రఘువీరారెడ్డి అరెస్ట్‌.. పీఎస్‌కు తరలింపు | N Raghuveera Reddy Arrested For Attempting To Stage Dharna | Sakshi
Sakshi News home page

రఘువీరారెడ్డి అరెస్ట్‌.. పీఎస్‌కు తరలింపు

Published Fri, Mar 2 2018 1:12 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

N Raghuveera Reddy Arrested For Attempting To Stage Dharna - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం చేస్తున్నవారిని సీఎం చంద్రబాబు అరెస్ట్ చేయించడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. పోలీసులు ఆయనతో పాటు కాంగ్రెస్‌ నాయకులను అరెస్ట్‌ చేసి కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. చంద్రబాబు తన కేసుల కోసమే కేంద్రానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు సిగ్గుంటే ముందు తన కేంద్ర మంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు.

హైవేపై ఆగిన ట్రాఫిక్‌
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కడప-తిరుపతి జాతీయ రహదారిని కాంగ్రెస్‌ నాయకులు దిగ్బంధించారు. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement