‘‘హిట్స్, ఫ్లాప్స్ హీరోల చేతుల్లో ఉండవు. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. మంచి సినిమాలు నిర్మించాలన్నదే మా లక్ష్యం’’ అన్నారు నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి. ‘అల్లరి’ నరేశ్, సునీల్ ముఖ్య పాత్రల్లో భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. టీజీ విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి మాట్లాడుతూ–‘‘నేనే రాజు నేనే మంత్రి, ఎమ్మెల్యే’ సినిమాల తర్వాత మా బ్యానర్‌లో వస్తున్న మూడో చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. తమిళంలో హిట్ అయిన ‘విలైను వన్దుట్ట వెళైకారన్’ సినిమాకు ఇది రీమేక్.
కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాం. లాజిగ్‌కు సంబంధం లేకుండా ఇందులో మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. మా బ్యానర్‌లో ‘సిల్లీ ఫెలోస్’ హాట్రిక్ హిట్ అవుతుంది. నరేశ్‌గారు హీరోగా, సునీల్‌గారు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. చిత్రా శుక్లా, నందినీ బాగా నటించారు. ప్రీ–క్లైమాక్స్‌లో జయప్రకాష్‌రెడ్డిగారు, పోసానిగారి కెమెడీ హిలేరియస్‌గా ఉంటుంది. భీమినేని కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్స్ లిస్ట్‌లో మా సినిమా చేరుతుందన్న నమ్మకం ఉంది. ఇద్దరు హీరోలు ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడే ఈ సినిమా స్టార్ట్ చేశాం. దీన్ని బట్టి సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా సీక్వెల్ కుదిరితే ఆనందమే. ప్రస్తుతానికైతే ఆ చర్చలు లేవు’’ అన్నారు.
మంచి సినిమాలే మా టార్గెట్
Published Wed, Sep 5 2018 12:27 AM | Last Updated on Wed, Sep 5 2018 12:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment