ఒకడు క్లాస్.. ఒకడు మాస్ | allari naresh team up with e sathi babu in tamil remake movie | Sakshi
Sakshi News home page

ఒకడు క్లాస్.. ఒకడు మాస్

Published Fri, Nov 8 2013 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM

ఒకడు క్లాస్.. ఒకడు మాస్

ఒకడు క్లాస్.. ఒకడు మాస్

 ‘సుడిగాడు’ తర్వాత మళ్లీ అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇ.సత్తిబాబు దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, అంబికా కృష్ణ సంయుక్త సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అంబికా రాజా నిర్మాత. ఈ చిత్రంలో కథానాయికగా ఇషా చావ్లాను ఎంపిక చేశారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది ఈ చిత్రం గురించి అంబికా కృష్ణ చెబుతూ-‘‘తమిళంలో విజయం సాధించిన ‘కలగలుపు’ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే హక్కులు కొన్నాం. మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం రీమేక్ అవుతోంది. మాతృకలో అంజలి పోషించిన పాత్రకు ఇందులో ఇషా చావ్లాను ఎంపిక చేశాం. మరో నాయికగా స్వాతి దీక్షిత్ నటిస్తుంది.
 
  ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అన్నారు. అనుభవం ఉన్న నటీనటులు, ప్రతిభ ఉన్న సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న చిత్రమిదని నిర్మాత చెప్పారు. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని అంబికా రామచంద్రరావు తెలిపారు. ఇందులో నరేష్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని, ఓ పాత్ర మాస్‌గా, ఓ పాత్ర క్లాస్‌గా ఉంటుందని, నాగార్జునకు ‘హలోబ్రదర్’ ఎంత పేరు తెచ్చిందో, ఈ చిత్రం నరేష్‌కి అంతటి పేరు తెస్తుందని సత్తిబాబు నమ్మకం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement