
కొంతకాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ సాధించటంలో ఫెయిల్ అవుతున్న యంగ్ హీరో అల్లరి నరేష్, తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించాడు. ఇటీవల సక్సెస్ కోసం చేసిన ప్రయోగాలన్ని ఫెయిల్ అవ్వటంతో కొత్త సినిమాను తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్‌లోనే చేసేందుకు నిర్ణయించుకున్నాడు. తనకు సుడిగాడు లాంటి సూపర్ హిట్ అందించిన భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో నరేష్ కొత్త సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు(శనివారం) లాంచనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో మరో కామెడీ హీరో సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. శ్రీ వసంత్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment