నేను కూడా జంప్ జిలానీనే | Jump Jilani movie release on 12th june | Sakshi
Sakshi News home page

నేను కూడా జంప్ జిలానీనే

Published Thu, Jun 5 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

నేను  కూడా జంప్ జిలానీనే

నేను కూడా జంప్ జిలానీనే

 నేను కూడా జంప్ ‘‘నన్ను చూసి, చాలామంది సున్నిత మనస్కురాలు అనుకుంటారు. నిజంగా కూడా అంతే. కానీ, నా మనస్తత్వానికి భిన్నంగా నెగటివ్ రోల్ చేయాలని ఉంది’’ అంటున్నారు ఇషా చావ్లా. ‘ప్రేమ కావాలి’తో తెలుగులో కథానాయికగా పరిచయమైన ఇషా ఆ తర్వాత మూడు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ‘అల్లరి నరేశ్’ సరసన ఆమె నటించిన ‘జంప్ జిలానీ’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇషా చావ్లా మాట్లాడుతూ - ‘‘ఇందులో నేను హెల్త్ ఆఫీసర్ పాత్ర చేశాను. సినిమాలో ఇతర పాత్రలను డామినేట్ చేస్తుంటాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.
 
 వినోద ప్రధానంగా సాగే సినిమాలు చేస్తే చాలా హాయిగా ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్ అయితే సినిమాలో మాత్రమే కాదు.. లొకేషన్లో కూడా ఏవేవో జోక్స్ వేసేవారు. దాంతో షూటింగ్ అంతా చాలా సందడిగా సాగింది. దర్శకుడు సత్తిబాబుగారికి తనకేం కావాలో బాగా తెలుసు. ‘సీన్ అర్థమైందా.. ’ అని అడుగుతారు. అర్థం అయ్యిందంటే ‘ఓకే షాట్ తీద్దాం’ అంటారు. లేకపోతే మళ్లీ వివరంగా చెప్పేవారు’’ అని చెప్పారు. ఇంతకీ ‘జంప్ జిలానీ’ అంటే ఏంటి? అనడిగితే - ‘‘ఈ సినిమాలో ప్రతి పాత్ర ఏదో ఒక సందర్భంలో జంప్ అవుతుంటుంది. అందరూ జంప్ జిలానీలే.
 
 అందుకే ఈ టైటిల్’’ అన్నారు. మరి... నిజజీవితంలో మీరు చేసిన జంప్‌ల గురించి? అన్న ప్రశ్నకు -‘‘స్కూల్ డేస్‌లో నేను కూడా జంప్ జిలానీనే. ఎప్పుడూ జంపింగ్‌లే. సరిగ్గా వెళ్లేదాన్ని కాదు’’ అని చెప్పారు ఇషా. ముద్దు సన్నివేశాలు, ఎక్స్‌పోజింగ్ గురించి తన అభిప్రాయం చెబుతూ -‘‘ఇప్పటివరకు లిప్ లాక్ సీన్స్‌లో నటించమని ఎవరూ అడగలేదు. పనిగట్టుకుని అలాంటి సన్నివేశాలు చేయాలని నాకూ లేదు. ఒకవేళ భవిష్యత్తులో అడిగితే అప్పుడు ఆలోచిస్తా. ఎక్స్‌పోజింగ్ కూడా హద్దులు దాటనంతవరకే బాగుంటుంది. ఆ విషయంలో కొన్ని నియమాలు పెట్టుకున్నా’’ అన్నారు ఇషా చావ్లా. జిలానీనే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement