
ఇటీవల వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో పడ్డ అల్లరి నరేష్ సుడిగాడు సినిమాతో చివరిసారిగా సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత నరేష్ చేసిన రొటీన్ కామెడీ ఎంటర్ టైనర్లతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు కూడా నిరాశపరిచాయి. దీంతో మరోసారి తనకు పట్టున్న కామెడీ జానర్ లోనే సక్సెస్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు అల్లరోడు. తనకు చివరి సక్సెస్ అందించిన భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.
గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సుడిగాడు సినిమా తరహాలోనే తదుపరి చిత్రాన్ని రీమేక్ గానే తెరకెక్కించనున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ కామెడి చిత్రాన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Comments
Please login to add a commentAdd a comment