Jump Jilani
-
Munugode Bypoll: ఆఫర్ భారీ.. ఆపై సారీ!
చౌటుప్పల్ మండలంలోని ఒక సర్పంచ్ ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరారు. ఆయనకు రూ.20 లక్షలు ఆఫర్ చేసి.. అందులో రూ.10 లక్షలే ఇచ్చినట్లు తెలిసింది. మిగతా మొత్తం అడిగితే ఇప్పుడు అప్పుడు అంటూ దాట వేస్తుండటంతో సదరు సర్పంచ్ మిగతా డబ్బులు ఇస్తారా? లేదా? అనే ఆలోచనలో పడ్డారు. చండూరులో ఒక ముఖ్య నేత ఒక ప్రధాన పార్టీలో చేరారు. అక్కడ రూ.40 లక్షలు ఇస్తామని చెప్పారు. డబ్బులు తీసుకొని మళ్లీ ఫిరాయిస్తున్నారని ఆ పార్టీ వెంటనే డబ్బులు ఇవ్వలేదు. దీంతో మరో పార్టీ అదే మొత్తం ఇస్తామంటూ ఆయన్ను సంప్రదించడంతో ఆ పార్టీలో చేరిపోయారు. కానీ వారిచ్చింది రూ.5 లక్షలేనని తెలిసింది. సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో.. వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకుందామనుకుని పార్టీలు మారిన నేతల ఆశలు అడియాశలవుతున్నాయి. భారీ మొత్తాలు ఎరగా వేసి చేర్చుకున్న పార్టీలు, హామీ ఇచ్చిన లేదా ఒప్పందం చేసుకున్న నగదులో సగమో, పావు వంతో ఇచ్చి మిగతా మొత్తానికి రేపు, మాపంటూ ముఖం చాటేస్తుండటంతో.. గోడ దూకిన ప్రతినిధుల పరిస్థితి ‘కక్కలేక మింగలేక’అన్నట్టుగా తయారయ్యింది. స్థాయిని బట్టి రూ.40 లక్షల వరకు.. మునుగోడులో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు.. ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులకు గాలం వేస్తున్నాయి. వలలో వేసుకునేందుకు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపుతున్నాయి. స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆశ చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. ఈ నేపథ్యంలో నేతలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పార్టీలు మారుతున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు వందల సంఖ్యలో నేతలు పార్టీలు మారడం గమనార్హం. కాగా వీరిలో చాలామందికి కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డబ్బులు దక్కలేదని తెలుస్తోంది. ఫిరాయింపు భయంతో కోత.. ఇస్తామన్న డబ్బులు మొత్తం ఇవ్వకపోవడంతో పార్టీలు మారినవారంతా తమను వలలోకి దింపినవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ప్రధాన పార్టీలు ఈ విషయంలో కొంత తెలివిగా వ్యవహరిస్తున్నాయని స్థానిక నేతలు చెబుతున్నారు. డబ్బులు మొత్తం ఇచ్చాక ఒకవేళ వారు మళ్లీ పార్టీ ఫిరాయిస్తే పరిస్థితి ఏమిటన్న జాగ్రత్తతోనే సగమో, పావు వంతో ఇచ్చి మిగతాది తర్వాత ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే.. డబ్బుకు ఆశపడి పార్టీ మారితే అనుకున్న మొత్తం రాకపోగా, పరువు పోయిందని నాంపల్లి మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి వాపోయారు. డబ్బులకు అమ్ముడుపోయారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారిన వారి పరిస్థితి ఇలా ఉంటే.. తాము పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా ఫలితం లేకుండా పోతోందని కొందరు వాపోతున్నారు. ముఖ్యనేతలు తమను పట్టించుకోవడం లేదని, తాము సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారంలో పాల్గొంటున్నామని కొందరు కిందిస్థాయి నేతలు నిరాశ వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరికొన్ని బేరాలు.. – చౌటుప్పల్ మండలంలో ఒక పార్టీకి చెందిన సర్పంచ్ వేరే పార్టీలో చేరారు. రూ.20 లక్షలకు బేరం కుదిరినా అందులో రూ.5 లక్షలే అందినట్లు తెలిసింది. మిగతా మొత్తం అడిగితే అధికారంలోకి వచ్చాక ఇస్తామంటూ దాటవేస్తున్నారని ఆ సర్పంచ్ వాపోతున్నారు. – మునుగోడు మండలంలోని ఒక పార్టీకి చెందిన సర్పంచ్ మరో పార్టీలో చేరారు. ఆయనకు రూ.20 లక్షలు ఇస్తామనే హామీ లభించింది. ఈయనకు కూడా రూ.5 లక్షలే అందాయని, మిగతా మొత్తం ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని తెలిసింది. – నారాయణపూర్ మండలంలో ఒక గ్రామ సర్పంచ్‌తో రూ.10 లక్షలకు బేరం కుదిరింది. తీరా రూ.3 లక్షలే చేతిలో పెట్టి కండువాను కప్పి వదిలేశారు. – నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షుడు ఒకరు రూ.30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నా రూ.5 లక్షలే ఇవ్వడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. -
సొంతగూటికి జంప్ జిలానీలు!
మేడ్చల్: టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’లో భాగంగా ఆ పార్టీలో చేరిన కొందరు టీడీపీ నాయకులు తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ వర్గాల సమాచారం మేరకు.. టీఆర్ఎస్లోకి రెండు నెలల క్రితం మేడ్చల్ మండలానికి అప్పటి టీడీపీ సీనియర్ నాయకులు పెద్దఎత్తున మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డితో కలిసి సొంతగూటిని వీడి అధికార పార్టీలో చేరారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు, బడానేతలంతా గంపగుత్తగా పార్టీని వీడిపోయారు. అయితే, ‘గులాబీతోట’ వారి చేరికకు ముందే హౌస్‌ఫుల్ కావడంతో టీడీపీలో దక్కిన ప్రాధాన్యత జంప్ జిలానీలకు అక్కడ దక్కలేదు. దీంతోవారు తమ సొంతగూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో మేడ్చల్ మండలం టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మండలానికి చెందిన సర్పంచ్‌లు, మేడ్చల్ నగర పంచాయతీకి చెందిన నాయకులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుటున్నారని తెలిసింది. శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపారు. ఈనెల 14న ఆ పార్టీ తెలంగాన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. శామీర్‌పేట్, కీసర మండలాలకు చెందిన కొందరు నాయకులు కూడా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సొంతపార్టీలో ఉన్న వలస నేతలపై, సర్పంచ్‌లపై విమర్శలు గుప్పించడం గమనార్హం. పార్టీ మార్పు విషయం ఆయనకు తెలిసిపోవడంతో విమర్శలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
జంప్ జిలానీలకు కమలం తీర్థం
రారమ్మని.. ముంబై: పొత్తులు బెడి సికొట్టిన నేపథ్యంలో రాష్ట్రం లో రాజకీయ సమీకరణాలు రోజుకో రకంగా మారి పోతున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఆయారాం గయారాంల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార కూటమిలో జంప్ జిలానీల సంఖ్య పెరిగి పోయింది. ఇప్పటివరకు కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులుగా చలామణి అయిన చాలామంది ఒక్కసారిగా బీజేపీ పంచన చేరిపోయారు. తిరుగుబాటు అభ్యర్థుల బెడద ప్రస్తుత సీఎం పృథ్వీరాజ్ చవాన్‌కు సైతం తప్పడంలేదు. కరద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పృథ్వీరాజ్ చవాన్ పోటీచేస్తుండగా, ఇక్కడ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేయనున్న అతుల్భొలాసేకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అలాగే ఇక్కడ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న విలాస్ ఉండాల్కర్ పాటిల్ సైతం పార్టీ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. భొలాసే కాంగ్రెస్ ఎమ్మెల్సీ దిలీప్ దేశ్‌ముఖ్‌కు స్వయాన మేనల్లుడు. అలాగే ఇటీవల ఎన్సీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి సంజయ్ సావ్కరే సైతం భుసావల్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. ఎన్సీపీకే చెందిన మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అయిన బాబన్‌రావ్ పచ్పుటే సైతం శ్రీగొండ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. నాసిక్ జిల్లాకు చెందిన సినార్ ఎమ్మెల్యే మాణిక్‌రావ్ కొకాటే( కాంగ్రెస్) ప్రస్తుతం బీజేపీ నుంచి రంగంలో ఉండనున్నారు. అదేవిధం గా ఎన్సీపీ ఎమ్మెల్యే కిషన్ కథోర్ ముర్బాద్ నుంచి వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. దక్షిణ కొల్హాపూర్‌లో మంత్రి సాతేజ్పాటిల్పై అమ ల్ మహదిక్ బీజేపీ తరఫున పోటీచేస్తున్నాడు. ఇత డు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహదేవ్ మహదిక్కు స్వయాన కుమారుడు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున తన కుమార్తె హీనా బీజేపీ తరఫున నిలబడినందుకు ఎన్సీపీ నుంచి బహిష్కృతుడైన మాజీ మంత్రి విజయ్ కుమార్ గవిట్ ఇప్పుడు తన ఇలాకాలో బీజేపీ తరఫున బరిలో దిగాడు. అలాగే అమరావతిలో మాజీ రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రాజేంద్ర షెకావత్(కాంగ్రెస్)పై మాజీ కాంగ్రెస్ నేత సునీల్ దేశ్‌ముఖ్ బీజేపీ తరఫున పోరుకు సై అంటున్నాడు. ఇదిలా ఉండగా, నాందే డ్ జిల్లా భోకర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎన్సీ పీ నాయకుడైన మాధవ్ కిన్హాల్కర్ ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో నిలబడుతున్నాడు. అలాగే తాస్గాం-కావ్తేమహం కాల్ స్థానంలో ఎన్సీపీకి చెందిన రాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్‌పై ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి అజిత్ ఘోర్పడే ఢీ అంటే ఢీ అం టున్నాడు. ఇదిలా ఉండగా, పలుస్ కాడేగావ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పతంగ్‌రావ్ కదమ్‌పై మాజీ ఎమ్మెల్యే పృథ్వీరాజ్ దేశ్‌ముఖ్ సవాలు విసురుతున్నాడు. దీనికితోడు ఇంతకుముందు కాంగ్రెస్, ఎన్సీపీ సాయంతో ఇండిపెండెంట్లుగా గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ఇప్పు డు బీజేపీ టికెట్‌పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుం టున్నారు. పుణేలోని షిరాలా నియోజకవర్గం నుం చి మూడు సార్లు ఇండిపెండెంట్‌గా గెలిచి ఎన్సీపీ సానుభూతిపరుడిగా పేరుపొందిన శివాజీరావ్ నాయక్ ఇప్పుడు అదే స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేస్తున్నాడు. అలాగే ఇటీవల వరకు నాగ్‌పూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగిన సమీర్ మేఘే ఇప్పుడు బీజేపీ టికెట్‌పై హింగ్నా నియోజకవర్గంలో తనఅదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నవీముంబైలోని బేలాపూర్ సెగ్మెంట్లో ఎన్సీపీ సీనియర్ నాయకుడు గనేష్ నాయక్‌పై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ మందా మాత్రే బీజేపీ తరఫున పోటీచేస్తున్నాడు. పన్వేల్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ ఠాకూర్ ఇప్పుడు బీజేపీ తరఫున అక్కడినుంచే పోటీలో ఉన్నాడు. ముంబైలోని వర్సోవాలో ఎన్సీపీ మాజీ నేత భారతీ లావ్హేకర్ ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగాడు. చంద్రపూర్ జిల్లా వరోరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు చెందిన సాంస్కృతిక శాఖ మంత్రి సంజయ్ దావుతలే ఈ ఎన్నికల్లో బీజే పీ తరఫున నామినేషన్ దాఖలు చేశాడు. కాం గ్రెస్ సీనియర్ నేత నారాయణ్ రాణేకు అత్యంత ఆప్తుడైన రాజన్ తేలీ కొంకణ్ ప్రాంతంలోని సావంత్‌వాడీ నుంంచి బీజేపీ తరఫున రంగంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా, శివసేనపార్టీకి కూడా తిరుగుబాటు బెడద తప్పలేదు. ఆ పార్టీకి చెందిన ముంబై మాజీ మేయర్ శుభా రావుల్ దహిసర్ నుంచి ఈ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ టికెట్‌పై పోటీచేస్తున్నారు. అలాగే ఠాణేలో పార్టీ అభ్యర్థి ఏక్నాథ్ షిండేకు వ్యతి రేకంగా అదే పార్టీకి చెందిన అనంత్ తారే బరిలో నిలబడ్డాడు. రత్నగిరి నుంచి ఎన్సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ్ సామంత్ శనివారం బీజేపీలో చేరి అదే స్థానం నుంచి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. -
జంప్ జిలానీల వల్లే నష్టపోయాం: రఘువీరా
విజయవాడ: కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో లాభపడి చివర్లో బయటకు వెళ్లిన జంప్ జిలానీల వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లో పదవులు అనుభవించి కష్టకాలంలో ఉన్నప్పడు పార్టీని వీడిన నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్యాడర్‌ను బలోపేతం చేసి పార్టీకి పూర్వవైభవం తెస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై మంగళవారమిక్కడ రాష్ట్రస్థాయి నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. -
సినిమా రివ్యూ: జంప్ జిలాని
నటీనటులు: అల్లరి నరేశ్, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్, రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, వేణుమాధవ్, హేమ, రఘుబాబు, కోట శ్రీనివాసరావు దర్శకత్వం: సత్తిబాబు నిర్మాత: అంబికా రాజు సంగీతం: విజయ్ ఎబెనెజెర్ ప్లస్ పాయింట్స్: పర్వాలేదనిపించే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్: కథ, కథనం, సినిమా లెంగ్త్ ఎడిటింగ్ మ్యూజిక్ గతంలో తనదైన స్టైల్ తో కామెడీ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న 'అల్లరి' నరేశ్ ను ఫ్లాఫ్ లు వెంటాడుతున్నాయి. ఇటీవల విడుదలైన 'లడ్డూబాబు' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. లడ్డూబాబు తర్వాత ఓ తమిళ చిత్రం 'కలకలప్పు' రీమేక్ మలిచి తెలుగులో 'జంప్ జిలాని' చిత్రంగా ప్రేక్షకులకు అందించారు. సత్తిబాబు దర్శకత్వంలో అల్లరి నరేశ్ సరసన ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ లు నటించిన ఈ చిత్రం జూన్ 12 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొద్దికాలంగా పరాజయాల బారిన పడిన అల్లరి నరేశ్ కు 'జంప్ జిలాని' ఎలాంటి టాక్ సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ఓసారి కథలోకి వెళ్లాల్సిందే. సత్తిబాబు, రాంబాబు(అల్లరి నరేశ్) ఇద్దరు కవల పిల్లలు. సత్తిబాబు దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే, రాంబాబు చిల్లర దొంగతనాలు, పేకాటతో జల్సా చేసే ఓ పోకిరి లాంటోడు. సత్తిబాబు సోదరులకు నిడుదవోలులో ఒకప్పుడు గొప్పగా పేరు చెప్పుకునే సత్యనారాయణ కాఫీ విలాస్ అనే హోటల్ ఉండేది. అయితే కాలక్రమేణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్ల సంస్కృతి పెరగడంతో హోటల్ నష్టాల్లో కూరుకుపోతుంది. ఎలాగైనా తన వంశానికి గొప్ప పేరు తెచ్చిన హోటల్ కు పూర్వవైభవాన్ని సంపాదించే పట్టుదలతో ఉన్న సత్తిబాబు.. మాధవి(ఫుడ్ ఇన్స్ పెక్టర్)తో ప్రేమలో పడుతాడు. తమ హోటల్ లోనే పనిచేసే తన మరదలు(స్వాతి దీక్షిత్)ను రాంబాబు ప్రేమిస్తుంటాడు. కథ ఇలా సాగుతుండగా.. మాధవి ప్రేమను దక్కించుకోవడానికి సత్తిబాబు రాయలసీమలోని ఓ ప్రాంతానికి వెళ్లాల్సివస్తుంది. అయితే రాయలసీమకు వెళ్లిన సత్తిబాబు విలన్ గ్యాంగ్ వెంటాడుతుంటారు. సత్తిబాబును విలన్ గ్యాంగ్ ఎందుకు వెంటాడుతారు?. సత్తిబాబు, రాంబాబు తమ ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి పీటలు ఎక్కించారా? తమ హోటల్ కు పూర్వ వైభవం తెప్పించడంలో సఫలమయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే 'జంప్ జిలానీ' గతంలో ఎన్నో కామెడి పాత్రలతో ఆలరించిన అల్లరి నరేశ్ సత్తిబాబు, రాంబాబు పాత్రలతో ద్విపాత్రభినయం చేశారు. అయితే గతంలో పోషించిన పాత్రలతో పోల్చితే సత్తిబాబు, రాంబాబుల పాత్రలు విభిన్నమైనవనే ఫీలింగ్ కలుగదు. అల్లరి నరేశ్ రోటిన్ పాత్రలతో ప్రేక్షకులను సంతృప్తి పరించేందుకు ప్రయత్నం చేశారు. ఇషా చావ్లా కొంత ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించినా.. ఆ స్థాయిని చేరుకోలేదనే చెప్పవచ్చు. గ్లామర్ తో కూడా ఆకట్టుకోవడంలో ఇషా విఫలమైంది. స్వాతి దీక్షిత్ పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితమైంది. రాయలసీమలో ఫ్యాక్షన్ నేతగా పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో నటించారు. పాత్రల పరిధి మేరకు రావు రమేశ్ విలనిజంతో కూడిన కామెడీ పండించడంలోనూ తన మార్కును సొంతం చేసుకోలేకపోయారు. రఘుబాబు, వేణుమాధవ్ పాత్రలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. విశ్లేషణ: 'హలో బ్రదర్' లాంటి కాన్సెప్ట్ తో మాస్, క్లాస్ కాంబినేషన్ తో ఈవీవీ చేసిన ప్రయోగాన్ని స్పూర్తిగా తీసుకుని రూపొందించిన సత్తిబాబు, రాంబాబు పాత్రలు ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. కథ లో పస లేకపోవడం, దానికి తోడుగా కథనం కూడా పేలవంగా ఉండటంతో అంతా గందరగోళంగా మారింది. వేణుమాధవ్, రఘుబాబు పాత్రలు సహజంగా హస్యాన్ని పండించలేకపోగా.. సన్నివేశాల మధ్య అవసరం లేకునా దూరిన ఫీలింగ్ కనిపించింది. ఇక చిత్ర నిడివి కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడం ఖాయం. తొలిభాగం, ద్వితీయ భాగం ఫ్లాట్ గా నడిపించి... కైమాక్స్ తో మేనెజ్ చేస్తామని ప్లాన్ అంతగా వర్కవుట్ కాలేకపోయింది. ఈ చిత్ర అధిక భాగం విసిగించే రీతిలో సాగిన కొంతలో కొంత క్లైమాక్స్ ప్రేక్షకుడికి కొంత ఊరట కలిగించే అంశం. ఇక మ్యూజిక్ అంశానికి వస్తే తెలుగు నేటివిటి స్పష్టంగా మిస్సయిందనే చెప్పవచ్చు. విజయ్ ఎబెనెజెర్ సంగీతం తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు దూరంగా ఉంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి అంచనా వేయడంలో సత్తిబాబు తడబాటు గురయ్యారు. పాత చింతకాయ పచ్చడినే 'జంప్ జిలాని' అనే ప్యాక్ అందించారే తప్ప.. పక్కా హస్యాన్ని పంచలేకపోయారు. ఓవరాల్ గా చిత్ర విజయం ఏంటనే ప్రశ్న వేసుకుంటే... బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందితే తప్ప అల్లరి నరేశ్ ఖాతాలో సక్సెస్ చేరుతుంది. ట్యాగ్: ప్రేక్షకులు 'జంప్ జిలాని' -
నిజంగా... ఇది డబుల్ ధమాకా!
‘‘రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే సినిమా ఇది. మొత్తం 72 సన్నివేశాల్లోనూ కావాల్సినంత కామెడీ ఉంది’’ అని దర్శకుడు ఇ. సత్తిబాబు చెప్పారు. అల్లరి నరేశ్ ద్విపాత్రాభినయంలో అంబికా రాజా నిర్మించిన చిత్రం ‘జంప్ జిలానీ’. అంబికా కృష్ణ సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్-రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకుడు. అంబికా రామచంద్రరావు నిర్మాణ నిర్వాహకుడు. ఈ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సత్తిబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ -‘‘తాతల కాలం నాటి హోటల్ని కాపాడుకోవాలనుకునే ఓ మనవడు, ఆ హోటల్ని అమ్మేసి వేరే ఏదైనా వ్యాపారం చేసుకోవాలని తపన పడే మరో మనవడి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఈ రెండు పాత్రలనూ అల్లరి నరేశే చేశారు. మామూలుగా ఒక్క నరేశ్ ఉంటేనే కడుపుబ్బా నవ్వుకుంటాం. ఇక, ఇద్దరు నరేశ్లంటే డబుల్ ధమాకానే. ద్విపాత్రాభినయం నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో రెండు పాత్రలూ తెరపై కనిపించే సన్నివేశాలు తక్కువ ఉంటాయి. కానీ, ఈ సినిమాలో దాదాపు పాతిక సన్నివేశాల్లో ఇద్దరు నరేశ్లూ కనిపిస్తారు. మూడు పాటల్లో కూడా ఈ రెండు పాత్రలూ కనిపిస్తాయి. పంచ్ డైలాగ్‌లతో సినిమా పసందుగా ఉంటుంది. నా ‘యముడికి మొగుడు’ సినిమాకి మంచి సంభాషణలు ఇచ్చిన క్రాంతిరెడ్డి సకినాల ఈ చిత్రానికి కూడా మంచి డైలాగులు రాశాడు. పాత్రలు విసిరే పంచ్ డైలాగ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మరో హైలైట్ పోసాని పాత్ర. ఒక పాటకు పోసాని స్టెప్స్ కూడా వేశారు. తమిళ చిత్రం ‘కలగలప్పు’ ఆధారంగా తీసిన సినిమా అయినప్పటికీ, మాతృకకు చాలా మార్పులు చేశాం’’ అని చెప్పారు. -
నేను కూడా జంప్ జిలానీనే
నేను కూడా జంప్ ‘‘నన్ను చూసి, చాలామంది సున్నిత మనస్కురాలు అనుకుంటారు. నిజంగా కూడా అంతే. కానీ, నా మనస్తత్వానికి భిన్నంగా నెగటివ్ రోల్ చేయాలని ఉంది’’ అంటున్నారు ఇషా చావ్లా. ‘ప్రేమ కావాలి’తో తెలుగులో కథానాయికగా పరిచయమైన ఇషా ఆ తర్వాత మూడు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ‘అల్లరి నరేశ్’ సరసన ఆమె నటించిన ‘జంప్ జిలానీ’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇషా చావ్లా మాట్లాడుతూ - ‘‘ఇందులో నేను హెల్త్ ఆఫీసర్ పాత్ర చేశాను. సినిమాలో ఇతర పాత్రలను డామినేట్ చేస్తుంటాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వినోద ప్రధానంగా సాగే సినిమాలు చేస్తే చాలా హాయిగా ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్ అయితే సినిమాలో మాత్రమే కాదు.. లొకేషన్లో కూడా ఏవేవో జోక్స్ వేసేవారు. దాంతో షూటింగ్ అంతా చాలా సందడిగా సాగింది. దర్శకుడు సత్తిబాబుగారికి తనకేం కావాలో బాగా తెలుసు. ‘సీన్ అర్థమైందా.. ’ అని అడుగుతారు. అర్థం అయ్యిందంటే ‘ఓకే షాట్ తీద్దాం’ అంటారు. లేకపోతే మళ్లీ వివరంగా చెప్పేవారు’’ అని చెప్పారు. ఇంతకీ ‘జంప్ జిలానీ’ అంటే ఏంటి? అనడిగితే - ‘‘ఈ సినిమాలో ప్రతి పాత్ర ఏదో ఒక సందర్భంలో జంప్ అవుతుంటుంది. అందరూ జంప్ జిలానీలే. అందుకే ఈ టైటిల్’’ అన్నారు. మరి... నిజజీవితంలో మీరు చేసిన జంప్ల గురించి? అన్న ప్రశ్నకు -‘‘స్కూల్ డేస్‌లో నేను కూడా జంప్ జిలానీనే. ఎప్పుడూ జంపింగ్‌లే. సరిగ్గా వెళ్లేదాన్ని కాదు’’ అని చెప్పారు ఇషా. ముద్దు సన్నివేశాలు, ఎక్స్పోజింగ్ గురించి తన అభిప్రాయం చెబుతూ -‘‘ఇప్పటివరకు లిప్ లాక్ సీన్స్‌లో నటించమని ఎవరూ అడగలేదు. పనిగట్టుకుని అలాంటి సన్నివేశాలు చేయాలని నాకూ లేదు. ఒకవేళ భవిష్యత్తులో అడిగితే అప్పుడు ఆలోచిస్తా. ఎక్స్పోజింగ్ కూడా హద్దులు దాటనంతవరకే బాగుంటుంది. ఆ విషయంలో కొన్ని నియమాలు పెట్టుకున్నా’’ అన్నారు ఇషా చావ్లా. జిలానీనే! -
వినూత్న తరహాలో జంప్ జిలానీ ఆడియో ఆవిష్కరణ
అల్లరి నరేశ్ ద్విపాత్రాభినయంలో అంబికా రాజా నిర్మించిన చిత్రం ‘జంప్ జిలానీ’. అంబికా కృష్ణ సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్-రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకుడు. విజయ్ ఎజెంజర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో వినూత్న రీతిలో ఆవిష్కరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పారాచ్యూట్లాంటి రెండు ఎయిర్ బెలూన్స్లో చిత్రబృందానికి సంబంధించిన కీలక సభ్యులు, అతిథులు నింగికి ఎగిరారు. అక్కడే మంచు మనోజ్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ ఆడియో వేడుకలో శ్రీధర్ స్వామీజీ, కె. రాఘవేంద్రరావు, రమేష్‌ప్రసాద్, మురళీమోహన్, డి. సురేష్‌బాబు, ‘దిల్’ రాజు, బెల్లంకొండ సురేశ్, లగడపాటి శ్రీధర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఆడియో వేదికపై నిఖిల్ సీడీని ఆవిష్కరించి ఆర్యన్ రాజేష్‌కి ఇచ్చారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ - ‘‘వినూత్న పద్ధతిలో పాటలను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. మా సంస్థపై మరిన్ని మంచి సినిమాలు తీస్తాం’’ అని చెప్పారు. నాన్నగారి తరహా హాస్యం సత్తిబాబులో ఉందనీ, ఈ సినిమాని బాగా తీశాడని నరేశ్ అన్నారు. ఈ నెల 12న సినిమాని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ నిర్వాహకుడు అంబికా రామచంద్రరావు తెలిపారు. సత్తిబాబు మాట్లాడుతూ - ‘‘తమిళంలో విజయం సాధించిన ‘కలగలప్పు’కి ఇది రీమేక్. జంప్ జిలానీ అనే పదాన్ని దాదాపు అందరూ వాడతారు. ఈ సినిమాలో కొన్ని పాత్రలు కథానుగుణంగా జంప్ అవుతుంటాయి’’ అని చెప్పారు. ఈ చిత్రంలో నటించడంపట్ల ఇషా చావ్లా, స్వాతీ దీక్షిత్ తమ ఆనందం వ్యక్తం చేశారు. -
వేసవి వేడిని తగ్గించే వినోదం
‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కలగలప్పు’ చిత్రాన్ని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్పులూ చేర్పులూ చేసి తీస్తున్నాం. తాత సంపాదించిన హోటల్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మనవళ్లు ఏం చేశారన్నదే కథాంశం. ‘అల్లరి’ నరేశ్‌కి సరిగ్గా సరిపోయే కథ ఇది’’ అని చిత్ర సమర్పకులు ‘అంబికా’ కృష్ణ చెప్పారు. అల్లరి నరేశ్, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ కాంబినేషన్లో అంబికా రాజా, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జంప్ జిలాని’. ఇ.సత్తిబాబు దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాలను దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సత్తిబాబు మాట్లాడుతూ -‘‘ఇందులో కొన్ని పాత్రలు కథానుగుణంగా జంప్ అవుతుంటాయి. అందుకే ఈ టైటిల్ పెట్టాం. వేసవి వేడిని తగ్గించేంత వినోదం ఇందులో ఉంటుంది’’ అని చెప్పారు. ఇది నూటికి నూరుశాతం హిట్ మూవీ అవుతుందని ‘అల్లరి’ నరేశ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నెల 26న పాటలనూ, వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్నీ విడుదల చేస్తామని ‘అంబికా’ రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు, స్వాతీ దీక్షిత్, రఘుబాబు, పోసాని, ‘అంబికా’ రామచంద్రరావు తదితరులు మాట్లాడారు. -
జంప్ జిలాని మూవీ స్టిల్స్
-
ఫుడ్ ఇన్స్పెక్టర్తో రొమాన్స్
ఆ అమ్మాయి ఫుడ్ ఇన్స్పెక్టర్. సిన్సియర్ ఉద్యోగి. అలాంటి అమ్మాయిని ప్రేమలో దించుతాడు ఓ అబ్బాయి. ఈ అబ్బాయికి ఓ అన్నయ్య ఉంటాడు. అతనిదో ప్రేమకథ. ఈ అన్నదమ్ములు తన ప్రేమలో ఎంత దమ్ము చూపించారో తెలియాలంటే ‘జంప్ జిలానీ’ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు ఇ. సత్తిబాబు. ఇందులో ‘అల్లరి’ నరేశ్ ద్విపాత్రాభినయం చేశారు. ఇషా చావ్లా, స్వాతీ దీక్షిత్ ఇందులో కథానాయికలు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అంబికా కృష్ణ సంయుక్త సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అంబికా రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ ‘హలో బ్రదర్’ను మించే రీతిలో ఈ సినిమా పూర్తి వినోదభరితంగా ఉంటుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘రీరికార్డింగ్ పూర్తయింది. ఈ నెలా ఖరున పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం. ‘మనం’ సినిమాతో ఈ సినిమా ప్రచార చిత్రాన్ని అన్ని థియేటర్లకు పంపిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఎబెంజర్, కెమెరా: దాశరథి శివేంద్ర. -
‘హలో బ్రదర్’ని తలపించేలా...
వారసత్వంగా వస్తున్న ఆస్తిని కాపాడుకోడానికి ఓ కుర్రాడు ఎన్ని పాట్లు పడ్డాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోన్న హాస్యభరిత చిత్రం ‘జంప్ జిలాని’. అల్లరి నరేశ్ తొలిసారి అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు దర్శకుడు. అంబికా రాజా నిర్మాత. ఇషా చావ్లా, సాక్షి దీక్షిత్ కథానాయికలు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘‘హలో బ్రదర్’లో నాగార్జునగారి ద్విపాత్రాభినయాన్ని తలపించేలా ఇందులో అల్లరి నరేశ్ పాత్రలు సాగుతాయి. ఇందులో ఇషా చావ్లా ఫుడ్ ఇన్స్పెక్టర్గా నటిస్తోంది. నాన్‌స్టాప్ ఎంటర్టైనర్గా ఉంటుందీ సినిమా’’ అని తెలిపారు. ‘‘తమిళ చిత్రం ‘కలగలప్పు’కు ఈ చిత్రం రీమేక్. రెండు పాత్రల్లో నరేశ్ కావల్సినంత వినోదాన్ని పంచుతారు. ఇందులోని ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్వించేలా ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకాక్, పుకెట్లలో నరేశ్, ఇషా, సాక్షి దీక్షిత్‌లతో పాటల్ని తీస్తున్నాం. ఓ వైపు రీ-రికార్డింగ్ కూడా జరుగుతోంది’’ అని నిర్మాత చెప్పారు. విజయ్ ఎబెంజర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేసి, మే నెలలో సినిమాను విడుదల చేస్తామని సమర్పకుడు అంబికా కృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అంబికా కృష్ణ బ్రదర్స్. -
జంపింగ్లదే జోరు!
* అన్ని పార్టీల్లోనూ ఇదే లేటెస్టు ట్రెండ్.. అర్ధరాత్రి దాకా చర్చలు * వారి కోసం వేచి చూసి మరీ టికెట్లు కేటాయిస్తున్న పార్టీలు * ఆఖరి క్షణంలో పార్టీ తీర్థం పుచ్చుకుని బీ-ఫారంతో బరిలోకి * చివరి నిమిషం వరకు పార్టీల జాబితాల్లో ఖాళీలు * టీఆర్ఎస్లోకి అత్యధికంగా చేరికలు.. వెనువెంటనే టికెట్లు * 36 గంటల్లో మూడు పార్టీలు మారిన మైనంపల్లి హన్మంతరావు సాక్షి, హైదరాబాద్: మునుపెన్నడూ లేని విధంగా.. అన్ని పార్టీలూ జంప్ జిలానీల కోసం నిరీక్షిస్తున్న దృశ్యాలు.. వారి కోసం అభ్యర్థుల జాబితాల్లో ఖాళీలు.. నామినేషన్ల గడువు ముగుస్తున్నా అర్ధరాత్రి దాకా మంతనాలు.. ఏ పార్టీ నాయకుడు ఏ గంటలో ఏ పార్టీ శిబిరంలోకి వెళ్లాడో, ఏ పార్టీ తీర్థం పుచ్చుకుని, ఏ స్థానానికి టికెట్టు పొందాడో అర్థం కాని పరిస్థితి! గత పదీ పదిహేను రోజులుగా అన్ని శిబిరాల్లోనూ ఈ తంతు కొనసాగుతున్నా సోమ, మంగళవారాల్లో ఇది పరాకాష్టకు చేరుకుంది. ఇలా వచ్చి కండువా కప్పుకోవడం, అలా పార్టీ బీ- ఫామ్ తీసుకుని వెళ్లిపోవడం..! ఈ వరుసలో కొత్త రికార్డులు బద్దలవుతున్నాయి.. ఒక శాసనసభ్యుడైతే 36 గంటల్లో మూడు పార్టీలు మారిపోయాడు. అసెంబ్లీ కోసం ప్రయత్నిస్తే ఏకంగా పార్లమెంటు స్థానమే దక్కింది. మరో నాయకుడి స్థానం పొత్తులో గల్లంతు కావడమే కాదు.. అనుకోకుండా దక్కిన పార్టీ జిల్లా అధ్యక్ష పదవీ గంటలోపే జారిపోయింది! గెలుపు గుర్రమా, కాదా.. అనేదే ప్రాతిపదిక..! రాజకీయ సమీకరణాలు, కులాల వారీ ఓట్ల లెక్కలు, ప్రత్యర్థుల బలాబలాలు.. ఈ అంచనాల్లోనే ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ తలమునకలైపోయాయి! పార్టీ జంప్ చేయ్.. మా పార్టీ తీర్థం పుచ్చుకో.. ఆ వెంటనే టికెట్ అందుకో..! ఇదీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఆఖరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి తమతమ పార్టీల్లో చేరే అభ్యర్థులకు ఇస్తున్న బంపర్ ఆఫర్! ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించగానే.. ఆ నియోజకవర్గాల్లోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకుంటున్నారు. రాజకీయంగా బలమైన నాయకులు లేని నియోజకవర్గాల్లో అసంతృప్త నాయకులను చేరదీసి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు దీటుగా రంగంలోకి దించే ఎత్తులు వేస్తున్నారు. నిన్నటి వరకు ప్రత్యర్థి పార్టీలో ఉన్నాసరే.. మరుసటి రోజు పార్టీ మారితే చాలు టికెట్ ఖాయమైపోతోంది. తెలంగాణలో ఇలాంటి జంప్ జిలానీల హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా.. అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చివరి నిమిషంలో చేరికలు అధికంగా ఉన్నాయి. మంగళవారం అంతటా టీఆర్ఎస్ శిబిరంలో ఇదే సందడి నెలకొంది. అలా చేరిన వారందరికీ టికెట్లు కేటాయించడం గమనార్హం. సోమ, మంగళవారాల్లోని పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే... * సీపీఎం పార్టీకి సోమవారం గుడ్‌బై చెప్పిన నోముల నర్సింహయ్య.. మంగళవారం టీఆర్ఎస్లో చేరి నాగార్జునసాగర్ టికెట్ పొందారు. * కాంగ్రెస్ నుంచి వచ్చిన గుర్నాథరెడ్డికి కోడంగల్, టీడీపీ నుంచి వచ్చిన ముఠాగోపాల్‌కు ముషీరాబాద్, కొలను హన్మంతరెడ్డికి కుత్బుల్లాపూర్, టీడీపీ నుంచే వచ్చిన ప్రేమ్కుమార్ధూత్కు గోషామహల్, మనోహర్‌రెడ్డికి మహేశ్వరం, కాంగ్రెస్ నుంచి వచ్చిన రామ్మోహన్‌గౌడ్‌కు కండువా కప్పేసి ఎల్బీనగర్ టికెట్లు ఇచ్చేశారు. * సీపీఐ నుంచి వచ్చిన చంద్రావతికి టీఆర్ఎస్ వెంటనే టికెట్ కేటాయించింది. * కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన వనమా వెంకటేశ్వరరావుకు కొత్తగూడెం స్థానం కేటాయించారు. * తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు వుంగళవారం టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి వరంగల్ జిల్లాలో ఏ స్థానం లేకపోవడంతో వరంగల్ మేయర్ పదవి ఇస్తావుని ఆశచూపినట్లు సమాచారం. * కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఫిరోజ్ఖాన్కు నాంపల్లి, ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహాం టీడీపీలో చేరిన తరువాత అదే నియోజకవర్గం టికెట్‌ను కేటాయించారు. * టీఆర్ఎస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుకు బోథ్ స్థానం కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు. * వైఎస్సార్ సీపీ నుంచి వచ్చిన