
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా సాధన సమితి ఈ నెల 16న తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపట్టిన బంద్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. కేంద్రంపై ఒత్తిడి తేచ్చేందుకే దీక్షలు, నిరసనలు ప్రారభించినట్టు తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ పోరాటాన్ని ఉధృతం చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళనం చేయడమే అని విమర్శించారు. బంద్‌లో తెలుగు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రఘువీరా కోరారు. కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరుకు నిరసనగా సాధన సమితి 16వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment