వేసవి వేడిని తగ్గించే వినోదం | Comedy which reduces summer heat | Sakshi
Sakshi News home page

వేసవి వేడిని తగ్గించే వినోదం

Published Wed, May 21 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

వేసవి వేడిని తగ్గించే వినోదం

వేసవి వేడిని తగ్గించే వినోదం

 ‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కలగలప్పు’ చిత్రాన్ని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్పులూ చేర్పులూ చేసి తీస్తున్నాం. తాత సంపాదించిన హోటల్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మనవళ్లు ఏం చేశారన్నదే కథాంశం. ‘అల్లరి’ నరేశ్‌కి సరిగ్గా సరిపోయే కథ ఇది’’ అని చిత్ర సమర్పకులు ‘అంబికా’ కృష్ణ చెప్పారు. అల్లరి నరేశ్, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ కాంబినేషన్‌లో అంబికా రాజా, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జంప్ జిలాని’. ఇ.సత్తిబాబు దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాలను దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సత్తిబాబు మాట్లాడుతూ -‘‘ఇందులో కొన్ని పాత్రలు కథానుగుణంగా జంప్ అవుతుంటాయి. అందుకే ఈ టైటిల్ పెట్టాం. వేసవి వేడిని తగ్గించేంత వినోదం ఇందులో ఉంటుంది’’ అని చెప్పారు. ఇది నూటికి నూరుశాతం హిట్ మూవీ అవుతుందని ‘అల్లరి’ నరేశ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నెల 26న పాటలనూ, వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్నీ విడుదల చేస్తామని ‘అంబికా’ రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు, స్వాతీ దీక్షిత్, రఘుబాబు, పోసాని, ‘అంబికా’ రామచంద్రరావు తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement