జంప్‌ జిలానీల వల్లే నష్టపోయాం: రఘువీరా | congress lost in election with Jump Jilanis | Sakshi
Sakshi News home page

జంప్‌ జిలానీల వల్లే నష్టపోయాం: రఘువీరా

Published Tue, Jun 17 2014 6:38 PM | Last Updated on Wed, Aug 29 2018 6:00 PM

జంప్‌ జిలానీల వల్లే నష్టపోయాం: రఘువీరా - Sakshi

జంప్‌ జిలానీల వల్లే నష్టపోయాం: రఘువీరా

విజయవాడ: కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో లాభపడి చివర్లో బయటకు వెళ్లిన జంప్‌ జిలానీల వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లో పదవులు అనుభవించి కష్టకాలంలో ఉన్నప్పడు పార్టీని వీడిన నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్యాడర్‌ను బలోపేతం చేసి పార్టీకి పూర్వవైభవం తెస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై మంగళవారమిక్కడ రాష్ట్రస్థాయి నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement