ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో రొమాన్స్ | Food Inspector Romance | Sakshi
Sakshi News home page

ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో రొమాన్స్

Published Fri, May 16 2014 10:26 PM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM

ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో రొమాన్స్ - Sakshi

ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో రొమాన్స్

ఆ అమ్మాయి ఫుడ్ ఇన్‌స్పెక్టర్. సిన్సియర్ ఉద్యోగి. అలాంటి అమ్మాయిని ప్రేమలో దించుతాడు ఓ అబ్బాయి. ఈ అబ్బాయికి ఓ అన్నయ్య ఉంటాడు. అతనిదో ప్రేమకథ. ఈ అన్నదమ్ములు తన ప్రేమలో ఎంత దమ్ము చూపించారో తెలియాలంటే ‘జంప్ జిలానీ’ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు ఇ. సత్తిబాబు. ఇందులో ‘అల్లరి’ నరేశ్ ద్విపాత్రాభినయం చేశారు. ఇషా చావ్లా, స్వాతీ దీక్షిత్ ఇందులో కథానాయికలు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, అంబికా కృష్ణ సంయుక్త సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అంబికా రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ -‘‘ ‘హలో బ్రదర్’ను మించే రీతిలో ఈ సినిమా పూర్తి వినోదభరితంగా ఉంటుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘రీరికార్డింగ్ పూర్తయింది. ఈ నెలా ఖరున పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం. ‘మనం’ సినిమాతో ఈ సినిమా ప్రచార చిత్రాన్ని అన్ని థియేటర్లకు పంపిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఎబెంజర్, కెమెరా: దాశరథి శివేంద్ర.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement