్న విశేషాలు... ► అప్పట్లో జంధ్యాలగారు, ఈవీవీ సత్యనారాయణగారు కామెడీ సినిమాలు తీసేవారు. ఇప్పుడు కామెడీ టైమింగ్ ఉన్న దర్శకులు తగ్గారు. త్రివిక్రమ్, శ్రీనువైట్ల, వినాయక్‌గారు ఉన్నారు. అప్పటితో పోలిస్తే కామెడీ తగ్గింది. ఆడియన్స్‌ను ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఎంటర్టైన్ చేస్తున్నారు. ‘సిల్లీ ఫెలోస్’ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకూ ఫుల్ ఫన్‌తో ఉంటుంది. ఈ పాత్రకు నేనైతే బావుంటుందని టీమ్ డిసైడ్ అయ్యారు. సెకండ్ హాఫ్‌లో చివరి 20 నిమిషాల ట్రాక్‌కి ఆడియన్స్ సీట్లలో కూర్చోరు. అంతలా నవ్వేస్తారు. ► మా సినిమాలో హీరో నరేశే. మేం ఇంతకుముందు ‘అత్తిలి సత్తిబాబు, తొట్టిగ్యాంగ్’ సినిమాలు చేశాం. ‘సిల్లీ ఫెలోస్’లో తనకి హీరోయిన్ ఉంటుంది. నాకు ఉండదంతే. ► ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో డేట్స్ కుదరక చేయలేదు. మళ్లీ కామెడీ పాత్రల్లోకి రావడం పెద్ద మార్పేమీ అనిపించడం లేదు. అప్పుడెలా ఉండేదో ఇప్పుడూ అదే ట్రీట్మెంట్. హీరో అప్పుడు ఒకలా.. కమెడియన్‌గా మరోలా ట్రీట్మెంట్ జరుగుతుందంటే తప్పు మన బిహేవియర్లో ఉన్నట్టే. హీరోగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ రెమ్యునరేషన్ వస్తోంది (నవ్వుతూ). ► ‘అరవింద సమేత’ సినిమా ఫస్ట్ డే షూటింగ్లో త్రివిక్రమ్ కూడా ‘వీడు హీరో కదా.. ఇప్పుడెలా చేస్తాడు? అనుకున్నట్టున్నాడు. మంచి పాత్ర డిజైన్ చేశాడు త్రివిక్రమ్. ‘అతడు’ సినిమాలో నేను పోషించినటువంటి పాత్రలానే ఉంటుంది. సత్య, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి కామెడీ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ► హీరోగా రెండు కమిట్మెంట్స్ ఇచ్చాను. అవి చేయాలి. ‘అందాల రాముడు’ బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ 5 ఏళ్ల వరకూ హీరోగా ఏ సినిమా చేయలేదు. సినిమాల్లో పని చేయాలన్నది నా లక్ష్యం. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ► బ్రహ్మానందంగారి స్థానాన్ని భర్తీ చేసేవాడివి అంటున్నారు. ఇక్కడ ఎవ్వరూ ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం ఉండదు. యస్వీఆర్ మళ్లీ రారు. రావుగోపాలరావు రేంజ్ విలనిజం.. బ్రహ్మానందంగారి స్టైల్ కామెడీ మళ్లీ చూడలేం. కొన్ని సినిమాలు స్టార్ హీరో చేయడం కుదరదు. మేం మాత్రమే చేసే సినిమాలుంటాయి. పూర్తీగా నవ్వించే పాత్రలైతే మళ్లీ హీరోగా చేస్తా. -
దర్శకుడికి ప్రతి సినిమా పరీక్షే
‘‘ప్రతి సినిమాకు ప్రెషర్ ఉంటుంది. ప్రతి సినిమా ఫస్ట్ సినిమా అని చేయాలి. హీరోకు ఇంకో చాన్స్ ఉంటుంది. కానీ దర్శకుడికి ప్రతి సినిమా పరీక్షే. బావుంటే ప్రేక్షకులు ఎంత ఎత్తుకు తీసుకువెళ్తున్నారో బాలేకపోతే అంతే సులువుగా మరచిపోతున్నారు. అది ఎన్ని కోట్లుతో తీసిన సినిమా అయినా, ఎన్ని హిట్స్ ఇచ్చిన దర్శకుడు అయినా సరే’’ అని భీమనేని శ్రీనివాస్ అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. టీజీ విశ్వ ప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కుచ్చిభొట్ల నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా భీమనేని శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ► ‘అల్లరి’ నరేశ్, నేను ‘సుడిగాడు’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని చాలా డిస్కస్ చేసుకున్నాం. ‘సుడిగాడు’ హిట్ అవుతుంది అనుకున్నాం కానీ అంత పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందనుకోలేదు. దాంతో మా కాంబినేషన్లో మళ్లీ ఎలాంటి సినిమా చేయాలి? ‘సుడిగాడు’ సీక్వెల్ చేయలా? అని ఆలోచించాం. ఓ లైన్ కూడా అనుకున్నాం. ఈలోపు ఈ పాయింట్ వచ్చి ఈ సినిమా చేశాం. ఇందులో నరేశ్ లేడీస్ టైలర్‌గా కనిపిస్తారు. జయప్రకాశ్ రెడ్డి టైలర్ నుంచి ఎంఎల్ఏ అవుతారు. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాలో నరేశ్ కూడా అతని దారినే ఫాలో అవుతాడు. ► సునీల్ హీరోగా మంచి సక్సెస్ చూశారు. మళ్లీ కామెడీ చేయాలనుకున్నప్పుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాతో లాంచ్ అవ్వాలనుకున్నారు. ఈ సినిమా నచ్చడంతో ఒప్పుకున్నారు. నరేశ్ ఫ్రెండ్‌గా ఓ కీ రోల్లో కనిపిస్తారాయన. ► క్లైమాక్స్ ముందు వచ్చే 20 నిమిషాలు సినిమాకు హైలైట్ అని ఫీల్ అవుతున్నాం. ఆడియన్స్ సీట్లో కూర్చోకుండా నవ్వుతారు. లాజిక్, మేజిక్‌లు పట్టించుకోకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్ ఇది. ► ఏదైనా క్రాఫ్ట్ బాగా చేస్తే మన మీద ఆ ముద్రపyì పోతుంది. ఫస్ట్ సినిమా ‘సుప్రభాతం’ హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా రీమేక్‌లు చేశాను. తర్వాత సొంత కథలతో చేసిన ‘స్వప్నలోకం, నీ తోడు కావాలి’ సరిగ్గా ఆడలేదు. అందుకే రీమేక్స్‌లో బాగా రాణిస్తాడనే ముద్ర పడిపోయింది. దాంతో ఇవే చేస్తున్నాను. ► ఈ నిర్మాతలతో చాలా రోజులుగా అనుబంధం ఉంది. వాళ్లు ఆల్రెడీ ‘నేనే రాజు నేనే మంత్రి’ , ఎం.ఎల్.ఎ’ సినిమాలు తీశారు. హ్యాట్రిక్ కోసం స్క్రిప్ట్ జాగ్రత్తగా ఎంచుకున్నారు. -
నవ్వుల జర్నీలా ఉంది
‘అల్లరి’ నరేశ్, సునీల్ హీరోలుగా భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సిల్లీ ఫెల్లోస్’. చిత్రా శుక్లా కథానాయిక. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం మహేశ్‌బాబు రిలీజ్ చేశారు. ‘‘అల్లరి’ నరేశ్, సునీల్‌కు.. అలాగే ‘సిల్లీ ఫెల్లోస్’ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చూస్తుంటే నవ్వుల జర్నీలా అనిపిస్తోంది’’ అన్నారు.‘‘మా ‘సిల్లీ ఫెల్లోస్ చిత్రం ట్రైలర్ మహేశ్‌బాబు గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం హ్యాపీగా ఉంది’’ అని నిర్మాతలు అన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. బ్రహ్మానందం, జయప్రకాశ్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: అనీష్ తరుణ్ కుమార్. -
‘సిల్లీ ఫెలోస్’కు సూపర్ స్టార్ సాయం
కామెడీ స్టార్స్ అల్లరి నరేష్, సునీల్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న డబుల్ డోస్ కామెడీ ఎంటర్టైనర్ సిల్లీ ఫెలోస్. అల్లరి నరేష్ హీరోగా సుడిగాడు లాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీద థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. All the best to @allarinaresh, @Mee_Sunil & the entire team of #SillyFellows for their adventurous laughter riot.#SillyFellowsTrailer https://t.co/ujLuQ0Tt8C — Mahesh Babu (@urstrulyMahesh) 26 August 2018 -
‘సిల్లీ ఫెలోస్'
-
‘అరగంటలోనే ఎళ్లిపోతం.. కైలాసానికి’
వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డ యంగ్ హీరో అల్లరి నరేష్, ప్రస్తుతం జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. తనకు చివరి హిట్ సుడిగాడు సినిమాను అందించిన భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సిల్లీ ఫెలోస్ అనే కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్ తో పాటు మరో కామెడీ హీరో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. అల్లరి నరేష్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. బైక్ పైన వెళుతున్న నరేష్, సునీల్ మధ్య జరిగే సంభాషణతో ఈ టీజర్‌ను డిజైన్ చేశారు. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.