పుట్ట మధుకు టీఆర్ఎస్ మంథని టికెట్ కేటాయించింది. * మెదక్ పార్లమెంటు స్థానం పరిస్థితీ ఇదే. ఈ స్థానంలో వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్గా ఉన్న డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించారు. సిట్టింగ్ ఎంపీ విజయశాంతిని తప్పించి మెదక్ అసెంబ్లీకి పంపించటం విశేషం. * ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రఘునందన్‌రావుకు మంగళవారం దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ కేటాయించింది. * తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వివిధ జేఏసీ నేతలకు కాంగ్రెస్, టీఆర్ఎస్లు టికెట్లు పంపిణీ చేశాయి. టీఆర్ఎస్ ఐదుగురికి, కాంగ్రెస్ ముగ్గురికి టికెట్లు కేటాయించింది. గతంలో వీరు ఏ పార్టీలో లేకపోయినా కొత్తగా వీరికి టికెట్లు ఇచ్చారు. టీఆర్ఎస్ నుంచి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, శ్రీనివాస్‌గౌడ్, సహోదర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, పిడమర్తి రవిలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, గజ్జెల కాంతం, కత్తి వెంక టస్వామి ఉన్నారు. * గత 15, 20 రోజుల్లో జరిగిన పార్టీ ఫిరాయింపులనూ లెక్కలోకి తీసుకుంటే అన్ని పార్టీల్లోనూ కలిపి.. ఇలా వేరే పార్టీల్లోకి జంప్ చేయుగానే టికెట్లు దక్కించుకున్న వారి సంఖ్య దాదాపు 35- 40 వరకూ ఉంటుందని అంచనా! * వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన భట్టి జగపతికి మెదక్ అసెంబ్లీ టికెట్ దక్కింది. 36 గంటల్లో మూడు పార్టీలు టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు 36 గంటల్లో మూడు పార్టీలు మారి చివరాఖరుకు తెలంగాణ రాష్ట్ర సమితిలో తేలారు. ఆయనకు మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఆదివారం నాడు టీడీపీ - బీజేపీ పొత్తులో భాగంగా మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో టీడీపీకి రాజీనామా చేసి, సోమవారం తెల్లవారే సరికల్లా మైనంపల్లి హనుమంతరావు ఢిల్లీలో వార్‌రూమ్‌లో దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరిపోవడం జరిగిపోయింది. కానీ.. సోమవారం సాయంత్రానికి కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో పేరు కనపడకపోయేసరికి దిమ్మతిరిగిన హన్మంతరావు ఆ వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో మంతనాలు జరిపారు. ఇంకేముంది మంగళవారం సాయంత్రానికి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం.. ఆ వెంటనే మల్కాజిగిరి టీఆర్ఎస్ లోక్‌సభ టికెట్ ఖాయమైనట్టు తెలిసింది. -
జంప్ జిలానీ ఎవరు?
‘సుడిగాడు’ తర్వాత అల్లరి నరేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జంప్‌జిలానీ’. ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ కథానాయికలు. అంబికా కృష్ణ సమర్పణలో అంబికా రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు నిర్మాత. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం గురించి అంబికా కృష్ణ మాట్లాడుతూ -‘‘తమిళంలో విజయం సాధించిన ‘కలగలప్పు’ చిత్రం కథకు పునర్నిర్మాణం ఈ సినిమా. ‘కలగలప్పు’ని ప్రేక్షకుల సమక్షంలో చూశాను. అద్భుతమైన స్పందన. ప్రపంచమంతా మెచ్చే కథ అనిపించింది. వెంటనే పునర్నిర్మాణ హక్కులు సొంతం చేసుకున్నాం. యూటీవీ సంస్థ ఈ కథను హిందీ, మలయాళ భాషల్లో నిర్మిస్తోంది. తెలుగులో కూడా ఈ చిత్రం విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అని తెలిపారు. అనుభవజ్ఞులైన నటీనటులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న చిత్రం ఇదని, దర్శకుడు సత్తిబాబు పూర్తి వినోదాత్మకంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని, రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు చెప్పారు. నరేష్ కెరీర్లోనే చెప్పుకోదగ్గ విజయంగా ఈ చిత్రం నిలుస్తుందని చిత్ర నిర్మాణసారథి అంబికా రామచంద్రరావు తెలిపారు. కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, చలపతిరావు, రఘుబాబు, రావురమేశ్, సన, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: సుందర్.సి, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, రచనా సహకారం: సతీశ్ వేగేశ్న, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: విజయ్ ఎబెంజర్, పాటలు: రామజోగయ్యశాస్త్రి.